.
ఎస్, హరీష్ రావు రకరకాల ఆధారరహిత నిందారోపణలు, వక్రబాష్యాలు, వితండవాదాలతో రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత దాడి చేస్తున్న మాట నిజమే… కానీ అది రాజకీయం, దాన్ని అలాగే ఎదుర్కోవాలి, రేవంత్ రెడ్డి కౌంటర్ల తరహాలోనే… అంతేతప్ప, క్షుద్రపూజలు వంటి విమర్శలతో గుళ్లను, హిందూ మతాన్ని, దేవుళ్లను అవమానించడం సరికాదు…
హరీష్ రావు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్‌రెడ్డిలకు లీగల్ నోటీసులు ఇవ్వడంలో తప్పేమీ లేదు… ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరు నేతలకు మద్దతుగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు… ఎందుకంటే, అవి నీచాభిరుచి వ్యాఖ్యలు… బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి విమర్శ చేయాలంటే యాంటీ హిందూ పోకడలు అస్సలు అవసరం లేదు…
Ads
‘రాష్ట్రంలో వానలు పడకూడదు, తద్వారా ప్రజల్లో అసంతృప్తి పెరగాలని హరీష్ రావు షిమోగా వంటి గుళ్లు తిరిగి క్షుద్రపూజలు చేస్తున్నారు’ అని ఆ నేతల ఆరోపణ… నిజానికి ఆ గుళ్ల గురించి తెలిస్తే కదా వీళ్లకు… కర్నాటకలోని మూకాంబిక టెంపుల్‌కు అనేకమంది ప్రముఖ రాజకీయ నాయకులు వెళ్తుంటారు… రీసెంటుగా టీవీకే విజయ్ కూడా వెళ్లాడు…
ఆ ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు హిందూయిజంపై, ఆధ్యాత్మికతపై, హిందువుల మనోభావాలపై నమ్మకం లేకపోవచ్చు, ఐనంతమాత్రాన ఇష్టారాజ్యం విమర్శలు చేయాలా..? హరీష్ రావుపై ఇంకా పదునైన విమర్శలు ఏమైనా సబ్జెక్టును బట్టి కౌంటర్ చేయండి, తప్పులేదు, ఎదురుదాడికి తను అర్హుడే… కానీ గుళ్లపై పడటం దేనికి..?

మూకాంబికా దేవి క్షేత్రం ఆదిశంకరాచార్యుల చేత ప్రతిష్ఠించబడిన అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటి… విహిత ఆగమ పద్ధతుల్లో పూజలు జరుగుతాయి అక్కడ… మరి క్షుద్ర పూజలు జరుగుతాయనే క్షుద్ర నిందలు దేనికి..? క్షుద్ర పూజలు వేరు, వామాచార పూజలు వేరు… క్షుద్ర పూజలు జరిగే ప్రదేశాలు వేరు, అవి శక్తిపీఠాల్లో జరగవు… వామాచార పద్ధతుల్లో జరిగే పూజలు కూడా అన్ని గుళ్లల్లో జరగవు…
ఐనా అలాంటి నెగెటివ్ రిజల్ట్ కోరుకునే పూజల్ని ఎవరూ కుటుంబసమేతంగా వెళ్లి చేయరు, పైగా వర్షాలు పడకూడదు వంటి కోరికలతో ఎవరూ గుళ్లకు వెళ్లరు… క్షమాపణ చెప్పండి, లేకపోతే క్రిమినల్ కేసు పెడతాను అంటున్నాడు హరీష్ రావు… సరే, ఈ కేసులతో అయ్యేదేముంది గానీ… కాంగ్రెస్ నాయకులు రాజకీయ కౌంటర్లకు, క్షుద్ర వ్యాఖ్యలకు నడుమ తేడా మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి..!!
అసలే లష్కర్ బోనాల పండుగలో మాతంగి బోనం సహా మూడునాలుగు బోనాలు కింద పడిన అపశకునం… దానికితోడు మూకాంబిక కూడా శాపాలు పెట్టాలా కాంగ్రెస్ పార్టీకి..!!
Share this Article