Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డాక్టర్ శ్రీలీల..! కాలేజీకి ఎప్పుడు పోయింది..? ఎప్పుడు చదివింది..?

February 20, 2026 by M S R

.

Mohammed Rafee …. శ్రీలీల MBBS… శంకర్ దాదా MBBS ఒకటేనా? టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల పేరుకు ముందు డాక్టర్ చేరింది! డబ్బులిచ్చి తీసుకునే గౌరవ డాక్టరేట్ కాదు! పరిశోధన చేసి తీసుకున్నది కాదు! ఇది మెడికల్ డాక్టరేట్! పక్కా నాలుగున్నరేళ్లు చదివి పాసైతే వచ్చే డాక్టర్ డిగ్రీ! విచిత్రం ఏమిటంటే ఇప్పుడు శ్రీలీల డాక్టర్ డిగ్రీపై వివాదం రాజుకుంది! కనీసం 80 శాతం అటెండెన్స్ కూడా లేని శ్రీలీల డాక్టర్ డిగ్రీ ఎలా పూర్తి చేయగలిగిందని విమర్శలు వస్తున్నాయి! శ్రీలీలపై కన్నా ఆమె చదివిన ముంబయి డి.వై.పాటిల్ కళాశాలపై మీమ్స్ ఉవ్వెత్తుతున్నాయి!

శ్రీలీల తెలుగు సినిమాల్లో అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయి! ఈతరంలో తెలుగు అమ్మాయిలు చాలా మంది వచ్చారు, వెళ్లారు కానీ, నిలదొక్కుకుని బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా చేసి గుర్తింపు పొంది బాలీవుడ్ తారలతో ఢీ అంటే ఢీ అని సత్తా చాటుకున్న మన తెలుగు హీరోయిన్ డాక్టర్ శ్రీలీల. అమెరికాలో బాల్యం గడచినా ఇండియా తిరిగి వచ్చి తన 17వ ఏట సినీ రంగ ప్రవేశం చేసింది. తండ్రి విజయవాడ, తల్లి బెంగళూరు! ఇద్దరూ విడిపోయారు! శ్రీలీల అమ్మచాటు బిడ్డగా పెరిగింది. మంచి మంచి సినిమా అవకాశాలు రావడానికి ఆమె తల్లికి వున్న పరిచయాలు పిఆర్ వర్క్ కూడా ప్రధాన కారణం అని చెప్పవచ్చు.

Ads

కూచిపూడి, హార్స్ రైడింగ్ తో పాటు అన్ని రంగాల్లోను ప్రవేశం ఉండి కాస్త హైపర్ యాక్టీవ్ గా వుండే శ్రీలీల మంచి డ్యాన్సర్, మంచి నటి. అందుకే బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి హీరోలు…”వామ్మో శ్రీలీల ఎనర్జీ, డ్యాన్స్ స్టయిల్ ముందు ఇంకే హీరోయిన్ సాటి రారు” అని ధైర్యంగా చెప్పారంటే అది శ్రీలీల ప్రతిభ!

ఈమధ్య అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లోనూ డాక్టరేట్ ల పిచ్చి పట్టింది. పిచ్చి డాక్టర్ డిగ్రీలు ఇచ్చే సంస్థలు పుట్టగొడుగుల్లా వెలిసాయి! చాలామంది హీరోలు కూడా ఈ డాక్టరేట్ లు తీసుకుని తగిలించుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్, మోడల్ మానుషి చిల్లర్ మాత్రమే రియల్ డాక్టర్. డాక్టర్ కోర్సు బుద్దిగా చేసాక ఆమె మోడల్ గా మారి, బాలీవుడ్ లోకి అడుగుపెట్టి డాక్టర్ మానుషి అని పిలిపించుకుంటోంది! సాయి పల్లవి జార్జీయాలో డాక్టర్ కోర్సు చదివింది. ఇప్పుడు ఇండియాలో డాక్టర్ కోర్సు పూర్తి చేసిన రెండవ నటిగా శ్రీలీల వెలుగులోకి వచ్చింది.

కానీ, ఇక్కడే ఈ విషయమే కొందరికి మింగుడు పడలేదు. శ్రీలీల 2020లో డి.వై.పాటిల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ లో చేరింది. అంటే కరోనా బ్యాచ్ అన్న మాట! ఆ సంవత్సరం కాలేజ్ లేదు. ఇంకో రకంగా చూసుకున్నా 2020 నుంచి శ్రీలీల సినిమా కెరీర్ చూస్తే, ప్రతి ఏటా రెండు నుంచి నాలుగు సినిమాలు చేసినట్లు కనిపిస్తున్నాయి. ఎంత లేదన్నా కనీసం ఎనిమిది నెలల కాలం ఆమె షూటింగుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు వివిధ షో రూమ్ ప్రారంభోత్సవాలు రిబ్బన్ కటింగులు వగైరాలు షరా మామూలే.

బెంగళూరు, హైదరాబాద్ లలో వుండే శ్రీలీల, షూటింగు వున్నప్పుడు లొకేషన్లలో వుండే శ్రీలీల మరి ముంబయిలో కాలేజ్ కు ఎప్పుడు వెళ్లినట్లు? ఇది మామూలుగా ఏదో డాక్టర్ సర్టిఫికెట్ పెట్టి అటెండెన్స్ మాఫీ చేసుకుని పరీక్షలకు హాజరై పాసై పోయే డిగ్రీ కాదు. నాలుగున్నరేళ్ల డాక్టర్ కోర్సు, కఠినమైన ఇంటర్నెషిప్ ఎప్పుడు చేసినట్లు?

డాక్టర్ కోర్సు ఖరీదైన విద్య! సహజంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఫీజులు తక్కువే కానీ, ప్రైవేట్ కళాశాలల్లో మెరిట్ లేకుండా ర్యాంకులు రాకుండా మేనేజ్మెంట్ కోటాలో సీటు దక్కించుకోవాలంటే కోటి నుంచి ఆపైనే డొనేషన్ రూపంలో వసూల్ చేస్తుంటారు.

డి. వై. పాటిల్ కాలేజ్ పక్కా ప్రయివేట్ కళాశాల. ఎంత మొత్తం ముట్టజెప్పి ఉంటే కాలేజ్ క్లాస్ కు హాజరు కాలేని శ్రీలీల కు డాక్టర్ డిగ్రీ ఇచ్చి ఉంటారని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ఈ విమర్శలు వినిపిస్తుండగా, మన టాలీవుడ్ లో మాత్రం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఒక్కటే… ఎలా వచ్చిందన్నది కాదు… బుల్లెట్ దిగిందా లేదా అన్నదే మనకు ముఖ్యం! అభినందనలు డాక్టర్ శ్రీలీల. – డా. మహ్మద్ రఫీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అప్పట్లోనే రాఘవేంద్రరావు కంట్రాక్టు పెళ్లిని చూపించాడు !!
  • వెకిలి రాఖీ యాడ్‌ను నగల కంపెనీ తీసేసింది ! ఎవరి పరువు పోయింది ?!
  • మతం మా విశ్వాసం – ఓనం మా సంస్కృతి – కేరళ కొత్త తరం అభిమతం !!
  • ఏమండోయ్ ఇది విన్నారా..? ష్, ఆ చెవి ఇటు పడేయండి ఓసారి..!!
  • Very Toxic – పక్కా విషస్వభావి – Not for Grown-Ups also !!
  • అరుదైన కేరక్టర్… అందరిలా జీవించలేదు… అందరిలా మరణించలేదు…
  • గవర్నర్‌పై ఐదు బుల్లెట్లు… ఆ 21 ఏళ్ల యువతి ఎవరు?
  • అసలే ఖర్చు తడిసిమోపెడు- పైగా ఇన్ని సుమోలు ఎందుకురా బుజ్జా..!
  • SLBC – ప్రకృతి కోపంతో దారిమూస్తే – మరో దారి తవ్వి గెలుస్తున్నాం !!
  • చిరంజీవి గ్లామర్ చీర నుంచి అన్నమయ్య చీర తత్వం దాకా..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions