Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘నేను నా చెల్లెలికి ఓ సెకండ్ మమ్మీ… అంత ఏజ్ గ్యాప్, అంత ప్రేమ…’’

August 3, 2024 by M S R

పాటల ఎంపిక మీద నా అభ్యంతరాలు అలాగే కొనసాగాయి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఎపిసోడ్ 16 చూస్తుంటే…! మంచి గొంతులు, మంచి మెరిట్ ఉన్న కేశవ్ రాం, కీర్తన, శ్రీకీర్తి, శ్రీ ధృతి, నజీరుద్దీన్, స్కంధ, సాయి వల్లభ, అనిరుధ్, భరత్… అందరూ… ఎటొచ్చీ మనస్సుల్ని కనెక్ట్ చేసే పాటలు కావు… ఒకటీరెండు మినహా…

ఏమో, పాటల ఎంపికలో కూడా ఏమైనా కార్పొరేట్ రెవిన్యూ బాపతు, అల్లు అరవింద్ మార్క్ వ్యూహం ఏమైనా ఉందేమో గానీ… అసలు ఇవన్నీ వినోద దందాలో భాగమే కదా… అసలే ఆహా ఓటీటీ… సరే, షో మ్యూజిక్ పార్టనర్ ఆదిత్య మ్యూజిక్ కంపెనీ కాబట్టి ఎక్కువగా వాళ్ల పాటలే ఎంపిక చేయబడాల్సి వస్తుందేమో…

ముందుగా ఓ విషయం చెప్పుకుందాం… రష్మిక… గొప్ప నటి అనను గానీ… గొప్ప లక్కీ స్టార్… కర్నాటక కొడగు ఏరియాకు చెందిన ఈమెకు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం తరువాత బ్రేకప్ కావడం ఏమో గానీ… తరువాత వెనుతిరిగి చూడలేదు… గీతగోవిందం, పుష్పలతో ఎక్కడికో వెళ్లిపోయింది… బాలీవుడ్‌కూ వాంటెడ్ స్టార్ అయిపోయింది…

Ads

తనకు ఓ బుజ్జి చెల్లెలు… షిమాన్ మంధాన… రష్మికకన్నా 16 ఏళ్లు చిన్నది… అదెలా అనేది పక్కన పెడితే… నేను తనకు సెకండ్ మమ్మీ అని చెప్పుకుని మురిసిపోయింది రష్మిక… బాగుంది… విజయ్ దేవరకొండా. నీకో బుజ్జి మరదలు… గుడ్…

రీసెంటుగా ఆమె మీద ట్రోలింగ్ చూశాను… దిక్కుమాలిన పైత్యాలు… ఆమె వయనాడ్ విపత్తు బాధితుల సాయం కోసం 10 లక్షలు ప్రకటించింది… తన ఏరియా కొడగులో ఇలాంటివి వస్తే స్పందించదు గానీ వయనాడ్ ట్రాజెడీకి స్పందించింది అని ట్రోలింగ్… పైత్యం… ఒరేయ్, ఒక్క తెలుగు నటుడు స్పందించాడా..? వందలు, వేల కోట్లు, ప్రత్యేక సొంత ఫ్లయిట్లు, ఆస్తులు… ఒక్కడికీ మనసు రాలేదు కదరా… ఆమె గ్రేట్ కదరా… అఫ్‌కోర్స్, మన తెలుగు నటులు తెలుగునాట కష్టాలకే స్పందించరు, ఇక మలయాళీలను ఎలా ఆదుకుంటాారు..? ఆ మార్కెట్ డబ్బు మాత్రం కావాలి… సిగ్గూశరం లేదు కదా…

ఒక మమ్ముట్టి, తన కొడుకు కలిపి అర కోటి… ఫహాద్, భార్య నజ్రియా మరో అరకోటి… జ్యోతిక-సూర్య, నయనతార-విఘ్నేశ్ కూడా 25, 50 లక్షల సాయం… మోహన్‌లాల్ 3 కోట్లు ప్రకటించడమే గాకుండా ఏకంగా రంగంలోకి దిగి సహాయకచర్యలకు పూనుకున్నాడు… విక్రమ్, కమలహాసన్ కూడా స్పందించారు… ఈ స్థితిలో రష్మికను మెచ్చాల్సింది పోయి, వ్యంగ్యాలు, వెక్కిరింపులు, విమర్శలు దేనికి..? నాన్సెన్స్..!! మీరు పూజించే నట దేవుళ్లు ఏం చేశారని..!!

షోలోకి అభిజ్ఙ అనే మరో లేడీ సింగర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది… మొన్న మనం చెప్పుకున్నాం కదా, ఇదీ బిగ్‌బాస్ షోలాగే మారుతోందని… జడ్జిలకు తలకాయల్లేక ఆమెను సెలక్ట్ చేయకపోతే, శ్రోతలే పెద్ద ఎత్తున ఆమెను తీసుకొండి అని చెప్పారట… రాగానే అంత గొప్పగా ఏమీ పాడలేదు, కానీ ఒక లేడీ రాగానే మరో లేడీని పంపించేశారు… ఆరుగురు మగాళ్లు, ముగ్గురు ఆడాళ్లు మిగిలారు…

శ్రీ ధృతిని పంపించేశారు… నిజానికి మంచి మెరిటే… కానీ ప్రతివారం ఎవరో ఒకరు పోవాల్సిందే కదా… అందంగా ఉంటే షోకు నప్పదా థమన్… రజినీ శ్రీపూర్ణిమ, హరిప్రియ, ఇప్పుడు శ్రీ ధృతి… సరే, ఎలిమనేషన్లకూ పిచ్చి లెక్కలు, యవ్వారాలు ఉంటాయేమో… కానీ అనేక కారణాలతో రాను రాను తెలుగు ఇండియన్ ఐడల్ షో చిరాకు తెప్పిస్తోంది…!!

#ssthaman, #geethamadhuri, #singerkarthik, #sriramachandra, #ahavideoin

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!
  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions