Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తొలి సినిమాతోనే మంచి పేరు ! ప్చ్, రిక్షా తోలుకుంటున్నాడు !!

August 9, 2026 by M S R

.

జీవితం అంటేనే ఆటుపోట్ల ప్రయాణం… అందులోనూ అత్యంత చంచలమైన సినిమా ఇండస్ట్రీలో ఎవడెప్పుడు కుప్పకూలుతాడో, ఎవడెప్పుడు హఠాత్తుగా శిఖరం ఎక్కుతాడో తెలియదు… టైమ్ అంటారా, డెస్టినీ అంటారా, జాతకం అంటారా, విధి రాత అంటారా మీ ఇష్టం… కానీ అనూహ్య పరిణామాలకు ఎప్పుడూ రెడీగా ఉండేవాడే ఇండస్ట్రీలో స్థితప్రజ్ఞుడు…

అంతేకాదు, పొట్ట కూటి కోసం, డిగ్నిటీ ఆఫ్ లేబర్… ఏ పనైనా చేయడానికి సిద్ధపడేవాడే అసలు హీరో… నేను శిఖరంపై ఉన్నాను, నాన్సెన్స్ ఈ పనులు చేస్తానా అనుకున్నవాడు మరింత చెడిపోతాడు… కానీ ఈ నటుడిని నేనయితే మెచ్చుకుంటాను… ఈ నటుడి పేరు మారిముత్తు…

Ads

2008లో అనుకుంటా… ఓ కల్ట్ క్లాసిక్ వచ్చింది… సుబ్రమణ్యపురం… హిట్… మంచి ప్రశంసలు దక్కాయి, అందులో నటించాడు ఈ మారిముత్తు… తను వచ్చిందే నిరుపేద నేపథ్యం నుంచి… ఈ సినిమాతో ఇక నా దశ మారుతుంది అనుకున్నాడు… ఆ సినిమాలో వాస్తవిక జీవనం, నటన, సంగీతం ప్రేక్షకులకు నచ్చింది…

మనకు తెలిసిన సముద్రఖని, కలర్స్ స్వాతికి కూడా మంచి పేరు తెచ్చింది ఈ సినిమా… ఇక్కడ మారిముత్తు గురించి… పేద కుటుంబం, చిన్నప్పుడే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు, మూడో తరగతి డ్రాపవుట్… అవును, మరీ మూడో తరగతి నుంచి బడికి వీడ్కోలు…

మారిముత్తు

చిన్నతనంలోనే లైట్లు, మైక్ సెట్లు రిపేర్ షాపులో పనిచేసేవాడు, తరువాత చెన్నైకి వచ్చాడు, సినిమా అంటే పిచ్చితో… కొన్ని వేలమందిలో ఉన్నట్టుగానే…! షాపులో పనిచేస్తుంటే తన కో-వర్కర్స్ ఓ ఫోటో తీశారు, అది ఎవరు చూశారో గానీ సుబ్రహ్మణ్యపురం ఆడిషన్స్‌కు పిలుపొచ్చింది…

ఎగిరి గంతేశాడు… సినిమా అయిపోయింది, హిట్… తనకు ఇక మంచి కామెడీ, కేరక్టర్ రోల్స్ వస్తాయని బాగా ఆశించాడు… ప్చ్, లాభం లేదు… డబ్బు లేదు, కుటుంబాన్ని పోషించాలి, అవకాశాల్లేవు… సో, ఓ రేడియో మెకానిక్ షాపులో చేరాడు… తరువాత ఓ డొక్కు ఆటో కొనుక్కుని, తనే రిపేర్లు చేసుకుంటూ దాన్ని తోలేవాడు…

ఈ సెల్ఫ్ రిపేర్లు, ఆటో డ్రైవింగ్ వీడియోలు వైరల్ అయ్యాయి… కానీ వాటితోనూ పైసా లాభం లేదు… తన సినిమా తొలినాళ్లలో పరిచయం అయిన కార్తకను పెళ్లిచేసుకున్నాడు… కుటుంబం, ఖర్చులు, ఏమీ ఆమ్‌దానీ లేదు… ఆశాజీవి… ‘ఏమో సుబ్రహ్మణ్యపురం-2 వంటి సినిమా రాకపోదు’ అంటాడు నవ్వుతూ…

ఎక్కడో ప్రయాణం మొదలై, ఎటో మలుపు తిరిగి, ఇంకే దారిలోనో పడి, కుదుపుల మధ్య సాగుతున్న మారిముత్తు ఆశావాది… డెస్టినీ ఎంత శపించినా సరే, నవ్వుతూ, డోన్ట్ కేర్ అనుకుంటూ సాగిపోతున్న తీరు నిజంగా ఓ విశేషమే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ బీ సీరియస్ ! మంచి చెప్పరు – ఎదురుదాడి చేయరు – కొన్ని దిద్దుకోరు !!
  • ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు వుండకూడదు !!
  • ప్చ్.., ఏజ్ గ్యాప్ – కెమిస్ట్రీ పండలేదు – మరీ అక్కాతమ్ముళ్లలాగా !!
  • రాముడు ముంచుతాడో తేల్చుతాడో – మునుపెన్నడూ ఎరుగని భారీ పందెం !!
  • The Economist – ‘కొత్త హైదరాబాద్ ప్లాన్’ను అర్థం చేసుకుంది !!
  • రాఖీ సురేఖ కొలువు కాపాడుతుందా..? రాఖీ కట్టే కొత్త చెల్లెలు వస్తుందా?
  • ఈ నవ్వు వందలసార్లు చూసి ఉంటారు కదా… ఇదొక్కసారి చదవండి…
  • పుతిన్ అణుదాడి చేస్తాడు ! బ్రిటన్ మీదా కీవ్ మీదా చూడాల్సి ఉంది !
  • అబ్బే.., జగన్ రెడ్డి, కేసీయార్ పార్టీలు పెద్దగా పుంజుకోలేదట…
  • ₹22 వేల కోట్ల అప్పు… ₹6.5 కోట్లకే కథ ముగిసిందా? ఇదీ అసలు కథ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions