Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజీవ్‌ను బలిగొన్న థాను కథ తెలిసిందే… మరి ఎవరు ఈ అథిరై..?

May 22, 2026 by M S R

.

రాజీవ్ హత్య జరిగి 35 ఏళ్లు… నిన్న ఆయన వర్ధంతి సందర్భంగా ఆ హత్య తాలూకు చాలా కథనాలను మరోసారి చదివాం… నెమరేసుకున్నాం… తనను బలితీసుకున్న థాను గురించీ చెప్పుకున్నాం… కానీ మరో విషయం… శ్రీపెరంబుదూరులో టైగర్ల సూసైడ్ బాంబ్ ప్లాన్ గనుక విఫలమై ఉంటే..?

అవును, టైగర్ల వేట మామూలుగా ఉండదు… అక్కడ తప్పించుకుంటే ఢిల్లీలోనే రాజీవ్‌గాంధీని బలిగొనే ప్లాన్-బి కూడా ఆలోచించారు… ఏర్పాట్లు కూడా చేసుకున్నారు… ఇక్కడ థాను… ఢిల్లీ కోసం 17 ఏళ్ల అమ్మాయి అథిరై… హ్యూమన్ బాంబ్..! మరి ఆమె ఏమైపోయింది..? ఇదీ ప్రశ్న…

Ads

కనకసభాపతి… శ్రీలంకలో ఓ రిటైర్డ్ ఉద్యోగి… ఆయన మనవరాలు ఈ అథిరై… టైగర్ల ఆత్మాహుతి దళసభ్యురాలు… తాత నొటోరియస్ ప్రభాకరన్ ఫాలోయర్… వీళ్లు ఢిల్లీ ప్లాన్-బి కోసం… మొదట చెన్నైలో ఒక ఎల్టీటీఈ సానుభూతిపరుడి ఇంట్లో వీళ్ళిద్దరూ మకాం వేశారు… అక్కడే ఒక రేడియో స్టేషన్ ఏర్పాటు చేసి జాఫ్నా నుంచి సూచనలు అందుకుంటూ వచ్చారు… రాజీవ్ హత్య కేసు పరిశోధించిన కార్తికేయన్ బృందం వీళ్లు ఢిల్లీ వెళ్తుండగా, వెంబడించి పట్టుకొచ్చారు… అరెస్టు చేశారు…

మొదటి తీర్పు ప్రకారం… మొత్తం 26 మంది దోషులు… వారిలో ఈ కనకసభాపతి, అథిరై కూడా ఉన్నారు… కానీ సుప్రీం 19 మందిని నిర్దోషులుగా ప్రకటించింది… వాళ్లలో వీళ్లూ ఉన్నారు… విడుదలయ్యారు… కానీ విదేశీయులు… డిపోర్ట్ చేయాలనుకుంది ప్రభుత్వం… కానీ శ్రీలంక పోలీసులు బతకనివ్వరు, మేం వెళ్లబోమన్నారు…

విడుదలైన వారిలో విక్కీ అలియాస్ విఘ్నేశ్వరన్ కూడా ఉన్నాడు… వీళ్లందరినీ ప్రత్యేక హోం/ డిటెన్షన్ క్యాంపులో ఉంచారు… జైలు జీవితం, సుదీర్ఘ విచారణల కాలంలో ఏర్పడిన పరిచయం కాస్తా ఇక్కడ బలపడి, క్యాంపులో ఉండగానే అథిరై, విక్కీ పెళ్లి చేసుకున్నారు… తరువాత స్విట్జర్లాండ్‌లోని టైగర్ల సానుభూతిపరులు సహకరించడంతో… ఈ ముగ్గురూ ఆ దేశం చేరుకున్నారు…

తరువాత వాళ్లు ఏమయ్యారనేది ఎవరికీ తెలియదు… వాళ్ల ఫోటోలు కూడా ఎవరూ పబ్లిష్ చేయలేదు… మళ్లీ వెలుగులోకిి రాెకుండానే అలా కాలగతిలో కలిసిపోయారు..!!

హింస, నిర్మూలనవాదం విజయాలు- లక్ష్యాలు సాధిస్తాయా..? విప్లవాలు సిద్ధిస్తాయా..? ఇదెప్పుడూ చర్చనీయాంశమే… భీకరమైన ఎల్‌టీటీఈ మొత్తం సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది… చండప్రచండ మావోయిజం నేపాల్‌లో అధికారం దక్కించుకుని మరీ జనం తిరస్కరణకు గురై, మామూలు పార్టీలాగా మారిపోయింది… దేశంలో పలు రాష్ట్రాలకు విస్తరించిన నక్సలైట్లు ‘లొంగిపోయారు లేదా హతమయ్యారు… ఇప్పుడు దాని ఉనికి నామమాత్రం… భారతదేశాన్ని కలవరపరుస్తున్న ఉగ్రవాదం కూడా రేపు రేపు..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజీవ్‌ను బలిగొన్న థాను కథ తెలిసిందే… మరి ఎవరు ఈ అథిరై..?
  • ఓ విఫల పైరవీ కథ … ‘నీట్‌గా పరీక్షలు అసాధ్యం… లీకులు నిజం…
  • సోషల్ కాక్రోచ్ వింగ్స్..! సొంత పార్టీలనే బలితీసుకుంటయ్… బహుపరాక్..!!
  • ఓ వారసంత నుంచి… ఆ గ్లోబల్ మార్కెట్ దాకా… మన మహిళలు..!!
  • ఏ ఉగాండాలోనో, ఏ బర్మాలోనో… ఒక్క నిష్పాక్షిక వార్త రాయండి చూద్దాం…
  • అగరుపొగలా, అత్తరులా… ఊహూఁ… ఆ శోభన తాంబూలంలోనే ఏదో వెలితి…
  • మండు వేసవి- మల్లె పూలు- తెల్ల చీరెలు… సినీ కవుల పరిమళాలు…
  • రాజీవ్ హత్యకు 35 ఏళ్లు… హత్య, దర్యాప్తు రెండూ సంచలనమే…
  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • దృశ్యం-3 … వెంకీ మామ లక్కీ… భలే తప్పించుకున్నాడు రీమేక్ నుంచి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions