.
Pardha Saradhi Upadrasta …. రాజ్యసభకు నామినేషన్ పత్రాల తిరస్కరణపై సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తిన్న మీనాక్షి నటరాజన్‌కు… తిరస్కరణకు కారణమైన మూల కేసులో కూడా ఊరట దక్కలేదు… ఎలాగంటే..? చదవండి…
హైదరాబాద్, నాంపల్లి కోర్టులో మీనాక్షి నటరాజన్ కేసుపై విచారణ… శ్రీలత పిటిషన్‌ను రిటర్న్ చేసిన నాంపల్లి కోర్టు… పిటిషన్‌లో ప్రజా ప్రతినిధులు ఉన్న కారణంగా పిటిషన్ తమ పరిధిలోకి రాదు.. ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలని సూచన.. ఇదీ వార్త…
Ads
అయితే మళ్ళి కొంత మంది మేధావులు రాస్తున్నారు; కేసు డిస్మిస్ అయ్యింది అని…
నాంపల్లి కోర్టు కేసును డిస్మిస్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు. కేవలం జూరిస్డిక్షన్ లేదని పేర్కొంటూ పిటిషన్‌ను రిటర్న్ చేసింది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో రీ-ప్రెజెంట్ చేసుకోవాలని సూచించింది.
“Return”, “Reject”, “Dismiss” అనే మూడు పదాలకు న్యాయపరంగా పూర్తిగా వేర్వేరు అర్థాలు ఉన్నాయి.
కోర్టు ప్రక్రియలను అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం మంచిది.
1. Return of Petition (రిటర్న్)
కోర్టు “ఈ విషయం నా పరిధిలో లేదు” లేదా సాంకేతిక కారణంతో సరైన ఫోరంకు వెళ్లమని పిటిషన్‌ను తిరిగి ఇస్తుంది.. కేసు మెరిట్స్‌పై నిర్ణయం కాదు.. సరైన కోర్టులో మళ్లీ దాఖలు చేయవచ్చు.
2. Rejection (రిజెక్ట్/తిరస్కరణ)
పిటిషన్‌లో లోపాలు, చట్టపరమైన కారణాలు లేదా maintainability సమస్యల వల్ల కోర్టు దానిని తిరస్కరిస్తుంది.. ఇది కేవలం ఫైల్‌ను వెనక్కి ఇవ్వడం కంటే భిన్నం.
3. Dismissal (డిస్మిస్/కొట్టివేత)
కోర్టు విచారణ చేసి లేదా maintainability పరిశీలించి పిటిషన్‌ను కొట్టివేస్తుంది. సాధారణంగా ఇది కోర్టు ఉత్తర్వుగా పరిగణించబడుతుంది.
అంటే కేసు నాంపల్లి కోర్టులో కొనసాగడం లేదు. అయితే కేసు ముగియలేదు; పిటిషన్‌ను సంబంధిత ప్రజాప్రతినిధుల కోర్టులో మళ్లీ దాఖలు చేసుకునే అవకాశం ఉంది… ఇదీ సంగతి…
Share this Article