Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం… ఆహా… ఏవీ నాటి ఆర్ద్ర గీతాలు…?

October 15, 2022 by M S R

Bharadwaja Rangavajhala………….   మీ కోసం జీవితమంతా వేచాను … రాజన్ నాగేంద్ర…యాభై దశకంలో తెలుగు సినిమా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన సంగీత దర్శక ధ్వయం. కర్ణాటక మైసూరు శివరాంపేట నుంచి వచ్చిన అన్నదమ్ములతో ఎక్కువ సినిమాలకు పనిచేసిన దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, జంధ్యాల. అంతకుముందే వారు విఠలాచార్య గారి సినిమాలతో సహా కొన్ని తెలుగు చిత్రాలకు పన్జేశారు.

కానీ ఈ ఇద్దరి సినిమాల్లోనూ ముఖ్యంగా వేటూరి కాంబినేషన్ లో వచ్చిన పాటలూ గొప్పగా ఉంటాయి. నవగ్రహ పూజా మహిమలో ఎవ్వరో ఎందుకీరీతి సాధింతురో లాంటి పాటలున్నప్పటికీ .. ఈ ఇద్దరు దర్శకుల చిత్రాలకూ అధికంగా పాటలు రాసింది వేటూరి సుందరరామమూర్తి. వీళ్లు లేకపోయుంటే … పండగంటి వెన్నెలలన్నీ దండగ చేసుకోకూడదని మనకెలా తెలిసేది?

సింగీతం శ్రీనివాసరావు అంటే కమల్ హసన్ కు స్పెషల్ ఇంట్రస్టు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలి స్ట్రెయిట్ తెలుగు చిత్రం సొమ్మొకడిది సోకొకడిది. ఈ చిత్రానికి రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు. రాధమ్మ మనసు రాగాలు తెలుసు… అది తీపికోపాల వయసు అంటూ వేటూరి కలం పోయే గడుసు వయ్యారాలను అందంగా తమ స్వరంలోకి పొదిగారు రాజన్ నాగేంద్రలు.

Ads

సింగీతం కాంబినేషన్ లోనే వచ్చిన మరో మూవీ పంతులమ్మ. నవతా కృష్ణంరాజు తీసిన రెండో సినిమా ఇది. ఇందులో రాజన్ నాగేంద్ర వేటూరి త్రయం. ప్రతి పాటా ఆణిముత్యమే. పండగంటి వెన్నెలంతా దండగైపోతోంది చందరయ్యా… మానసవీణా మధుగీతం… ఇలా ఏ పాటనూ కాదనలేని రేంజ్ లో ఉంటాయి. ముగ్గురూ కల్సి తెలుగు ప్రేక్షకులకు చేసిన సంగీతపు విందు పంతులమ్మ.

నవతా బ్యానర్ లోనే పర్వతనేని సాంబశివరావు డైరక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ ఇంటింటి రామాయణం. ఆ చిత్రానికీ రాజన్ నాగేంద్రలనే సంగీత దర్శకులుగా తీసుకున్నారు నవతా కృష్ణంరాజు. వేటూరి వారితో తన అభిరుచికి తగ్గ పద్దతిలో ఓ ఆహ్లాదకరమైన డ్యూయట్ రాయించుకున్నారు. మల్లెలు పూచే… వెన్నెల కాచే అంటూ సాగుతుందా గీతం.

nagendra

జంధ్యాల సినిమాలకు సహజంగానే వేటూరి రాసేవారు. వేటూరి కాకుండా జ్యోతిర్మయి గారు రాసిన చిత్రం మూడుముళ్లు. అందులో లేత చలి గాలులో గీతం వేసవిలో విన్నా… చలేస్తుంది… అంతగా ప్రభావితం చేసే ట్యూనది. నవతా బ్యానర్ లో ఇంటింటి రామాయణం చిత్రానికి జంధ్యాల కేవలం డైలాగు రైటర్. ఆ తర్వాత తీసిన నాలుగు స్థంభాలాటకు డైరక్టరు. ఇద్దరి అభిరుచుల మేరకు రాజన్ నాగేంద్రలనే ప్రిఫర్ చేశారు.

ఆ సినిమా కూడా మ్యూజికల్ గా చాలా పెద్ద విజయం సాధించింది. చినుకులా రాలి… లాంటి వేటూరి మార్క్ కవిత్వం సినిమాకు కొత్తందాల్ని తెచ్చింది. పర్వతనేని సాంబశివరావు డైరక్ట్ చేసిన కృష్ణ సినిమా అల్లరి బావకూ రాజన్ నాగేంద్రలే స్వరకర్తలు. ఆ సినిమాకు వేటూరి సింగిల్ కార్డ్ రిలిక్ రైటర్. మధువనిలో రాధికవో అంటూ సాగే ఓ ఆహ్లాదకరమైన డ్యూయట్ ఈ కాంబినేషన్ లో వచ్చినదే.

పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది… అంటూ సాగే ఓ అందమైన యుగళగీతం పులి బెబ్బులి సినిమాలో వినిపిస్తుంది. కె.ఎస్.ఆర్ దాస్ లాంటి ఫక్తు కమర్షియల్ డైరక్టర్ సినిమాలో ఈ తరహా గీతాన్ని ఎక్స్ పెక్ట్ చేయడం కష్టమే. కృష్ణంరాజు, చిరంజీవి నటించిన మల్టీ స్టారర్ మూవీ అయినా .. పులి బెబ్బులిలో పాటలన్నీ రాజన్ నాగేంద్రల స్టైల్ లోనే నడవడం విశేషం.

రాజన్, నాగేంద్ర, వేటూరి ఉండడం వల్లే నాగమల్లి సినిమా బిజినెస్ అయి విడుదలైంది, లేకపోతే అంతే అనేశారు దర్శకుడు దేవదాస్ కనకాల నాతోనే … అంతటి ప్రభావవంతమైన కాంబినేషన్ వీళ్లది … జంధ్యాల కెరీర్ లో ఎక్కువగా ఇద్దరు సంగీత దర్శకులతో పనిచేయడానికి ఇష్టపడేవారు. ఒకరు రమేష్ నాయుడు తప్పితే రాజన్ నాగేంద్ర.

rajan nagendra

రెండు జళ్ల సీతకు రమేష్ నాయుడు సంగీతం అందిస్తే… రెండు రెళ్లు ఆరుకు రాజన్ నాగేంద్రలు మ్యూజిక్ కంపోజ్ చేశారు. అందులో వేటూరి మార్క్ చిలిపి గీతం ఒకటి మెరుస్తుంది. చిరుగాలి దరఖాస్తు లేకుంటే కరిమబ్బు… మెరుపంత నవ్వునా…చినుకైన రాల్చునా అంటూ నడుస్తుందీ పాట నడక.

చిలిపి కవిత్వమే కాదు…అందంగా జీవన వేదాంతాన్ని కూడా చెప్పగలగడం వేటూరి స్పెషాల్టీ. ఇలాంటి సందర్భం వంశీ మంచు పల్లకీలో వచ్చింది. ఆ చిత్రానికి రాజన్ నాగేంద్రలనే సంగీత దర్శకులుగా నియమించుకున్నాడు వంశీ. హీరోయిన్ నవ్వుతూ కనిపిస్తుందిగానీ… ఆ నవ్వులను కబళిస్తూ… ఆమె ఆరోగ్యం శిధిలమైపోతూ ఉంటుంది. అందుకే మంచు పల్లకీ అని టైటిల్ పెట్టుకున్నారు. దేహాన్ని మేఘంతో పోలుస్తూ… కురిసినా…. మెరిసినా… కరుగునే జీవనం అంటాడు.

ఈ పాటకోసం సొంత ట్యూను కడతాను అన్నప్పటికీ తమిళ మాతృకలో శంకర్ గణేశ్ లు స్వరపరచిన గజల్ బేస్ట్ ట్యూనునే తీసుకోమని నిర్మాతలు బలవంతం పెట్టేసరికి దాంతోనే కొనసాగారు రాజన్ నాగేంద్రలు. చినుకులా రాలి … నదులుగా సాగి వరదలైపోయిన సంగీత సాహిత్య సమాగమం వేటూరి, రాజన్, నాగేంద్ర. ఈ త్రయం మనకందించిన అపురూప గీతాలు అనేకం. మీ కోసం జీవితమంతా వేచాను సంధ్యలలో … అని ముగ్గురి గురించీ పాడుకోవడం తప్ప మనం ఏం చేయగలం … (బాలును కూడా కలిపితే విశిష్ట చతుష్టయం…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions