Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మమత అహం మీద ఛెళ్లుఛెళ్లుమని… ఈ ఇద్దరు మహిళల విజయాలు…

May 5, 2026 by M S R

.

రాజకీయాల్లో Every small thing counts … బెంగాల్‌లో ఓ మహిళ ముఖ్యమంత్రి దారుణ పరాజయం, చివరకు తన సీటులో కూడా స్వీయ ఓటమి ఎంత చర్చనీయాంశమో… ఇద్దరు మహిళల విజయం కూడా ఓసారి చెప్పుకోవాలి… మమత అధికారం విరిగిపడటానికి అనేక కారణాలు ఉండొచ్చు.,. కానీ మరో రెండు కారణాలు, ఆ ఇద్దరు మహిళలూ ఓ కారణమే…

ఒకరి పేరు… రేఖ పాత్ర (Rekha Patra)… సందేశ్‌ఖాలీ ఘటనలో బాధితుల తరపున పోరాటం చేసిన ఒక సామాన్య మహిళ.,.. ఆమె పేరు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో, జాతీయ స్థాయిలో ప్రముఖంగా వినిపించింది… సందేశ్‌ఖాలీలో షేక్ షాజహాన్, అతని అనుచరులు చేసిన అకృత్యాలకు వ్యతిరేకంగా గళం ఎత్తిన మొదటి మహిళల్లో రేఖ పాత్రా ఒకరు… లైంగిక వేధింపులు, భూకబ్జాలకు వ్యతిరేకంగా మహిళలను సమీకరించి నిరసనల్లో కీలక పాత్ర పోషించింది… ఆ దుష్ట గ్యాంగుకు మమతా బెనర్జీ మద్దతు… అధికారం తలకెక్కి…

Ads

ఆ గ్యాంగు రాత్రి వేళల్లో మహిళలను పార్టీ కార్యాలయాలకు పిలిపించి లైంగికంగా వేధించేవారు… స్థానిక రైతుల భూములను బలవంతంగా లాక్కొని, వాటిని చేపల చెరువులుగా మార్చారు… స్వయంగా వేధింపులకు గురైన బాధితురాలిగా ఉండి కూడా, భయం లేకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడం, కోర్టు వరకు వెళ్లడం ద్వారా రేఖ ఇతర మహిళల్లో ధైర్యాన్ని నింపింది…

ఆమె పోరాటాన్ని గుర్తించిన భారతీయ జనతా పార్టీ (BJP) 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమెను బసిర్‌హత్ (Basirhat) నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది… ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆమెతో ఫోన్‌లో మాట్లాడి, ఆమెను ‘శక్తి స్వరూపిణి’ అని అభివర్ణించాడు… ఆమె అభ్యర్థిత్వం ద్వారా సందేశ్‌ఖాలీ మహిళల ఆవేదనను రాజకీయ చర్చగా మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషించింది… కానీ ఓడిపోయింది…

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆమెకు మరోసారి అవకాశం ఇచ్చి హింగల్‌గంజ్ (Hingalganj) అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయించింది… ఈసారి ఆమె 5,421 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది… ఎంపీ ఎన్నికల్లో వచ్చిన సానుభూతి, సందేశ్‌ఖాలీ ఉద్యమ ప్రభావం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను గెలిపించాయని చెప్పవచ్చు… సందేశ్‌ఖాలీ ప్రాంతం కూడా ఈ హింగల్‌గంజ్ నియోజకవర్గ పరిధిలోనికే రావడం విశేషం…

two ladies

మరొకరి పేరు… రత్న దేబ్‌నాథ్… ఈమెది మరో విజయం… రాజకీయాల్లో “మానవీయ కోణం” (Human Element) ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఈ రెండు విజయాలు నిదర్శనాలు… రేఖ పాత్రా విజయం ఒక పోరాట ఫలితమైతే, ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి రత్న దేబ్‌నాథ్ విజయం ఒక ఆవేదన నుండి పుట్టిన ప్రజా తీర్పు… ఈ రెండు కేసులు రాష్ట్రంలో మహిళల దుస్థితి మీద విస్తృతచర్చకు దారితీశాయి…

ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ఓ ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది… డాక్టర్లు ఉద్యమించారు భద్రత కోరుతూ… మమత చాలా తేలికగా తీసుకుంది… ఆత్మహత్య అని కప్పిపుచ్చాలనుకుంది… నిందితులకు మద్దతుగా నిలిచింది… అదుగో, ఆ బాధితురాలి తల్లే ఈ రత్న… ఈ రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు మమత ప్రభుత్వానికి తలంటింది… కానీ ఆమె పట్టించుకోలేదు…

ఆమెకు కూడా పాణిహతి నుంచి పోటీచేయడానికి బీజేపీ టికెట్ ఇచ్చింది… సాధారణంగా ఎన్నికల్లో ధన బలం, అంగ బలం పనిచేస్తాయని అంటుంటారు… కానీ, ఇలాంటి సందర్భాల్లో ప్రజలు “నైతికత” (Morality), మానవీయత (Humanity) వైపు మొగ్గు చూపుతారు… వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే బాధితులే చట్టసభలకు వెళ్లడం ప్రజాస్వామ్యంలో ఒక కీలక పరిణామం… రత్న దేబ్‌నాథ్ 28,836 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందింది..! If the System Fails – Be the System 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మమత అహం మీద ఛెళ్లుఛెళ్లుమని… ఈ ఇద్దరు మహిళల విజయాలు…
  • మోడీ అశ్వమేధం… ఒక్కో రాజ్యాన్ని ఆక్రమిస్తూ… కాషాయ సామ్రాజ్యం…
  • నీ పో మోనే విజయ్… రేవంత్ స్లోగన్ పేలింది… విజయన్ ఇంటికి…
  • ఆ ‘కార్తీక దీపం’ ఆర్పాలని చూసిన స్టాలిన్… తనే ఆరిపోయాడు…
  • కేసీయార్‌పై మరో పిడుగు..! కరెంటు అక్రమాలపైనా సీబీఐ ఎందుకంటే..!?
  • ఎవరు గెలిచినా ఊడబొడిచేదేమీ లేదు… కానీ ఫైనల్స్‌లాగే ఆడారు…
  • ‘‘బీజేపీ తొండాట… ఈవీఎం, సర్, కేంద్ర బలగాలు… లేకపోతే మాదే గెలుపు…’’
  • విజయ్‌కు స్పేస్ ఎలా దొరికింది..? తమిళ రాజకీయాల్లో ఓ కీలక పరిణామం..!!
  • మమత ఎందుకు ఓడిందంటే..? బెంగాల్ ఎలా విముక్తం అయ్యిందంటే..?
  • పుదుచ్చేరి..! బీజేపీ సౌత్ స్ట్రాటజీకి బ్లూప్రింట్… ప్రయోగం సక్సెస్…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions