Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పలసూరి ఏడుపు … తెలుగు నటుడిగా పుట్టడమే దురదృష్టమట…

June 14, 2026 by M S R

.

తెలుగు నటుడిగా పుట్టడమే నా బ్యాడ్ లక్… ‘పెద్ది’ అప్పలసూరి పాత్రపై జగపతిబాబు ఆవేదన! … ఇవీ కొన్ని వార్తలు నిన్న…

ఎవరో దర్శకుడు పెద్ది సినిమాలో జగపతిబాబు పాత్ర, నటన చూసి, పెద్దగా పేరు రాకపోయేసరికి హాశ్చర్యపడిపోయి… ఇదే మలయాళం, తమిళం, హిందీలో అయితే నీకు మస్తు పేరు వచ్చేది అన్నాడట… ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు…

Ads

నిజానికి అది ఓ ప్లాంటెడ్, ఇంటెన్షనల్, తనకు దక్కాల్సినంత పేరు దక్కలేదు అనే నిరాశలో చేయించుకున్న ఇంటర్వ్యూ అనిపించింది… ఎవరో పెద్ద దర్శకుడి పేరిట తనే తన నిరాశను బయటపెట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది…

మాస్టారూ, లుక్ మారిపోయినంతమాత్రాన… పాత్ర హైలైట్ అయిపోదు, ఇన్నేళ్ల సీనియర్, అది తనకూ తెలుసు… కానీ ఏదో ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్టున్నాడు… బయటపడిపోతున్నాడు… తన తండ్రిది, ఆ బ్యానర్‌ది ఓ చరిత్ర… కానీ అనుకున్నంతగా జగపతిబాబు క్లిక్ కాలేకపోయాడు… ఎమోషన్స్ పలికించలేడనే విమర్శ మొదటి నుంచీ ఉన్నదే…

ఇది నా సినిమా, ఇదీ నన్ను నటుడిగా నిరూపించే పాత్ర అని చెప్పుకోవడానికి ఇన్నేళ్ల కెరీర్‌లో ఏమీ లేదు పాపం… కానీ కొన్ని నిజాలు మరిచిపోయాడు… తెలుగులో ఏ సినిమా అయినా సరే… హీరోను పైకి లేపడానికే పీఆర్వోలు, నిర్మాతలు, దర్శకులు, మీడియా ప్రయత్నిస్తాయి… అదంతా ఓ పెద్ద దందా… మెగా క్యాంపు ఏమీ మినహాయింపు కాదు, పిసరంత ఎక్కువే…

ఆహా రాంచరణ్, ఓహో రాంచరణ్ అనే కీర్తిగానాలు ఈ ప్రక్రియలే సహజమే… మరిక జగపతిబాబును ఎవరు పట్టించుకోవాలి..? అసలు ఆ అతిలోక సుందరి బిడ్డ జాన్వీనే ఓ అంగడి సరుకుగా చూపించారు… డ్యాష్ డ్యాష్ డ్యాష్ చూపించి, ఆ పాత్రను నానారకాలుగా భ్రష్టుపట్టించి, ఇక తెలుగు సినిమా అంటేనే జాన్వీ భయంతో వణికిపోయేలా చేశారు… (లోలోపల మండుతోంది ఆమెకు, అందుకే ఓ నెెగెటివ్ రివ్యూకు లైక్ కొట్టింది)…

అదంతే… చివరకు జాన్వీని అలా చూపించినందుకు దర్శకుడే లెంపలేసుకుని, సీన్లు కొన్ని కట్ చేసి, కొత్త వెర్షన్ రిలీజ్ చేశారు… ఒకరకంగా దర్శకుడు సిగ్గుతో తలదించుకున్నట్టు లెక్క… ఇంకా నయం… జగపతిబాబు సంతోషపడాల్సిన అంశం ఒకటుంది…

బుచ్చిబాబు అంటేనే హీరోకు ఏదో ఒక అంగం కట్ చేసి వదిలేస్తాడు… పెద్ది సినిమాలో ఓ కీలకపాత్ర కదా, జగపతిబాబుది ఏమీ కట్ చేయలేదు… హేపీగా ఉండాలి… హహహ…

ఇక్కడ నిర్మొహమాటంగా కొన్ని అంశాలు చెప్పుకోవాలి… అప్పలసూరి పాత్ర మీద సినిమా టీమ్ బాగా ఊహిస్తోంది… కానీ సినిమాలోని అనేకానేక లాజిక్‌రహిత పాత్రలు, సీన్ల నడుమ అప్పలసూరి పాత్రే కొట్టుకుపోయింది… ఇక జగపతిబాబు నటన (?)ను పట్టించుకునేదెవరు..?

పైగా ఇన్నేళ్లు తన తండ్రికి, తనకు తిండి పెట్టిన ఇండస్ట్రీ మీద కువిమర్శలు, కువ్యాఖ్యలు పాస్ చేయడం కరెక్ట్ కాదు, ఇండస్ట్రీలోనే పుట్టిపెరిగిన ప్రాక్టికల్ మనిషికి అసలే నప్పదు ఇది… నిజం, అప్పలసూరి పాత్ర ఆహార్యం మారింది, భిన్నంగా ఉంది, కానీ హీరో అంతకుమించి తనను తాను మోల్డ్ చేసుకున్నాడు…

ఈ పాత్ర లుక్ కోసం జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ రషీద్ ప్రత్యేకంగా డిజైన్ చేశాడు… తన సుదీర్ఘ కెరీర్‌లోనే అత్యంత సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇదని, నటుడిగా తనకు ఇదొక మైల్‌స్టోన్ అవుతుందని సినిమా విడుదలకు ముందు జగపతి బాబు చాలా నమ్మకంగా చెప్పాడు… కానీ..?

ప్రేక్షకులకు నచ్చాలి, ఆటోమేటిక్‌గా అప్లాజ్ రావాలే తప్ప, సినిమా టీమ్ తన నటనను ప్రమోట్ చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందనే అసంతృప్తి అసమంజసం… పైగా తెలుగోడు కావడం బ్యాడ్ లక్ అనేది చిల్లర విమర్శ… నిజంగా జగపతిబాబు అంత పర్‌ఫామెన్స్ చేసి ఉంటే సోషల్ మీడియా ప్రశంసించి ఉండేది… అదీ లేదు కదా…

పైగా తమిళం, మలయాళం, హిందీతో పోల్చుకోవడం పక్కా భావ దారిద్ర్యం… ఈలోపు కొందరు వేరే చర్చ లేవదీశారు… పక్క రాష్ట్రాల నుంచి వచ్చే విలన్లకు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇచ్చే పారితోషికం, గౌరవం, ప్రమోషన్ మన సొంత నటులకు దక్కడం లేదనేది ఆ వాదన… నిజానికి అది వేరే డిబేట్, ఈ అప్పలసూరికి లింక్ చేయకూడదు…

గతంలో కూడా ‘అరవింద సమేత’ లాంటి సినిమాల్లో విలక్షణమైన పాత్రలు చేసినప్పుడు కూడా జగపతి బాబు ఇలాంటి వివక్షపై పరోక్షంగా మాట్లాడాడు… ‘పెద్ది’ సినిమా విషయంలో అది నేరుగా “తెలుగు నటుడు కావడం నా బ్యాడ్ లక్” అనే స్థాయికి చేరింది ఇప్పుడు..!! అసలు ఇలాంటి పోకడలు, విమర్శలే తెలుగు సినిమాకు బ్యాడ్ లక్..!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అప్పలసూరి ఏడుపు … తెలుగు నటుడిగా పుట్టడమే దురదృష్టమట…
  • నీ అయ్య – నా మామ..! ఒక్క పాటకు సిప్లిగంజ్ కోటి రూపాయల ఖర్చు..!!
  • డబుల్ స్టాక్ రవాణా..! మన రైల్వేలు సాధించిన మరో ఘనత…
  • నమ్ముతారా..? 50 కోట్ల సబ్‌స్క్రయిబర్స్..! నెలకు 400 కోట్ల సంపాదన..!!
  • *నేపియర్…! ఇదీ పెంచాల్సిన సాగు… పెరగాల్సిన ఇంధనం..!!
  • నువ్వు ‘మగాడివిరా’ బుజ్జీ..! అందరి మనసులూ గెలుచుకున్నావ్..!!
  • ఇకపై కారుణ్య నియామకాలు అంత ఈజీ కాదు!
  • అసలే అక్క పురుషద్వేషి… చెల్లెలికీ ఆ రోగం అంటిస్తుంది… తర్వాత..?
  • అయోధ్యపై అఖిలేష్ కొత్త రచ్చ… ఆది నుంచీ యాంటీ- హిందూయే కదా…
  • పాపం త్రిష… ఆశ అడియాసేనా? విజయ్– సంగీత బంధంపై కొత్త ట్విస్ట్..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions