.
.
మా చిన్నప్పుడు స్కూల్‌లో ఓ డొక్కు మైకు, క్యాసెట్ ప్లేయర్ ఉండేది… ఏడాదికి రెండే రోజుల్లో… పంద్రాగస్టు, చెబ్బీస్ జనవరి రోజుల్లో మాత్రమే, దాన్ని దులిపి, తుడిచి పదే పదే ఈ పాట వేసేవాళ్లు…
.
ఇదేమీ దేశాన్ని కీర్తించే పాట కాదు, పోరగాళ్లం, దాన్ని వినే మాకు ఎలాగూ తెలియదు, టీచర్లకూ తెలియదు, పల్లవి విని ఇదే జాతీయగీతం అన్నంతగా మురిసిపోతూ సౌండ్ హై వాల్యూమ్‌లో పెట్టేసేవాళ్లు… (మాయదారి మైసమ్మో అనే పాటను భక్తిగీతంగా ప్రచారంలోకి తీసుకొచ్చినట్టుగా !!)
.
ఇది శ్రీశ్రీ రాశాడని మాత్రమే గుర్తు, ఏ సినిమా కోసం తెలియదు… ఆ పాట ఇలా సాగుతుంది… బహుశా 1960-61 ప్రాంతంలో రాసి ఉంటాడు తను… (బహుశా వెలుగు నీడలు సినిమా కావచ్చు, అన్నపూర్ణ స్టూడియోస్ సొంత సినిమా అది)…
.
పాడవోయి భారతీయుడా! ఆడి పాడవోయి విజయ గీతిక!
స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి
Ads
ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతి దారుల
ఆకాశం అందుకొనే ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలముకొన్న ఈ దేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితి
పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి మనిషి మరియొకని దోచుకొనే వాడే తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునే వాడే
స్వార్థమేఅనర్థ కారణం అది చంపుకొనుటె క్షేమదాయకం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారత దేశం అందించినులే శుభ సందేశం
.
ఏమైనా మారిందా పరిస్థితి..? అనేక కోణాల్లో ఇంకా ఇంకా దిగజారిపోయింది, పోతోంది... సో, ఈ పాట నాటికీ నేటికీ వినిపిస్తూనే ఉంది... ఉంటుంది...
Share this Article