Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొరియన్ కనకరాజూ… కథ మరీ కామెడీ అయిపోయిందోయ్…

August 7, 2026 by M S R

.

వరుసగా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి… వరుణ్ తేజ బాగా వెనుకబడిపోతున్నాడు… ఏం చేద్దాం..? ఈసారి కామెడీతో నడిపిద్దాం ఓ సినిమాను… అబ్బే, కేవలం కామెడీ సరిపోతుందా… వరుణ్ తేజ హీరో కదా, జస్ట్, కామెడీ చేస్తే కుదరదు, హీరోయిజం ఒప్పుకోదు, లెవల్ పడిపోతుంది… మరేం చేద్దాం..?

ఇప్పుడు ట్రెండ్ మాయలు, మంత్రాలు కదా… కలిపేద్దాం… సరే, దాంట్లో నుంచి కూడా ఫన్ పండించొచ్చు, యాడ్ చేద్దాం… మరి కామెడీ పండించాల్సిన ఓ మంచి కమెడియన్ కావాలి, వరుణ్ తేజకు జత కలపాలి… ఎవరున్నారబ్బా..?

Ads

ఇంకెవరు..? సత్య ! సరే, తను వోకే… ఐనా ఇప్పుడు ట్రెండ్ గ్యాంగ్‌స్టర్లు కదా, కథ దేశదేశాలు తిరగాలి కదా… సరే, అదీ కలిపేద్దాం… కథలోకి ఏకంగా ఓ విదేశీ గ్యాంగ్‌స్టర్‌ పాత్రను తీసుకొద్దాం… హమ్మయ్య, ఇక ఈ కథకు సగటు తెలుగు కమర్షియల్ ఫార్ములాలో ఉన్నట్టే పాటలు, ఫైట్లు పెట్టేద్దాం…

వోకే, ఇదే మన రెసిపీ… కానీ తమన్‌ను తీసుకుందాం, ఏదేదో భారీగా మోత మోగించి సీన్లను కాస్త పైకి లేపుతాడు… సరే, అదీ చేద్దాం… ఇదేనేమో బహుశా కొరియన్ కనకరాజు సినిమా ప్రిప్రొడక్షన్ కథ…

కొరియా నుంచి గ్యాంగ్‌స్టర్ అస్థికలు అనంతపూర్ జిల్లా, పెనుకొండకు రావడం ఏమిటో, ఆ అస్థికల్లోని ఆత్మ హీరోలోకి ప్రవేశించడం ఏమిటో… ఆ ఊళ్లో ఎప్పుడూ గొడవపడే రెండు తొట్టి గ్యాంగులేమిటో… కియా కంపెనీలో పనిచేసే హీరోయిన్‌కు కొరియా వెళ్లి స్థిరపడాలనే కోరిక ఏమిటో… సరిగ్గా తనను ప్రేమించే హీరోను కొరియన్ ఆత్మ పట్టుకుని, కొరియా భాష తెలిసిన ఈ పిల్ల పదే పదే ఆ గ్యాంగ్‌స్టర్ ఆత్మ భాషను డీకోడ్ చేయడం ఏమిటో… వీళ్లంతా కొరియా వెళ్లడం ఏమిటో…

కనీసం కిచిడీ కథనూ సరిగ్గా వండలేకపోయారు… ఫస్టాఫ్ ఓ రొటీన్ తెలుగు సినిమాలాగా… నడిచిపోయినా, సెకండాఫ్ అంతా గజిబిజి గందరగోళం, లాజిక్ రాహిత్యం… ఎటొచ్చీ ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏమిటీ అంటే… సత్య కామెడీ… భలే టైమింగ్… ఒక్క ముక్కలో చెప్పాలంటే వరుణ్ తేజ సినిమాను టూ వేరియేషన్స్‌తో ఒక భుజం మీద మోస్తే, మరో భుజం మీద మోసింది సత్య కామెడీ మాత్రమే… ఇంకాస్త ఎక్కువే… సత్య పాత్ర లేకపోతే సినిమా లేదు…

ఎఐ షాట్స్, ఆత్మలు కొట్టుకోవడం గట్రా చూస్తుంటే దర్శకుడు పాపం ఇంకా ఏకాలంలో ఉన్నాడో అనిపిస్తుంది… ఆ బుల్లిరాజుది మళ్లీ ఓవరాక్షన్… హీరోయిన్ రితికా నాయర్ అందంగా కనిపించింది… ప్చ్, వరుణ్ తేజ గ్రహచారం ఇంకా చక్కబడనట్టుంది !!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొరియన్ కనకరాజూ… కథ మరీ కామెడీ అయిపోయిందోయ్…
  • అరుపులు – కేకలు – నెత్తురు – బీజీఎం మోత – బీభత్సమైన హింస !!
  • రుక్మిణి వసంత్ ! ఆమెకు ఓ ఐడెంటిటీ లేదా ? ఇతర హీరోయిన్లకు కూడా !!
  • ‘రామాయణ’లో పేలవమైన వీఎఫ్‌ఎక్స్ ? లేక కొత్త సౌందర్య దృక్పథమా?
  • ఎవరు గురువు – ఎవరు శిష్యుడు ! అంతా హరీష్ హెలూసినేషన్ !!
  • స్మాల్ బడ్జెట్ – బిగ్ రెవిన్యూ ! కథాకథనాలు బాగుంటే కటౌట్లు దేనికోయ్ !!
  • అయోధ్య, శబరిమల, తిరుమల – ముంబై సిద్దివినాయకుడి గుడిలోనూ..!!
  • దురంధర్ సినిమాలో చూపించింది ఈమెనే ! ఆ త్యాగానికి అశోకచక్ర !!
  • ‘‘భావి తరాలు రీల్స్‌ బందీలు – ‘రిథమ్’ తప్పిన అల్గా‘రిథమ్ బతుకులు’’
  • క్షుద్రపూజలు సరే – మరి ప్రేతాత్మలు..? పితృకర్మలు..? (నాలుగో భాగం)

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions