Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జనం ట్రాక్టర్లలో తరలివస్తున్నారు ! ఇరుముడి ఎందుకు కనెక్టయిందంటే..?!

September 7, 2026 by M S R

.

Srichaman Madhusudan Challa …. *ఇరుముడి ఎందుకు హిట్ అయిందంటే..*
నేను నల్లగా, బండ ముక్కుతో, ఎటువంటి మేక‌ప్ లేకుండా ఉంటాను.
ప్ర‌త్యేక‌మైన దుస్తులు ధ‌రించ‌ని కార‌ణంగా, ఆభ‌ర‌ణాలు- గాడ్జెట్స్ ఏమీ లేకుండా…
అందం కోణంలో నేను బాగోను అని నాకే తెలుసు.

నా ప‌క్క‌నే నాకంటే న‌ల్ల‌గా, కంట్లో పుసులు, చినిగిన దుస్తులు,
మాసిన గ‌డ్డంతో మ‌రొక‌రు ఉండేట‌ప్పుడు ఇద్ద‌రినీ చూసిన వారు
నేనే బెట‌ర్ అనుకుంటారు క‌దా! ఇది స‌హ‌జం.

Ads

ఇరుముడి సినిమా అంతే.. దాని ముందు, వెనుక రిలీజైన సినిమాలు తెలుగు సినిమాకి ప‌ట్టిన తెగులుతో వ‌చ్చిన‌వే.
కీళ్ల మార్పిడి ఆప‌రేష‌న్‌ చేసుకుని, విగ్గుల‌తో, క‌ళ్ల కింద క్యారీ బ్యాగుల‌ను మేక‌ప్పుతో క‌ప్పేసిన లేత‌ హీరోలే అంతా. వీళ్లు ఏపీలో ఉంటే ఈపాటికీ వృద్ధాప్య పెన్ష‌న్ ప‌దేళ్లుగా అందుకునే జాబితాలో ఉంటారు.. అన‌గా ఏడు ప‌దుల‌కు అటు ఇటు కుర్ర ముస‌లి హీరోలు..

ఇరుముడి

వీళ్ల‌కు 16 నుంచి 35 ఏళ్ల లోపు హీరోయిన్లు.. వీళ్ల‌ని మ‌న సెవెన్టీస్ హీరో ఎప్పుడూ ప్రేమించ‌డు.
హీరోయిన్లే ఆ సీనియ‌ర్ సిటిజ‌న్ హీరో ముందు పైట జార్చుతూ, చొంగ కార్చుతూ.. ప్రేమ కోసం ప‌రిత‌పిస్తారు.
వీరు లేస్తే వెంట‌నే కూర్చోలేరు. కూర్చుంటే ఎవ‌రో ఒక‌రు లేపాలి. కానీ ఒక 50 మందిని ఒకేసారి ఎగ‌రేసి కొట్టేస్తుంటారు.

హీరో ఒక‌ ప‌ల్లెటూరులో ఉంటారు. ఆ ప‌ల్లెటూరు సెట్టు కోసం 10 కోట్లు.. అది ప‌ల్లెటూరులా క‌న‌ప‌డ‌దు.
సినిమాలో ప్ర‌ధాన‌మైన 20 క్యారెక్ట‌ర్ల కోసం 20 భాష‌ల నుంచి న‌టుల దిగుమ‌తి..
కొండ సెట్టుకు 20 కోట్లు..
స‌ముద్రం ఎఫెక్ట్స్ కోసం మ‌రికొన్ని కోట్లు..
సినిమా బ‌డ్జెట్లో 10 శాతం సొమ్ము అంద‌రికీ విగ్గులు స‌మ‌కూర్చ‌డానికి అయిపోతుంది.

క‌ట్ట‌ర్ హిందూ అనంత్ శ్రీరామ్ రాసిన ఐట‌మ్ సాంగ్ ముస‌లి హీరో ముందు ఆడిపాడ‌టానికి ఒక ఐట‌మ్ గ‌ర్ల్..
ఎన్ని సినిమాలు పోయినా, ఇదే ప్ర‌స్తుతం తెలుగు సినిమా తెగులు ఫార్ములా..
ఈ సినిమా పోతుంద‌ని తెలిసి.. రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ రేటు 500కి పెంచుకునే జీవో తెప్పించుకుని రెండు రోజుల్లో పోయిన సినిమాకి వ‌చ్చిందే క‌లెక్ష‌ను అని దండుకోవ‌డం మ‌రో రివాజు.

irumudi

ఇరుముడి సినిమా విజ‌యానికి దోహ‌దం చేసిన అంశాలు
ఈ రొడ్డ సినిమాల నుంచి లెసన్స్ నేర్చుకున్న శివ నిర్వాణ .. త‌న‌దైన శైలిలో పైన ద‌రిద్రాలు లేకుండా సినిమా తీశాడు.. అదే ఇరుముడి విజ‌య‌ర‌హ‌స్యం. ఇందులో క‌థ రొటీన్. లాజిక్కులు ఉండ‌వు.
ఎమ్మెల్యేని అర‌టి గెల కోసిన‌ట్టు కోసేస్తే కేసులుండ‌వు. ఎమ్మెల్యేతోపాటు వ‌చ్చిన ప‌దుల మందిని చంపేస్తే.. చ‌ట్టం, న్యాయం ఉండ‌దు. ఇలా దుర్భిణీ పెడితే చాలా లాజిక్‌కు అంద‌ని సీన్లుంటాయి. కానీ అటువైపు మనం వెళ్ల‌కుండా సినిమా విజ‌య ప్రధాన కారణాల గురించి మాట్లాడుకుందాం.

సెట్టుల జోలికి పోకుండా.. చ‌క్క‌గా మ‌ల‌యాళం సినిమాల మాదిరిగా అవుట్ డోర్ షూట్, ఏ ప్రాంతాల పేరుతో తీయాల‌నుకున్నాడో అక్క‌డే సినిమా తీసేశాడు.. ఇదే తొలి విజ‌యం.. సెట్టుల‌లో ఇరుక్కుపోయిన తెలుగు సినిమాని ఆహ్లాద‌క‌ర‌మైన ప్ర‌కృతిలోకి తీసుకొచ్చాడు శివ నిర్వాణ‌.

డొంక‌రాయి, సీలేరు, పొల్లూరు ఈ ప్రాంతాలు ప‌ర్యాట‌కంగా బాగా ఫేమ‌స్ అయ్యాయి. పుష్ప సినిమా త‌రువాత అక్క‌డి కెనాల్స్, ఫోర్ బే డ్యామ్ వంటివి ప్రాచుర్యంలోకి వ‌చ్చాయి. వాటిని షూటింగ్ స్పాట్ చేయ‌డం సినిమాకు బాగా క‌లిసి వ‌చ్చింది. స్థానికులు ఇది మా సినిమా అని ఓన్ చేసుకున్నారు.

నక్షత్ర

  • మాస్ మ‌హారాజా అంటూ ర‌వితేజ చుట్టూ క‌ట్టిన దేవ‌తా వ‌స్త్రాల‌న్నీ తీసేసి.. సామాన్య రైతుగా చిత్రీక‌రించిన తీరు పేద‌లు, దిగువ‌- మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది.
    సినిమాలో పాత్ర‌ల‌కు ఇత‌ర భాష‌ల న‌టుల‌ను తీసుకోకుండా, మ‌న అచ్చ‌తెలుగు న‌టుల‌ను తీసుకోవ‌డం మ‌రో పెద్ద ప్ల‌స్ అయ్యింది.

వ‌య‌స్సు, ఆహార్యం త‌గ్గ పాత్ర‌ల‌కు న‌టుల ఎంపిక వ‌ల్ల విగ్గులు- మేక‌ప్‌ ఖ‌ర్చు త‌గ్గి స‌హ‌జంగా క‌థ‌కు సూట‌యిపోయి నిజ‌మైన పాత్ర‌లే అనుకునేలా ప్రేక్ష‌కులు లీన‌మైపోయారు.
స్థానికుల‌ను, కృష్ణాన‌గ‌ర్- ఇందిరాన‌గ‌ర్‌ల‌లో తిరిగే సినీ క‌ల‌ల బేహారుల‌కు ఏదో ఒక పాత్రలో అవ‌కాశం క‌ల్పించారు. ఇది సినిమాకు మేలు చేకూర్చింది.

గ‌వ‌ర్న‌మెంటు స్కూలుని నేప‌థ్యంగా ఎంచుకోవ‌డంతోపాటు, ఏపీ విద్యా వ్య‌వ‌స్థ దేశ‌వ్యాప్తంగా మంచి మార్పుల‌తో చ‌ర్చ‌నీయాంశంగా ఉండ‌టం, బాగా ఫేమ‌స్ అయిన‌ స్కూలు యూనిఫాం మ‌రో ఆక‌ర్ష‌ణ అయ్యింది.

సినిమా టికెట్ రేట్లు పెంచ‌లేదు. దీంతో నేను ఇటీవ‌ల చాలా కాలం త‌రువాత కుటుంబంతో క‌లిసి థియేట‌ర్‌కు వెళ్లి ఇరుముడి సినిమా చూశాను. ముగ్గురికి 600 దాట‌లేదు టికెట్ల‌కు.. రిలీజైన ఏడో రోజు కూడా మ‌ధ్యాహ్నం షో హౌస్ ఫుల్ అయ్యింది. అన్నివ‌ర్గాల‌నూ సినిమా థియేట‌ర్‌లో చూశాక‌.. అంద‌రూ సినిమాని ఆద‌రిస్తున్నార‌ని అర్థం అయ్యింది.

ఏపీలో విప‌రీత‌మైన అయ్య‌ప్ప భ‌క్తులు ఉంటారు. ల‌క్ష‌లాది కుటుంబాలు అయ్య‌ప్పని పూజిస్తారు. ఈ నేప‌థ్యంలో బాగా ఫేమ‌స్ అయిన డ‌ప్పు శ్రీను ఎక్కినాడు ప‌ల్ల‌కి పాట‌, అయ్య‌ప్ప మాలధార‌ణ, భ‌జ‌న పాట‌లు సినిమాకి ప్రాణంగా నిలిచాయి.
అర‌టి తోట‌లు, డ్యాం, అడ‌వి మ‌ధ్య తోవ‌లు నేటివిటీని ప్ర‌తిబింబించేలా ఉన్నాయి.
న‌టులంతా ఎక్కువ, త‌క్కువ కాకుండా చేసిన న‌ట‌న సినిమాని బాగా నిల‌బెట్టింది.

ఇరుముడి

దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం ప్రేమ‌- ఆప్యాయ‌త‌లు, అల‌క‌లు, వ్య‌స‌నాలు, కూతురు సెంటిమెంట్, ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల వివ‌క్ష ఉండ‌కూడ‌ద‌నే సందేశం.. చ‌దువు విలువ తెలియ‌జెప్పే క‌థ‌.. సినిమాని కుటుంబాల‌కు ద‌గ్గ‌ర చేసింది.

నాకు ఈ సినిమా నచ్చడానికి పై కారణాలన్నింటితోపాటు నేను డొంకరాయిలో ఉన్నందు వల్ల.. సినిమా చిత్రీకరించిన ప్రదేశాలలో నేను తిరగడం వల్ల కనెక్ట్ అయ్యాను. ప్రభుత్వ విద్యాలయాల కోసం ఎన్నో కథనాలు రాశాను. స్కూలు పిల్లల యూనిఫాం చాలా బాగుంటుంది. దీనికి మరింత ప్రచారం దక్కింది.

క‌నీస క‌థ‌, స‌హ‌జంగా తీస్తే.. చూడ‌టానికి సిద్ధంగా ఉన్నామ‌ని `ఇరుముడి` విజ‌యంతో ప్రేక్ష‌కులు చాటి చెప్పారు. తెలుగు సినీ క‌ళా మ‌త‌ల్లి ముద్దుబిడ్డ‌లూ మీరు ఇప్ప‌టికైనా మారు మ‌న‌సు పొందుతారా?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జనం ట్రాక్టర్లలో తరలివస్తున్నారు ! ఇరుముడి ఎందుకు కనెక్టయిందంటే..?!
  • మోదీ వెనుక నీడలా ఓ నాగా మహిళ – ఎవరీమె..? నేపథ్యం ఏమిటి..?
  • సరిగమలు! ఓ విశ్వనాథ్ తీయాల్సిన సినిమా ఓ రాఘవేంద్రరావు తీస్తే..?
  • సూపర్‌స్టార్ రజినీకాంత్ అహం పూర్తిగా బద్ధలైన ఆ సందర్భం..!!
  • రేవంత్ రెడ్డిని ‘అండర్ ఎస్టిమేట్’ చేశారు – అడ్డంగా బుక్కయ్యారు !!
  • వావ్ గుజ్జూస్- ఏదైనా మాయ చేయగలరు… 8542 వోట్లు- ఖర్చు 290 కోట్లు !!
  • హోర్ముజ్ మాత్రమే కాదు – జిబ్రాల్టర్ జలసంధీ జియోపాలిటిక్స్ కేంద్రమే!!
  • మన గుండెలు రాళ్లు… నవ్వినా, ఏడ్చినా వాటికి పెద్ద ఫరక్ పడదు…
  • Just డేటా సెంటర్ కాదు… తెలంగాణ భవిష్యత్తుకు ‘కంప్యూట్ పవర్’!
  • సారూ, ఒక్కరిని… ప్లీజ్ ఇలాంటి ఒక్క గురువును చూపించండయ్యా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions