Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విస్మయ ! సూపర్ స్టార్ కూతురు ! హీరోయిన్‌గా మూవీల్లోకి ఎంట్రీ !!

August 7, 2026 by M S R

.

మన తెలుగు ఇండస్ట్రీలోనే ఈ వికారం… ప్రముఖ హీరోల బిడ్డలు సినిమాల్లోకి వస్తానంటే ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు… రానివ్వరు… నాన్సెన్స్, ఈ ఛండాలమైన వాతావరణంలో మన దేవుళ్లవంటి హీరోల బిడ్డలు మైలపడిపోవాలా అన్నట్టు ఫీలవుతారు…

ఒకవేళ ఆ బిడ్డలకు కూడా సినిమా రంగం మీద ఇంట్రస్ట్ ఉంటే… ‘‘అంటీముట్టని’’ అత్తిపత్తి కేరక్టర్లు మాత్రమే చేయాలి… సగటు హీరోయిన్లలాగా వేషాలు వేస్తే అంగీకరించరు… అసలు ఆ హీరోలకన్నా ఈ ఫ్యాన్స్‌కే మగాధిపత్యం… కాస్ట్యూమ్స్ డిజైనర్ అయిపో, నిర్మాతగా ఉండు, అంతే తప్ప తెరపై తైతక్కలాడొద్దు… ఇలా… (ఉదాహరణలు బోలెడు)…

Ads

కానీ మలయాళం ఇండస్ట్రీ వేరు… (కొంతమేరకు తమిళం కూడా)… అది ఓ లిబరల్ ప్రపంచం… అక్కడ మహిళ స్వేచ్ఛను తీసుకుంటుంది… ఎవరో ఇవ్వాలని కోరుకోదు… దక్కకపోతే పోరాడుతుంది… ఆ సినిమా కథలు, ప్రయోగాలు, టేకింగ్ సినిమా ప్రేమికుల్ని ఎంత అలరిస్తాయో తెలుసు కదా… టాప్ హీరోలు కూడా వైవిధ్యమైన పాత్రలు చేస్తారు… సేమ్, తమ పిల్లల సినిమాల ఎంట్రీ విషయంలో కూడా… సగటు తెలుగు వాతావరణంకన్నా భిన్నంగానే ఆలోచిస్తారు, ఎంకరేజ్ చేస్తారు…

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ (Vismaya Mohanlal) నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతోంది… ఫ్యాన్స్ ఆహ్వానించారు… తండ్రి కూడా పూర్తి మద్దతు ప్రకటించాడు… మోహన్‌లాల్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా కుమార్తె డెబ్యూ మూవీని అధికారికంగా ప్రకటించి శుభాకాంక్షలు తెలిపాడు, అంతేకాదు, సినిమా ప్రారంభోత్సవ (పూజా) వేడుకలో మోహన్‌లాల్, ఆయన భార్య సుచిత్ర, కుమారుడు (నటుడు) ప్రణవ్ మోహన్‌లాల్ కలిసి పాల్గొని విస్మయను ఆశీర్వదించారు…

విస్మయ

ఆ సినిమా పేరు ‘తొడక్కమ్’ (Thudakkam)… దర్శకుడు: జూడ్ ఆంథనీ జోసెఫ్ (Jude Anthany Joseph – బ్లాక్‌బస్టర్ ‘2018’ సినిమా ఫేమ్)…  ఒక ఇంటెన్స్ యాక్షన్- థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా. ఇందులో విస్మయ ‘మీను’ అనే ప్రధాన పాత్రలో కనిపించనుంది…

నిజానికి ఆమె ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు… మోహన్‌లాల్ స్వయంగా దర్శకత్వం వహించిన 3D ఫాంటసీ చిత్రం ‘బారోజ్’ (Barroz) చిత్రానికి ఆమె అసిస్టెంట్ డైరెక్టర్‌… నటన, రంగస్థలంపై ఉన్న ఆసక్తితో ప్రాగ్ (Prague), లండన్, అమెరికా (USA) లలో థియేటర్ ఆర్ట్స్ (Theatre Studies) కోర్సులు అభ్యసించింది….

  • నటి మాత్రమే కాదు… ఆమె రచయిత్రి & పెయింటర్ కూడా… ఆమె రాసిన కవితలు, వేసిన చిత్రాలతో కూడిన ‘గ్రేన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’ (Grains of Stardust) అనే పుస్తకం ప్రచురితమైంది… మార్షల్ ఆర్ట్స్ విభాగమైన ‘ముయ్ థాయ్’ (Muay Thai) లో ప్రొఫెషనల్ శిక్షణ పొందింది… వీళ్లూ జెన్‌జీ తరం అంటే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విస్మయ ! సూపర్ స్టార్ కూతురు ! హీరోయిన్‌గా మూవీల్లోకి ఎంట్రీ !!
  • కొరియన్ కనకరాజూ… కథ మరీ కామెడీ అయిపోయిందోయ్…
  • అరుపులు – కేకలు – నెత్తురు – బీజీఎం మోత – బీభత్సమైన హింస !!
  • రుక్మిణి వసంత్ ! ఆమెకు ఓ ఐడెంటిటీ లేదా ? ఇతర హీరోయిన్లకు కూడా !!
  • ‘రామాయణ’లో పేలవమైన వీఎఫ్‌ఎక్స్ ? లేక కొత్త సౌందర్య దృక్పథమా?
  • ఎవరు గురువు – ఎవరు శిష్యుడు ! అంతా హరీష్ హెలూసినేషన్ !!
  • స్మాల్ బడ్జెట్ – బిగ్ రెవిన్యూ ! కథాకథనాలు బాగుంటే కటౌట్లు దేనికోయ్ !!
  • అయోధ్య, శబరిమల, తిరుమల – ముంబై సిద్దివినాయకుడి గుడిలోనూ..!!
  • దురంధర్ సినిమాలో చూపించింది ఈమెనే ! ఆ త్యాగానికి అశోకచక్ర !!
  • ‘‘భావి తరాలు రీల్స్‌ బందీలు – ‘రిథమ్’ తప్పిన అల్గా‘రిథమ్ బతుకులు’’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions