Muchata

ఆ మిగిలే 15 శాతాన్నీ పంచేయండి సార్… ఓ పనైపోతుంది…

January 23, 2019

ఛ ఛ… మా రాహుల్ గాంధీ ఇంకా ఏమీ ప్రకటించడేమిటి..? మోడీకి మొట్టికాయ వేయడేమిటి..? మోడీ ఆలోచిస్తున్న అనేకానేక పథకాలకు కాంగ్రెస్ వేగంగా ముందస్తు కౌంటర్లు ప్రకటించడం లేదేమిటి..? ఇలాగైతే మా బాబు గతేం కాను దేవుడోయ్..? అన్నట్టుగా ఉంటయ్ ఆంధ్రజ్యోతిలో కొన్ని రాతలు… అదుగో మోడీ యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ స్కీం పెట్టేస్తాడట… కాదు, కాదు, దేశవ్యాప్తంగా రుణమాఫీ ప్రకటించేస్తాడట… జీఎస్టీ ఇంకా అడ్డగోలుగా తగ్గించేస్తాడట… ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని బాగా పెంచేస్తాడట… 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లు తెచ్చేశాడుగా, ఇంకో అయిదు అస్త్రాలు ఉన్నాయట, ఇదుగో అవి ఇవేనట అంటూ రకరకాల పథకాల్ని రాసేసింది ఇప్పటికే… ఇప్పుడేమో అర్జెంటుగా రాహుల్ మదిలో దూరి, ఓబీసీల కోటా 52 శాతం పెంచేస్తారట కాంగ్రెసోళ్లు తెలుసా, అందులోనూ ఓబీసీ వర్గీకరణ కూడా ఉంటుందట… ఇంకేం, మోడీ ప్రకటించిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లకు పర్‌ఫెక్ట్ కౌంటర్… ఇక చూసుకో నాసామిరంగా, మోడీ పని మటాషే… ఈ దెబ్బకు దేశంలోని బీసీలంతా కాంగ్రెస్ కూటమికే వోట్లు గుద్దేస్తారిక….. అన్నట్టుగా ఓ వార్త కనిపించింది తెల్లవారేసరికి… ‘నీకు ఆలోచన ఉన్నా లేకపోయినా, ఇదుగో ఈ స్కీం ఆలోచించవోయ్’ అంటూ రాహుల్‌కు చెబుతున్నట్టుగా కూడా ఉందిది… బాబూ, ఈ ఆలోచనను రాహుల్ చెవిలో వేసెయ్ అనీ ఉద్బోధిస్తున్నట్టుగా కూడా…!

10 శాతం ఈబీసీ రిజర్వేషన్లతో మోడీ అకస్మాత్తుగా అగ్రవర్ణాల్లో హీరో అయిపోయాడు అని జ్యోతి అంగీకరిస్తూనే… బీసీలు మాత్రం మోడీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ, సో, వాళ్లందరినీ ఇక తమవైపు తిప్పుకోవటానికి కాంగ్రెస్ ప్రయోగించబోయే ఈ 52 శాతం రిజర్వేషన్లు వచ్చే ఎన్నికలను నిర్దేశించబోతున్నయ్ అని ఓ కథనాన్ని కుమ్మిపారేసింది… జాతీయ స్థాయిలో ఏ మీడియా సంస్థకూ దొరకని అత్యంత భారీ ఎక్స్‌క్లూజివ్ వార్త అన్నమాట… (తమ జనాభాకు తగిన స్థాయిలో రిజర్వేషన్లు లేవనే బాధ బీసీల్లో ఉన్నమాట వాస్తవమే… అదేసమయంలో తమ రిజర్వేషన్లను కూడా కొన్ని బీసీ కులాలే అధికంగా అనుభవిస్తున్నాయనే ఎంబీసీల ఆవేదన కూడా నిజమే…)

ఇప్పటికే ఆల్‌రెడీ 49.5 శాతం రిజర్వేషన్లున్నయ్… మోడీ మార్కు 10 శాతం కలిపితే అవి 59.5 శాతానికి చేరిపోయినయ్… ఇక కాంగ్రెస్ పార్టీ మరో 25 శాతం బీసీ రిజర్వేషన్లు కూడా కలిపితే మొత్తం రిజర్వేషన్లు 84.5 శాతానికి చేరుకుంటయ్… అని కూడా ఆంధ్రజ్యోతి లెక్కలు చెప్పింది… (జనాభా శాతాలను బట్టి రిజర్వేషన్లు అనేది పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు) నిజంగానే రాధాకృష్ణ రాసినట్టు కాంగ్రెస్ (ఒకవేళ నిజంగానే) ఈ పెంపు అమలు చేసిందీ అనుకుందాం… అప్పుడిక ఓపెన్ కోటా 15.5 శాతం ఉంటుంది… (రాష్ట్రాలవారీగా రిజర్వేషన్ల శాతాలు వేర్వేరు వర్గాలకు వేర్వేరుగా ఉన్నయ్…) ఇక ఆ మిగిలిన 15.5 శాతంలో కూడా దివ్యాంగులు, మాజీ సైనికులు, యుద్ధబాధితులు, ఉగ్రవాద బాధితులు, క్రీడాకారులు, ప్రవాస భారతీయులు ఎట్సెట్రా పంచేస్తే… ఓ పనైపోతుంది… ఇక హళ్లికి హళ్లి సున్నాకు సున్నా… అంతేనా సారూ..? మాదిగలు ఇన్నేళ్లుగా పోరాడుతున్నా సరే, అసలు ఎస్సీల వర్గీకరణే ఇప్పటికీ సాధ్యం కాలేదు… ఇక ఓబీసీల వర్గీకరణ..? (తెలంగాణలో ఆదివాసీ, బంజారాల పంచాయితీ కూడా ఉంది) అయితే ఈ వార్త నిజమా లేదా అనేది వదిలేస్తే… రాజకీయంగా బాగా చర్చనీయాంశం అవుతున్న మాట నిజం… అవునూ, కులాల జనాభాను బట్టి రిజర్వేషన్లు సరే… పనిలోపని, మతాల వారీగా వాళ్ల కోటాలు వాళ్లకిచ్చేస్తే పోలా…?!

Filed Under: main news

Comments

  1. CHANDRA SEKHAR says

    January 24, 2019 at 7:53 am

    ఇంకొకటి మిగిలింది, హాస్పిటల్స్ లొ బెడ్స్, బస్సుల్లొ సేట్స్, రైల్లొ బెర్ఠుల్లొ కుడా కులాలవారిగా రెజర్వేషన్స్ కల్పింఛాలి అని చెప్తె ఇంకా బాగుంటది.

    Reply
  2. Sri says

    January 23, 2019 at 2:55 pm

    I don’t know why your pointing this one only..So many things we can’t read news in “chandrajyothy”. From 2014 it is become dabba paper and news channel…

    Reply
  3. Ramesh says

    January 23, 2019 at 12:31 pm

    Rajakeeya labdi kosame gaani, sanketika avagahana lekunda chattalu chesthunnaru.

    SC/ST/BC variki reservation unna avasaramaina variki adi andatam ledu.

    Oka SC, IAS officer Daughter ki reservation avasarama?

    BC MP / MLA son ki reservation avasarama?

    Mana samajam lo kontha varaku financial backgground kula venuka batunu maruguna padeyadam ledha?

    Reservation lo second level validation cheyali.

    Ante SC/ST/BC laku vaari financial and social status kuda chudali.

    Appudu veerilo nijamga anagarina, venukabadina varike reservation labhisthundi.

    Financial ga venuka badina agra kulala variki kuda reservation undali.

    The point I am trying to make is the situations have changed so much so we should think about logical ways of provividing reservation so it benigits only the needy people.

    Ila chese dammu evadiki ledhu
    Reservation antene thene thutte ani bhayapaduthunnaru.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Archives

Recent Posts

  • రంగులద్ద‌కుండా… ల‌య‌బ‌ద్ధంగా..!!
  • 10 టీవీ సరే… మరి ఆంధ్రజ్యోతి చేసిందేమిటట… అదే కథ కదా…
  • ప్రేమంటే పెళ్లికాని వాళ్లకేనా? మాకూ వుంటాయండీ…
  • ఔనా… మోడీ భాయ్ ఇమ్రాన్ ఖాన్ కలిసి ఈ ‘ఉగ్ర కుట్ర’ చేశారా..?
  • ఓ లేడీడాన్… బడా సెక్స్ ట్రేడర్… కానీ ఆమే కూడా ఓ ‘అమ్మే’..!
  • సీపీఎంలో టెన్‌టీవీ ప్రకంపనలు… జాతీయ కమిటీ సీరియస్..!!
  • జగన్ పత్రిక, తోకపత్రిక… మరీ బజారు స్థాయి కార్యకర్తల్లా వీళ్లు కూడా..!!
  • ‘యాత్ర’ రాజేసిన చిచ్చు… గౌరు చరిత సీన్, ఆ డైలాగుతో రుసరుసలు…
  • నిరసనకు, ధిక్కారానికీ నలుపు కదా… కాదు, చంద్రబాబు మార్చేశాడు..!
  • మరుగుదొడ్లకూ లింగసమానత్వం..! మన వర్శిటీల్లో కొత్త చైతన్య దీప్తులు..!
  • మోడీకి ఇక సన్యాసమేనట… అమిత్ షాకు శంకరగిరి మాన్యాలేనట..!
  • ఎప్పుడు? ఎందరు? ఎవరెవరు? కేసీయార్ కేబినెట్‌పై అంతా సస్పెన్సే..!
  • సినిమా ఫట్… తెర వెనుక ‘పెద్ద తలల’ నడుమ ఫటాఫట్… దేనికి..?
  • ‘నడత మార్చిన నడక’… యాత్ర సినిమాపై ఓ డిఫరెంటు రివ్యూ…
  • ఊరెళ్లే ప్రయాణమంటే మాటలా మరి..? అబ్బో, ఎంత ప్రయాస..?!

Handcrafted with by All Tech Media. All Rights Reserved Muchata.