Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘తిక్కలదిర ఈ అక్క… వేగలేము ఈ అక్కతో… ఆడలేము తైతక్క…’’

May 5, 2026 by M S R

.

మమత బెనర్జీ తాజా ప్రకటన వినగానే… తెలుగులో ఓ పాట గుర్తొచ్చింది… ఆప్ట్ అయినా కాకపోయినా… ‘‘తిక్కలదిర నీయక్క, వేగలేము నీయక్కతో, ఆడలేము తైతక్కా’…. నవ్వొచ్చింది… ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా చేసింది, కేంద్ర మంత్రిగా చేసింది, దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఉంది… ఈరోజుకూ ఆమెకు ఓ రాజకీయ సంస్కారం లేదు, ప్రొటోకాల్ మర్యాద తెలియదు…

జనం థూత్కరించి, కర్రు కాల్చి వాతలు పెట్టి… ఎహె దిగిపో అని చాటినా సరే… నో, నో, నేను ఓడిపోలేదు, నేను రాజీనామా చేయను అంటోంది మమత బెనర్జీ… ఈసీ, బీజేపీ 100 సీట్లు లూటీ చేశారు, అందుకని నేను రిజైన్ చేయనుపో అంటోంది… ప్రజలు ఓడించలేదు, కుట్ర ద్వారా నేను ఓడించబడ్డాను అంటోంది…

Ads

సరే, ఆమె తత్వం అది, అందరికీ తెలిసిందే… ఇలాంటి క్షుద్ర పోకడలే కదా ఆమెకు తాటకి అనే పేరు తెచ్చిపెట్టాయి… ఇప్పుడేం చేస్తుంది..? తిరిగి ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టుకు పోతుందా..? సీఈసీని ఈమేరకు ఆదేశించాలని పిటిషన్ వేస్తుందా..? సరే, ఆమె మదిలో ఏం ప్లాన్ ఉందో, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్నిరకాలుగా అడ్డుపడాలని ఆలోచిస్తుందో గానీ…

ఇలాంటి స్థితిలో గవర్నర్ పాత్ర కీలకం… ఇదంతా ఊహించినట్టున్నాడు అమిత్ షా… అందుకే ఆర్ఎన్ రవిని ఎన్నికలకు ముందే బెంగాల్  గవర్నర్‌గా నియమించాడు… తను మాజీ ఐపీఎస్… కీలకమైన ఐబీ వంటి విభాగాల్లో పనిచేశాడు… ఈశాన్య రాష్ట్రాలకూ గవర్నర్‌గా పనిచేశాడు… తను నేరుగా మమత ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తూ నిర్ణయం ప్రకటించవచ్చు…

పశ్చిమ బెంగాల్ ప్రస్తుత (17వ) అసెంబ్లీ, ఎమ్మెల్యేల పదవీకాలం 2026, మే 7వ తేదీతో ముగుస్తుంది… రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం, అసెంబ్లీ గడువు 5 ఏళ్లు ముగియగానే అది దానంతట అదే రద్దవుతుంది… అంటే అసెంబ్లీ ఖాళీ… ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరు… నిన్ననే (మే 4, 2026) పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి… ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ అంతా మే 6వ తేదీ కల్లా పూర్తి కావాలి… అంటే రాజ్యాంగపరంగా పాత ఎమ్మెల్యేల పదవీకాలం ముగియడానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది…

ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే…

  • మే 7, 2026….: పాత అసెంబ్లీ గడువు ముగిసే ఆఖరి తేదీ.

  • మే 4, 2026…: ఫలితాలు వచ్చాయి (బిజెపి మాంచి మెజారిటీ సాధించింది…)

సాధారణంగా ఇలాంటి స్థితిలో ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడు, కొత్తగా మెజారిటీ సాధించిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానిస్తాడు… అవసరమైతే అప్పటివరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని పాత ముఖ్యమంత్రిని కోరతాడు…

కానీ ఇక్కడ నేను దిగిపోను అని మమత బెనర్జీ మొండికేస్తే… అసెంబ్లీ గడువు ముగిసిపోతుంది కాబట్టి ఆమెకు లేదా ఆమె ఎమ్మెల్యేలకు ఎలాంటి చట్టబద్ధమైన అధికారాలు ఉండవు… సో, పాత మంత్రివర్గం, అసెంబ్లీ రద్దయినట్టుగా గవర్నర్ ప్రకటిస్తాడు…

అవసరమైతే ఎన్నికల సంఘం నుంచి ఫలితాలను అధికారికంగా తెప్పించుకుంటాడు… తరువాత బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశమై, హైకమాండ్ చెప్పిన ఎవరో ఓ పేరును బీజేపీఎల్పీ లీడర్‌గా ఎన్నుకుని, గవర్నర్‌కు సమర్పిస్తారు… పద్ధతి ప్రకారం ప్రమాణ స్వీకారం చేయమని గవర్నర్ ఆహ్వానిస్తాడు…

గవర్నర్ ఫ్లోర్ టెస్టు అడుగుతాడు అని ఎవరో వార్తల్లో రాస్తే నవ్వొచ్చింది… ఆల్రెడీ ఆ ఎమ్మెల్యేల పదవీకాలం 2 రోజుల్లో పూర్తయినట్టే… అంటే ఇక ప్రమాణ స్వీకారాలు చేసిన పాత సభ్యులు ఎవరూ లేనట్టే… ఇక బలనిరూపణ ఏముంది..?  ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత లేదా గడువు ముగిసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోతే, అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుంది…

రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తాడు అనే మరో విశ్లేషణ కూడా అబ్సర్డ్… ఏ పార్టీకి మెజారిటీ లేనప్పుడు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాని స్థితిలో మాత్రమే రాష్ట్రపతి పాలనకు ఆర్టికల్ 356 కింద సిఫారసు చేస్తాడు… ఇక్కడ ఆ సిట్యుయేషన్ కూడా లేదు…

ఎమ్మెల్యేల పదవీకాలం ముగిశాక ముఖ్యమంత్రికి సభలో ఎలాంటి అధికారం ఉండదు… అప్పుడు ఆమె కేవలం ఒక సాధారణ పౌరురాలితో సమానం… (చివరకు ఎమ్మెల్యేగా కూడా ఆమె ఓడిపోయింది)… సో, ఆమెను సచివాలయం లేదా అసెంబ్లీలోకి అడుగు కూడా పెట్టనివ్వరు…!! గవర్నర్ సాబ్, మీ నిర్ణయం ఏమిటి..?!

ఐనా సరే, తన రౌడీ గ్యాంగులతో కలకత్తా వీథుల్లో వీరంగం సృష్టిస్తానని ఆమె భావిస్తే..? అందుకేగా యూపీ నుంచి ప్రత్యేకంగా అజయ్ పాల్ శర్మను పంపించింది… తను చూసుకుంటాడు..!! ఆర్జీ కర్ ట్రైనీ డాక్టర్ ఆత్మ పెట్టిన శాపాలు సరిపోతున్నట్టు లేవు మమతకు…!!!

RG kar

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘తిక్కలదిర ఈ అక్క… వేగలేము ఈ అక్కతో… ఆడలేము తైతక్క…’’
  • నో… వోట్ల తొలగింపుతో బీజేపీకి ఫాయిదా అనేది ఉత్త బోగస్ వాదన…
  • ‘లాటరీ’ తగిలింది… ఆ ’ఫ్యామిలీ’ గెలిచింది… అల్లుడు కాబోయే మంత్రి…
  • అల్లరిపిల్ల..! అప్పట్లో మీనాకు భలే పాత్రలు దొరికేవి..!
  • బీజేపీని గెలిపించేది- సోకాల్డ్ సెక్యులర్ పార్టీల ‘సంతుష్టీకరణ’ పోకడలే…
  • ఆ మమతా దిగిపోయింది… ఇక మిగిలింది ఒకేఒక లేడీ సీఎం…
  • మల్లాడికి ఆరో విజయం…, తమిళిసైకి ఏడో ఓటమి… కంట్రాస్టు…
  • మమత పతనం రెండేళ్ల క్రితమే చెప్పింది..! మరో రెండు కీలకం…!
  • మమత అహం మీద ఛెళ్లుఛెళ్లుమని… ఈ ఇద్దరు మహిళల విజయాలు…
  • మోడీ అశ్వమేధం… ఒక్కో రాజ్యాన్ని ఆక్రమిస్తూ… కాషాయ సామ్రాజ్యం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions