Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శివాజీకి ఈ మోసుడు అవసరమా..? కృష్ణభగవాన్‌ను ఎందుకు తరిమేసినట్టు..!?

September 14, 2024 by M S R

హైకోర్టు జడ్జి కాదు, కనీసం జిల్లా కోర్టు జడ్జి కూడా కాదు… జస్ట్, ఈటీవీలో గత ప్రాభవం కోల్పోయిన ఓ బూతు కార్యక్రమం జబర్దస్త్‌ షోకు జడ్జి… ఏమీ లేదు, స్కిట్లలో కమెడియన్లు వేసే తిక్క పంచులకు నవ్వు రాకున్నా పకపకా నవ్వాలి… చేతనైతే తనూ ఏదైనా దిక్కుమాలిన పంచ్ డైలాగ్ ఒకటి విసరాలి… అంతే..,.

పైగా చాలా మంది జడ్జిలు వస్తుంటారు, పోతుంటారు… అప్పట్లో నాగబాబు, రోజాలు చాన్నాళ్లు ఉన్నారు… తరువాత ఈటీవీని నాగబాబు వదిలేయడం, రోజా రాజకీయాల్లో బిజీ కావడంతో… తరువాత ఎవరెవరో వస్తున్నారు, కొందరు అతిథి జడ్జిలు, మరికొందరు తాత్కాలిక జడ్జిలు… అంతేతప్ప స్థిరంగా నాలుగురోజులు ఉన్నవాళ్లు ఎవరూ లేరు… ఇంద్రజ కాస్త నయం…

బూతులు, తిక్క పంచులు, ద్వంద్వార్థాలు వచ్చినప్పుడు ఇబ్బందిపడేది… ఆమెనూ పంపించేశారు… జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ ఏకం చేసి, శుక్ర శనివారాల్లో ఒకే జబర్దస్త్ పేరుతో నడిపిస్తున్నారు కదా… ఒకటే యాంకరిణి… మొన్నటిదాకా కృష్ణ భగవాన్ ఉండేవాడు, తోడుగా ఖుష్బూ… కృష్ణ భగవాన్ స్వతహాగా కామెడీ ఇష్టుడు, స్పాంటేనియస్‌గా ఎవరూ నొచ్చుకోకుండా చెణుకులు విసరగలడు… మరెందుకు పంపించేశారో తెలియదు…

Ads

ఇప్పుడు తీసుకొచ్చింది శివాజీని… అవును, మీరు చదివింది నిజమే, ఆ గరుడ పురాణం శివాజీయే… మొన్నమొన్న బిగ్‌బాస్ షోలో పల్లవి ప్రశాంత్‌ను, యావర్‌ను గ్రూపుగా చేసుకుని కంపు కంపు చేశాడు కదా… వాళ్లందరికన్నా తనేదో తోపు అయినట్టు ఫోజులు… ఇగోయిస్టు… సరే, ఈటీవీకి ఇష్టుడు కదా, తెచ్చి పెట్టుకున్నారు, ఎన్నాళ్లుంటాడో తెలియదు… ఈమాత్రం దానికి ఒక ఎపిసోడ్‌లో ఆహాకారాలు, ఓహోకారాలు… అంత అవసరమా..?

ఒకరంటారు, ఆరు టీమ్స్‌కు మొగుడు అట… మరొకరేమో ఏదో అంటే ఏమిచ్చినా తింటాను, తీసుకుంటాను అని ఓ డబుల్ మీనింగ్ వెగటు వ్యాఖ్య ఆల్రెడీ శివాజీ నుంచి… శి వాజీ అంటే షి వాజీ, అంటే అమ్మాయిని రమ్మని పిలవడం అట… మరొకడి బాష్యం… ఇలా ఆరు టీమ్స్ కూడా ఏదోరకంగా శివాజీని ప్లీజ్ చేసే ప్రయత్నం… చూస్తుంటేనే కంపరం అనిపించింది… ఏవైనా నవ్వు తెప్పించే స్కిట్లు చేయండిరా అంటే ఇదీ కథ…

అందుకే ఈ వేషాలతోనే జబర్దస్త్ రోజురోజుకూ రేటింగ్స్‌లో దిగజారి… ఇక పైకి లేవనంటోంది… ఒక్క శ్రీదేవి డ్రామా కంపెనీ తప్ప మరే రియాలిటీ షోకు కూడా రేటింగ్స్ లేవు… సుమ ప్రోగ్రామ్ అయితే మరీ దారుణం… చివరకు అంతటి సుడిగాలి సుధీర్ హోస్ట్ చేసే ఏదో ఫ్యామిలీ స్టార్ షో కూడా ఫ్లాప్ అయిపోయింది…

గత వారం రేటింగ్స్ చూస్తే శుక్రవారం జబర్దస్త్ టీఆర్పీలు జస్ట్, మూడు… శనివారం మరీ తక్కువగా 2.61 (హైదరాబాద్ బార్క్)… మరెందుకు కృష్ణ భగవాన్‌ను తీసేసినట్టు..? ఈ గరుడ పురాణ ఓవరాక్షన్ ప్రవచనకారుడిని ఎందుకు తెచ్చి పెట్టుకున్నట్టు..? తెచ్చుకున్నారుపో, ఈ మోసుడు ఏమిటి..? ప్చ్, ఫాఫం ఈటీవీ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మమతకు దెబ్బ మీద దెబ్బ… డెస్టినీ ఎదురుతంతే… అంతే…
  • ఫస్ట్ కెప్టెన్ ఝాన్సీ! సరైన ఫలితమే! కానీ యాదృచ్ఛికమేనా?!
  • మీనాక్షి నటరాజన్! వదలక వెంటాడుతున్న ఆ రెండు కేసులూ !!
  • తెలంగాణ అమరుల కథలు వేర్వేరు- ఏ సోయీ లేని పార్టీల ప్రముఖులు…
  • ఇవేం కక్కుర్తి పనులురా బాబూ..! వీసా కోసం 13 ఏళ్ల బాలికతో పెళ్లి ?
  • ‘రాముడి’పై ఇదేం కొత్త లొల్లి… పాత వీడియోను పట్టుకుని రచ్చ!
  • శ్రీచక్రం మధ్యలో సమంత..! తంత్రమా? అపచారమా? ఏది నిజం!!
  • అంతటి గండరగండడు కూడా ఆ డైలాగ్ దగ్గర ఇరుక్కుపోయాడు!
  • రిపోర్టర్ చాకచక్యం! నిజాం నవాబు మరణవార్త అలా బయటికొచ్చింది!
  • ఇరాన్ వార్ సైడ్ ఎఫెక్ట్స్ – సౌదీకి చుక్కలు చూపిస్తున్న హుతీలు !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions