Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తండ్రి సినిమాకు కన్నీటి సర్టిఫికెట్..! ఎన్నిసార్లు చూసినా ఏడ్చేస్తోంది ‘మాత’..!!

September 22, 2026 by M S R

.

తన తండ్రి జీవిత కథపై తీసిన సినిమా… “అమ్మా… మీరు ఓసారి చూడండి” అని నిర్మాత, దర్శకులు అడిగారు. ఆమె నవ్వుతూ… “వీలున్నప్పుడు చూస్తానులే” అనేసింది. అంతే… ఆ మాట అక్కడితో ముగిసిపోయిందనుకున్నారు.

కానీ ఆ తర్వాత ఒకసారి చూసింది… మరోసారి చూసింది… ఇంకోసారి చూసింది… అలా ఏకంగా 15 సార్లు చూసింది!

Ads

అంతేనా…? ప్రతిసారీ సినిమా చూస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది.

తన తండ్రి జీవితాన్ని తెరపై చూపించిన దర్శకుడి ప్రతిభకు ఇంతకుమించిన సర్టిఫికెట్ ఇంకేముంటుంది..? ప్రేక్షకుల చప్పట్లు, బాక్సాఫీస్ వసూళ్లు ఒక ఎత్తయితే… తాను తెరపై చూసింది తన తండ్రే అని భావించిన ఆ కుటుంబ సభ్యురాలి కళ్లలో వచ్చిన కన్నీళ్లు మరో ఎత్తు.

అవును… మనం చెప్పుకుంటున్నది ‘హనుమాన్ అంశ్’ సినిమా గురించే. ఆమె ఎవరో కాదు… సాక్షాత్తూ నీమ్ కరోలి బాబా కుమార్తె గిరిజా మాతాజీ…

girija ji(girija ji)

ఒక సినిమా హిట్ కావడం ఒక ఎత్తు… ఆ సినిమా ఎవరి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీశారో, ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల హృదయాన్ని తాకడం మరో ఎత్తు. ‘హనుమాన్ అంశ్’ విషయంలో ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన కథే బయటకు వచ్చింది.

రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన ఈ భక్తిరస చిత్రం అనూహ్యంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.329 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని తాజా నివేదికలు చెబుతున్నాయి. కానీ ఈ సినిమా మేకర్స్‌కు బాక్సాఫీస్ కంటే కూడా ప్రత్యేకంగా అనిపించిన స్పందన ఒకటి ఉంది. అది… నీమ్ కరోలి బాబా కుమార్తె గిరిజా జీ, ప్రేమగా ‘అమ్మాజీ’ అని పిలిచే ఆమె నుంచి వచ్చిన స్పందన.

ఎవరీ గిరిజా జీ? నీమ్ కరోలి బాబా అంటే భక్తులకు కేవలం ఒక ఆధ్యాత్మిక గురువు పేరు కాదు. ఆయన చుట్టూ దశాబ్దాలుగా అనేక ఆధ్యాత్మిక అనుభవాలు, భక్తుల కథలు, ఆశ్రమ జీవితం, సేవా భావం ముడిపడి ఉన్నాయి. అదే కుటుంబానికి చెందిన వ్యక్తి గిరిజా జీ.

లభ్యమైన వివరాల ప్రకారం… ఆమె బాబా ఏకైక కుమార్తె. బాబాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. గిరిజా జీ భర్త జగదీశ్ భాటేల్. ఆమెకు సందీప్ భాటేల్ అనే కుమారుడు ఉన్నట్టు పాత కుటుంబ రికార్డులు, భక్తుల వర్గాల్లోని సమాచారం పేర్కొంటోంది.

కరోలీ బాబా

అయితే గిరిజా జీ పేరు బయటకు రావడానికి కారణం కేవలం ఆమె ‘నీమ్ కరోలి బాబా కుమార్తె’ కావడం కాదు. బాబా బోధనలను, ముఖ్యంగా ‘Love all, feed all’ అనే సందేశాన్ని ఆమె తన జీవితంలోనూ కొనసాగిస్తున్నారని ‘హనుమాన్ అంశ్’ నిర్మాత రాగిణి సోనా చెబుతోంది. ఆమెను కలిసినప్పుడు గిరిజా జీ ప్రవర్తనలో తన తండ్రి ప్రతిబింబమే కనిపించిందని రాగిణి చెప్పడం ఆసక్తికరం.

సినిమా తీసే ముందు… బాబా కూతురి ఆశీస్సుల కోసం… నీమ్ కరోలి బాబా జీవితంతో ముడిపడిన కథను సినిమాగా తెరకెక్కిస్తున్నప్పుడు, తరువాత దర్శకుడు విశాల్ చతుర్వేది, నిర్మాత రాగిణి సోనా ఒక నిర్ణయం తీసుకున్నారట. బాబా కుటుంబాన్ని కలవాలి… ఆశీస్సులు తీసుకోవాలి.

అలా గిరిజా జీని సంప్రదించే ప్రయత్నం చేశారు. చివరకు ఆమెతో ఫోన్‌లో మాట్లాడే అవకాశం వచ్చింది. సినిమా గురించి చెప్పి, ఆమె ‘హనుమాన్ అంశ్’ చూడాలనుకుంటున్నారా అని అడిగితే… “సమయం వచ్చినప్పుడు చూస్తాను” అందామె…

karoli-baba-s-ancestral-home-dispute-(karoli baba house)

అలాగే ‘మీకు ఈ సినిమా తీయాలనిపించింది ఎందుకు?’ అనడిగింది ఆమె… దానికి సినిమా నిర్మాతల్లో ఒకరైన రాగిణి ఆమెకు చెప్పిన జవాబు… ‘‘నేను ఆరేళ్ల వయసులోనే నీమ్ కరోలి బాబాను కలిశాను, తన గురించి నాకు తెలుసు, దర్శకుడు విశాల్ చతుర్వేది ఏకంగా ఓ పరిశోధన చేశాడు… ఏనాటి నుంచో ఈ సినిమా తీయాలని అనుకుంటూనే ఉన్నాం’’

అక్కడితో ఆ సంభాషణ ఆగలేదు. రాగిణి తన తండ్రి నైనిటాల్‌లో పనిచేసిన విషయాన్ని ప్రస్తావించింది గిరిజతో… ‘‘వెంటనే గిరిజ నా తండ్రి పేరు, ఆగ్రాలోని ఆయన ఉన్న ఇంటి ప్రాంతాన్ని చెప్పింది, ఓ మిరకిల్ అనిపించింది నాకు, అసలు ఆమెకు ఈ వివరాలేం తెలుసు..? నా అన్నపేరు కూడా చెప్పిందామె…’’ అని రాగిణి చెప్పుకొచ్చింది ఏదో ఇంటర్వ్యూలో…

అసలు ఆశ్చర్యం ఆ తర్వాత… సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మౌత్ టాక్ పెరిగింది. మొదట్లో పెద్దగా స్పందన రాకపోయినా సినిమా క్రమంగా థియేటర్లలో పుంజుకుంది. చివరకు రూ.300 కోట్ల మార్కును దాటింది. తాజా కథనాలు ప్రపంచవ్యాప్తంగా రూ.329 కోట్లకు పైగా వసూళ్లను పేర్కొంటున్నాయి.

anupriya(anupriya)

కానీ బాబా కుమార్తె గిరిజా జీ ఈ సినిమాను ఎంతగా స్వీకరించిందో చెప్పే విషయం మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ‘హనుమాన్ అంశ్’ను దాదాపు 15 సార్లు చూసిందట. అది కూడా ఒక్కసారి చూసి నచ్చిందని కాదు… ప్రతిసారీ సినిమా చూస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది… ఇదీ రాగిణి సోనా చెప్పిన విషయమే.

ఒక్కసారి సినిమా చూడటం ప్రేక్షకుడి స్పందన. రెండుసార్లు చూడటం అభిమానం. కానీ ఒక వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా… ఆ వ్యక్తి కుమార్తె చేత 15 సార్లు చూడబడటం మాత్రం మేకర్స్‌కు సహజంగానే ప్రత్యేకమైన అనుభూతి.

‘ఆమెను చూస్తే బాబానే కనిపించాడు…’ రాగిణి చెప్పిన మరో విషయం కూడా ఆసక్తికరమే. గిరిజా జీని ప్రత్యక్షంగా కలిసినప్పుడు ఆమె తన తండ్రి నీమ్ కరోలి బాబాను గుర్తు చేసిందనీ, ఆమె నడవడికలో, మాట్లాడే తీరులో, ఇతరులను చూసే విధానంలో బాబా ప్రభావం కనిపించిందని రాగిణి చెబుతోంది.

ragini(ragini)

మరి ‘హనుమాన్ అంశ్’ వెనుక ఉన్న అసలు ఆసక్తికరమైన కథ? ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఈ సినిమా నిర్మాత అంటే ఒక్క రాగిణి సోనా పేరు మాత్రమే కాదు. ముగ్గురు మహిళలు కలిసి ఈ ప్రాజెక్టును నిర్మించారు. సుమారు రూ.1.8 కోట్ల బడ్జెట్‌కు ముగ్గురూ తమ వంతుగా పెట్టుబడి పెట్టారు. 21 ఏళ్ల అనుప్రియా నగర్ ఈ ముగ్గురిలో ఒకరు. ఆమె షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్‌ప్రొడక్షన్ దశలో సినిమాలోకి వచ్చింది.

ఆమే అనుప్రియా నగర్… యూనివర్సిటీ ఆఫ్ బాత్‌లో ఎకనామిక్స్ చదివిన యువతి. బ్రిటన్‌లో మూడు సంవత్సరాల పార్ట్‌టైమ్ ఉద్యోగాల ద్వారా కూడబెట్టిన తన పొదుపును ఈ సినిమాకు పెట్టుబడిగా పెట్టినట్టు ఆమె గతంలో వెల్లడించింది. బాబా కథను యువత, ముఖ్యంగా Gen Zకి చేరవేయాలనే ఉద్దేశంతో తాను ఈ ప్రాజెక్టులోకి వచ్చానని ఆమె చెప్పింది. అన్నీ విశేషాలే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తిలక్ వర్మ రనౌట్ స్వీయ తప్పిదమే… కానీ వెస్టిండీస్ క్రీడాస్పూర్తి !?
  • వేకువ ఝామున వెన్నెల మరకలుగా… రేపటి వాకిట ముగ్గులుగా…
  • క్రాంతికుమార్ – తెలుగు సినిమా కథల ప్రయోగాల సాహసి !!
  • 3 Statues Of Liberty – మూడు విగ్రహాలకూ ‘విముక్తి’ అంతఃసూత్రం !!
  • ఆంధ్రా తూర్పు తీరాన్ని.. నువ్వుల తీరం అనీ పిలిచారని తెలుసా ?
  • ఓ అమెరికన్ గ్రౌండ్ జీరో ! మరి తెలంగాణ ‘గ్రౌండ్ జీరో’ మాటేంటి..?!
  • ఎన్టీయార్, దిలీప్‌కన్నా శివాజీ గణేశన్‌తోనే ఆ పాత్రకు న్యాయం !!
  • ఒక ఫోన్ కాల్ … ఒక అరెస్ట్ … వార్త పంపాక మొదలైన అసలు టెన్షన్…
  • దేశంలోనే మొట్టమొదటిసారి ఒక విలేకరిపై టాడా కేసు…
  • గాఢనిద్రలో ఉన్న చంద్రబోస్ తెలంగాణతనం సోయి తెచ్చుకుంది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions