Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం విష్ణుప్రియ..! చివరకు ఆ చీప్ జబర్దస్త్ షోలోనూ సెటైర్లు..!!

June 10, 2026 by M S R

.

భీమినేని విష్ణుప్రియ… ఈ టీవీ యాంకరిణి పేరు ఈమధ్య బాగా వార్తల్లో, సోషల్ మీడియా ట్రోలింగుల్లో నలిగింది… తన ఇన్‌స్టా పేజీని నెలకు 399 రూపాయలు చెల్లిస్తే… తన ‘ప్రైవేటు కంటెంటు’ చూడొచ్చునని ప్రకటించింది… ఇదొకరకం అందాల్ని అమ్ముకునే విధానం అంటూ ఆమె మీద భీకరంగా ట్రోలింగ్ సాగింది… చివరకు ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు గుర్తు…

అనన్య నాగళ్ల… సినిమా నటి… తను కూడా సేమ్ విష్ణుప్రియలాగే ఈ సబ్‌స్క్రిప్షన్ కంటెంట్ స్టార్ట్ చేసింది… కానీ తనపై వచ్చిన ట్రోలింగుకు ఆమె జవాబిస్తూ తానేమీ అశ్లీల కంటెంట్ చూపించడానికి ఈ ఫీచర్ పెట్టలేదనీ, నెగిటివ్ కామెంట్లు చేసే వారిని దూరం పెట్టడానికి కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని చెప్పింది…

Ads

వీాళ్లతోపాటు బిగ్‌బాస్ ఫేమ్ ఆషు రెడ్డి, సిరి హన్మంతు వంటి మరికొంతమంది టీవీ సెలబ్రిటీలు కూడా ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను నడుపుతున్నారని ఓ సమాచారం… ధర చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే వారి ప్రైవేట్ స్టోరీలు, స్పెషల్ రీల్స్, లైవ్ చాట్స్, బిహైండ్ ది సీన్స్ (Behind the scenes) కంటెంట్ కనిపిస్తాయి…

జబర్దస్త్

ఇదంతా ఎందుకు చెప్పడం అంటే… రీసెంట్‌గా జబర్దస్త్ ప్రోగ్రామ్ ప్రోమో ఒకటి కనిపించింది… అందులో ఓ లేడీ కేరక్టర్ వచ్చి 399 రూపాయలకే సబ్‌స్క్రిప్షన్ అని చెబుతుంది, వెంటనే మరో ముసలాయన ఆడ వేషం వేసుకుని కనిపిస్తుంటాడు, జస్ట్ 99 రూపాయలు చాలు అంటాడు, మిగతా కమెడియన్లు చొంగకార్చుకుంటూ ఇక ఏవో డైలాగ్స్… అవి జబర్దస్త్ టేస్టుకు తగినట్టే ఉంటాయి… చివరలో రష్మి గౌతమ్ కూడా నన్నూ సబ్‌స్క్రయిబ్ చేయండి అంటుంది, కొసమెరుపు…

విష్ణుప్రియ సబ్‌స్క్రిప్షన్ యవ్వారంపై ఇది సెటైర్ అనుకోవచ్చు, దాని ప్రేరణగా రాసుకున్న ఓ స్కిట్ కావచ్చు… తప్పు పట్టేదేమీ లేదు.,.. వర్తమాన అంశాలపై నిజానికి మంచి పంచ్ ఉన్న సెటైర్స్ పడితే మంచిదే… కానీ అది జబర్దస్త్… వేణుస్వామిలా కనిపించే ఓ కమెడియన్ వస్తాడు, వాడి పేరు సీనుస్వామి అట… అంటే వేణుస్వామి పేరు స్ఫురించేలా… పూజకు 10 లక్షలు అవుతుందీ అంటాడు… సరే, దాన్నీ వోకే అనుకుందాం…

కానీ ఎప్పుడైనా, జబర్దస్త్ షో మెగా ఫ్యామిలీ సభ్యులకు సంబంధించి చిన్న సెటైర్, కనీసం చిన్న డైలాగ్  వేయగలిగిందా అనే ప్రశ్న తలెత్తుతుంది… హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ సీను, ఆటో రాంప్రసాద్ వంటి పాపులర్ కమెడియన్లంతా జనసేన కార్యకర్తలే కావడం ఓ కారణం కావచ్చు…

జబర్దస్త్

నాగబాబు, రోజాలు జడ్జిలుగా ఉన్నప్పుడూ అంతే, మహేష్ కత్తి యవ్వారంతోపాటు చాలా స్కిట్లు, పంచులు మెగా వ్యతిరేకుల మీద యథేచ్ఛగా వేసేవాడు హైపర్ ఆది… ఇప్పుడు మళ్లీ వచ్చాడు కదా నాగబాబు ఈ షోలోకి… మళ్లీ ఆది వస్తాడట… ఇక చూసుకొండి- జనసేనను విమర్శించేవారి మీద పంచులే పంచులు…

పాపం మల్లెమాల…! నాగబాబు ఎవరు చెబితే వాళ్లు రావాలి షోలోకి… ఎవరిపైనైనా కోపం వస్తే వాడి చాప్టర్ అక్కడితో క్లోజ్ జబర్దస్త్ షోలో… అసలు దరిద్రం ఏమిటంటే, సిమిలర్ షోలు మిగతా చానెళ్లలో క్లిక్ కాకపోవడం..! ఈమధ్య జెమినిలో మాస్ జాతర అని వస్తోంది, పర్లేదు, కానీ ప్రతి స్కిట్‌లో అనేకమంది ఉండటంతో పంచ్ కుదరడం లేదు… పైగా ఆ చానెల్ రీచ్ మరీ మరీ తక్కువ… అందుకని జబర్దస్త్ అలా నడుస్తూనే ఉంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కన్నెపల్లిపై అదే స్క్రిప్టు – అదే ప్రహసనం — కాకపోతే ఫేస్ మారింది!!
  • కథ బాగుంది… వెరయిటీగా ఉంది… ఆలోచనాత్మకంగా ఉంది…
  • ఏ కెరటం ఏ తీరానికి చేరుతుందో – ఈ మోహిని ఇప్పుడేం చేస్తోందంటే?
  • బాలమురళి పాడేది అసలు సంగీతమే కాదు- హైకోర్టులో ఓ కేసు …
  • ఎగిసిన రంగుల కెరటాలు కొన్ని విరిగిపడటం… స్వయంకృతాలే..!
  • 5 కోట్ల బంగారు రామచరితమానస్ – అయోధ్య గుడిలో మాయం !
  • కన్నెపల్లి పంపులపై కేటీయార్ వితండవాదం – ఇవిగో అసలు నిజాలు…
  • మూడు రాచకుటుంబాల వారసత్వం – ఒక్క వీడియోతో కెరీర్ కకావికలం
  • FIFA 2026 – అనూహ్య ఫలితాలు – అంచనాల్లో తేడాలే అసలు మజా!!
  • I will find you – గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ –

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions