.
వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలంటూ ఢిల్లీలో అరాచకాన్ని సృష్టించిన శక్తుల వీరంగం చూశాం, ఎప్పుడు ఏ చాన్స్ దొరికినా, లేదా దొరకబుచ్చుకుని మరీ ఢిల్లీలో అల్లర్లు రేపడానికి చాలా శక్తులు నిరీక్షిస్తుంటాయని మోడీకి కూడా తెలుసు… పంజాబ్‌లో ఓ చిన్న బ్రిడ్జి మీద కొందరు ఓ ట్రాక్టర్ అడ్డుపెట్టి తన కాన్వాయ్‌ను నిర్బంధించిన అత్యంత ప్రమాద స్థితినీ ఎదుర్కున్నాడు తనే…
పార్లమెంటు ఆమోదించిన చట్టాల్ని ఉపసంహరించుకున్నట్టు అవమానకరంగా ప్రకటించిన దుర్దినాలూ తెలుసు… అన్నీ తెలిసి కట్టుదిట్టాలు ఎందుకు చేయలేదు..? ఎవడో విదేశాల్లో ఉండేవాడు సరదాగా, ఓ సెటైర్‌లాగా ఏర్పాటు చేసిన బొద్దింకల పార్టీలోకి సంఘవ్యతిరేక, జాతివ్యతిరేక శక్తులు ఎంటర్ అవుతున్న తీరును ఇంటలిజెన్స్ బ్యూరో ఎందుకు కనిపెట్టలేకపోయింది..?
Ads
- జాగ్రత్తగా గమనించండి… సీఏఏ పేరిట రేపిన అల్లర్లు కూడా గుర్తుతెచ్చుకొండి… ఇప్పుడు కాక్రోచ్ పార్టీకి ఉన్న నెట్‌వర్క్ ఏముంది..? ఏమీ లేదు… కానీ లెఫ్ట్, ఆప్, జేఎన్‌యూ తుక్‌డే తుక్‌డే వంటి శక్తులు ఎంటరయ్యాయి… అన్‌రెస్ట్ క్రియేట్ చేయాలనేదే టార్గెట్… ఒక సోనమ్ వాంగ్‌చుక్ ఎంటరైపోయి దీక్ష అంటాడు, అరుంధతీరాయ్ మద్దతు అంటుంది, ప్రకాష్ రాజ్ వంటి జాతి వ్యతిరేకులు గళం ఎత్తుతారు… హఠాత్తుగా ఛలో పార్లమెంట్ అంటారు, పంజాబ్, ఢిల్లీ పరిసరాల నుంచి కేజ్రీవాల్ జనాన్ని ఆర్గనైజ్ చేస్తాడు… ఐనా అల్లర్లను కేంద్రం పనిగట్టలేకపోయిందా..? పాత చేదు అనుభవాలు గుర్తులేవా..?
ఒకవైపు బాష్పవాయువు, లాఠీచార్జ్ జరుగుతున్నా మరోవైపు విద్యార్థుల పేరిట అసాంఘిక శక్తులు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి, స్టోన్ పెల్టింగ్‌కు తెగబడ్డాయి… ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ ప్రధాని ఇంటి ఎదుట మెరుపు ప్రదర్శనకు దిగింది… ఎవరి మైలేజీ వాళ్లు చూసుకుంటున్నారు… సేమ్, ఇదే టైమ్‌లో మళ్లీ రైతు సమస్యలు అంటూ మరో సెక్షన్ ఆందోళనలకు పూనుకుంది… ఇవేమీ స్పాంటేనియస్ డెవలప్‌మెంట్స్ కావు, ఎవరో పకడ్బందీగా ఆడిస్తున్న ‘ఉద్యమం’…
పోలీసులు నెట్ జామర్లు పెడతారనీ, సోషల్ మీడియా వేదికల్ని నిలిపివేస్తారని ఊహించి, హింసను ప్రేరేపించాలనుకున్న శక్తులు నెట్ లేకున్నా కమ్యూనికేట్ చేసుకోగలిగే సీక్రెట్ యాప్స్ వాడారనే వార్తలు ఆందోళనకరమే… పక్కా ప్లానింగ్‌తో ఏదో నెట్‌వర్క్ ఆపరేట్ చేస్తున్నదనే సందేహాలకు ఇదీ ఓ సంకేతమే…
- వాంగ్‌చుక్ దీక్ష దగ్గర పక్కా జాతివ్యతిరేక ప్రసంగాలు, పర్టిక్యులర్‌గా యాంటీ హిందూ వ్యాఖ్యానాలు సాగాయి… అక్కడ ఎవడి ఎజెండా వాడిది… ఢిల్లీలో శాంతిభద్రతలు ఇంత ఘోరంగా దిగజారిపోవడంలో వైఫల్యం ఎవరిది..? హోం అఫయిర్స్ చూసే అమిత్ షా ప్రథమ బాధ్యుడు… తరువాత వేయి కళ్లున్న జేమ్స్‌బాండ్‌గా ప్రసిద్ధుడు అజిత్ ధోబాల్… ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ మహేశ్ దీక్షిత్ ఐపీఎస్… ఢిల్లీ లా అండ్ ఆర్డర్ చూడాల్సిన లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్ జిత్ సింగ్ సంధూ ఐఎఫ్ఎస్… ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్…
ఇది ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, తొలగింపు సమస్య కాదు… నీట్ అసలు అక్రమార్కుల్ని శిక్షించాలనే డిమాండ్‌లో న్యాయం ఉంది, కానీ అది దారితప్పి, అసాంఘిక శక్తులకు వేదికగా మారింది… ధర్మేంద్ర ప్రధాన్ బదులు మరో మంత్రిని పెట్టినా సరే, నీట్ అక్రమార్కులు ఉన్నంతకాలం పరిస్థితి మారదు… కాక్రోచ్ పార్టీ బాధ్యులతో చర్చలు, సంప్రదింపులు జరిపితే దానికి అనవసర ప్రాధాన్యం ఇచ్చినట్టే అవుతుంది… సో, అసాంఘిక శక్తులపై కఠిన నిఘా లేదు, కంట్రోల్ లేదు…
ఒక నేపాల్, ఒక శ్రీలంక, ఒక బంగ్లాదేశ్‌లలో జెన్‌జీ పేరిట సాగిన అరాచక పర్వాలు చూశాం, అంతకన్నా సున్నితమైన సిట్యుయేషన్ ఇండియాది… అంతర్గత విద్రోహశక్తులు ఎక్కువ… మరి ఏకంగా దేశ రాజధానిలోనే పాత చేదు అనుభవాల నేపథ్యంలో కూడా ఈ నిఘా వైఫల్యాలు, నియంత్రణ లోపాలు ఏమిటి..? ఎస్, అంతిమంగా… మోదీ నాయకత్వ పటిమలోనే ఏదో భారీ తేడా కనిపిస్తోంది..!!
ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే సమర్థ నాయకుడు, సఫల నాయకుడు… ఒక ధర్మేంద్ర ప్రధాన్ పదవిని పీకిపారేస్తే నష్టమేమిటట…!!
Share this Article