Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇండిగో ఫ్లయిట్‌లో ఏసీ ఆపేసినట్టు… థియేటర్‌లో కూడా సఫకేషన్…

May 1, 2026 by M S R

.

జెట్ లీ… అవును, ఇది తెలుగు సినిమా పేరు… మరీ బ్రూస్ లీ టైపులో ఉందంటారా..? దీనికి ఓ ట్యాగ్ లైన్ కూడా ఉంది… Iam done with comedy… దర్శకుడు రితేష్ రాణా… మత్తు వదలరా అని ఓ డిఫరెంట్ కామెడీ మూవీ ట్రై చేశాడు కదా, దానికి సీక్వెల్ కూడా… తరువాత ఏదో సినిమా వెన్నెల కిషోర్‌తో తీశాడు గానీ తన్నేసినట్టుంది…

ప్రధానంగా తన జానర్ జెన్‌జీ, సోషల్ మీడియా అడిక్టులకు, పరిచయస్తులకు మాత్రమే అర్థమై కాసేపు అక్కడక్కడా నవ్వుకునే కామెడీ… నిజానికి ఓ కథ దారంలా ఉండి, వన్ లైనర్లు, పంచ్ కామెడీ సీన్లు, చిత్రమైన కేరక్టర్లు గట్రా ఆ దారానికి అల్లబడి ఉండాలి… ప్చ్, సత్య హీరోగా చేసిన ఈ జెట్ లీ సినిమా ఈ కోణంలో నిరాశను కలిగించింది…

Ads

అంతేకాదు, సెకండాఫ్ అయితే అసలు దర్శకుడు ఏం చెబుతున్నాడో, ఎందుకంత అతి చేస్తున్నాడో కూడా అర్థం కాదు… చివరకు ప్రజెంట్ జనరేషన్ కూడా జుత్తు పీక్కోవల్సిందే…

‘జెట్లీ’ కథ అజయ్ పోషించిన ప్రజాపతి అనే ఒక స్కామర్, అతన్ని అక్కడి నుంచి తప్పించడానికి ఒక గ్యాంగ్ వేసిన ప్లాన్ చుట్టూ తిరుగుతుంది… ఈ ఆపరేషన్‌లో సత్య అనుకోకుండా చిక్కుకోవాల్సి వస్తుంది… దీనివల్ల ఒక ఫ్లైట్ లోపల వరుసగా గందరగోళ పరిస్థితులు చోటుచేసుకుంటాయి… ఈ పరిణామాలు, విమానంలో కలిగే కుదుపులు చివరకు ఆ స్కామ్‌తో పాటు ఉన్నత స్థాయిలో ఉన్న ఇతర నిందితులను కూడా బయటపెడతాయి… ఒక అర్థవంతమైన కథను అందించడం కంటే, కామెడీ సన్నివేశాల మీదే ఈ సినిమా ఎక్కువ దృష్టి పెట్టింది…

మరోసారి సత్య తన పెర్ఫార్మెన్స్‌తో షో నిలబెట్టే ప్రయత్నం చేశాడు… చెప్పాలంటే, ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు… తన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ మాత్రమే సినిమాలో కాస్త ప్లస్… కాకపోతే ప్రేక్షకుడికే సినిమా బరువు మోయలేనిదిగా మారి, చికాకు పెడుతుంది చివరకు…

ఫీమేల్ లీడ్‌గా రియా సింఘా కనిపించినా, ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా సాదాసీదాగా ఉన్నాయి… ఇక వెన్నెల కిషోర్ విషయానికి వస్తే, తనను సరిగ్గా వాడుకోలేదు… స్క్రీన్ టైమ్ చాలా తక్కువ, ఉన్న కొన్ని సీన్లు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపవు…

ఒక విలక్షణమైన (quirky), మోడ్రన్, స్లిక్ సెటప్‌తో సరదాగా మొదలవుతుంది సినిమా… సీరియస్ స్కామ్ సెటప్‌లో అజయ్ కనిపించడం ఆసక్తిని కలిగిస్తే, సత్య ఇంట్రో కూడా క్యూరియాసిటీని పెంచుతుంది… అలా ఇంటర్వెల్ వరకు సినిమా మిశ్రమ ధోరణిలో పర్లేదు అనేట్టుగా సాగుతుంది… అక్కడక్కడా సత్య నుంచి ఆశించే కొన్ని కొత్త తరం పంచులు బాగానే పేలాయి…

కానీ సినిమా అంతా ఒక ఫ్లైట్ లోపలే జరగడం వల్ల కొంత సమయం తర్వాత… ఇండిగో వాడు ఏసీ ఆపేసినట్టుగా… ప్రయాణికులకు ఊపిరి ఆడనట్లుగా థియేటర్‌లో ప్రేక్షకులకూ suffocating అనిపిస్తుంది… ప్రతి సీన్‌లోనూ సిల్లీ కామెడీ చేయడానికి చేసిన ప్రయత్నం సరిగ్గా వర్కౌట్ కాలేదు… ప్రసిద్ద నటుల అనుకరణ, సిల్లీ మార్షల్ ఆర్ట్స్ కూడా…

ఈ గ్యాగ్స్‌ను సపోర్ట్ చేయడానికి సరైన కథా నేపథ్యం లేకపోవడమే పెద్ద మైనస్… అక్కడక్కడా కొన్ని మూమెంట్స్ నవ్వించినా, చాలా వరకు హ్యూమర్ రిపిటీటివ్‌గా అనిపిస్తుంది… కొన్ని కామెడీ ఐడియాలను పదే పదే వాడటంతో అవి బోర్ కొట్టిస్తాయి… మొత్తానికి ఫస్ట్ హాఫ్ కొన్ని నవ్వులతో అలా సాగిపోతుంది…

సెకండాఫ్ కూడా అదే గందరగోళంతో, మెస్సీ కామెడీతో పాటు కొన్ని గ్రాఫిక్స్ (VFX) సీన్లతో నడుస్తుంది… VFX క్వాలిటీ చాలా దారుణంగా ఉంది, పెద్ద స్క్రీన్ మీద అది చాలా చీప్‌గా అనిపిస్తుంది… ముఖ్యంగా సత్య విమానం నుండి పడిపోయి మళ్లీ గాలిలోనే లోపలికి వచ్చే సీన్ అస్సలు నమ్మశక్యంగా లేదు… అదొక్కటే బాగా పండిన కామెడీ…

చాలా మంది సహాయ నటులు ఉన్నప్పటికీ, కొత్త ముఖాలు పెద్దగా ఆకట్టుకోలేదు… పాత్రల్లో లోతు లేకపోవడంతో వారు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు… అజయ్, శ్రీనివాస రెడ్డి, హర్ష చెముడు వంటి నటులు కేవలం ‘ఓకే’ అనిపించారు…

కాలభైరవ నేపథ్య సంగీతం సినిమా స్టైల్‌కు తగ్గట్టుగా ఉంది… కాకపోతే పాటలు పేలవం… రన్ టైమ్ రెండు గంటలే అయినా సినిమా లెన్తీగా అనిపిస్తుంది… కేవలం సత్య పర్‌ఫామెన్స్ కోసం థియేటర్ దాకా వెళ్లి… నిలువు దోపిడీ ఇచ్చుకోవల్సినంత సీనైతే లేదు… ఓటీటీలోకి వస్తుందిగా, చూద్దాం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండిగో ఫ్లయిట్‌లో ఏసీ ఆపేసినట్టు… థియేటర్‌లో కూడా సఫకేషన్…
  • గాయపడిన సింహం ఊరుకుంటుందా..? ప్రేక్షకుడినీ గాయపరుస్తుంది…!!
  • పాకిస్థాన్‌కు దుబయ్ నుంచి మొదలైంది అసలు ‘వ్యతిరేకత’..!
  • భేష్ లోకేష్… కార్పొరేట్ దోపిడీ బడులను దాటి… నిల‘బడి’…
  • సో, మంగ్లీ తమ్ముడికీ మైక్రో ఫైనాన్స్‌ లావాదేవీలతో లింక్స్..!
  • కత్తి మీ చేతుల్లోనే ఉంది కిషన్ సాబ్… యుద్ధమే మీకు ఇష్టం లేదు…
  • బెంగాల్ రిజల్ట్..! యాక్సిస్‌తోపాటు సట్టాబజార్ కూడా హేండ్సప్..!!
  • గ్రేట్ నికోబార్…! ఇక ‘ఆ మూక’ మొత్తం దీనిపై పడి ఏడుస్తోంది..!!
  • సుడిగాలి సుధీర్… తనను రేయ్, రా, థూ అనడం సమంజసమేనా…
  • ఓహ్… ఆషురెడ్డి కథ- వ్యథ ఇదా..? లండన్ సాఫ్ట్‌వేరుడే అసలు దోషి..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions