బాస్.., ఈసారి హారిక కెప్టెన్‌గా ఎన్నికైంది, తను ఫుల్ ఖుషీ… వోకే
ఈసారి మోనాల్ గుజ్జర్ ఔట్, తప్పదు, వెయిట్, ఫిక్స్డ్…. వోకే
Ads
ఇన్ని నెలల బిగ్‌బాస్‌లో కుటుంబసభ్యుల కలయికే కాస్త ఎమోషనల్ టచ్… వోకే…
ఇంకా రేటింగ్స్ పడిపోతున్నయ్, టీం నెత్తికి చేతులు పెట్టుకుంది… వోకే
అవినాష్ పని ఖతం, అరియానా బాయ్ ఫ్రెండ్ వచ్చేశాడు… వోకే…
సొహెయిల్ చేజేతులా చెడగొట్టుకుంటున్నడు, ఆ మెహబూబ్ జపం ఏందిర భయ్… వోకే
మోనాల్ సోదరి హౌజులోకి వచ్చి ఇంకా ఆమె చాన్సెస్ చెడగొట్టింది… వోకే…
….. ఇవన్నీ చదవండి, అయితే ఫినాలే దగ్గరకు వస్తోంది… ఇక ఇవన్నీ టైంపాస్ పల్లీ ముచ్చట్లు… అసలు హీట్ పెరుగుతుంది… ఈ గ్రూపులు గట్రా జాన్తానై… ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత ప్రయాసే… దోస్తీ లేదు, గ్రూపూ లేదు… ఎవరి ప్రయత్నం వాళ్లది… కానీ ఒకసారి కాస్త లోతుగా పరిశీలిస్తే…
ఈసారి హౌజులో ప్రస్తుతం మిగిలినవాళ్లలో తెలంగాణ వాళ్లు… కష్టపడి పైకి వచ్చినవాళ్లు… ఫైటర్స్… బ్రేకప్పులు కనిపిస్తున్న తీరు ఓ విశేషం… చాలామంది నమ్మేది ఏమిటంటే ఈసారి విన్నర్ అభిజిత్ అని… అర్హుడే… అనేక కోణాల్లో తను ప్రూవ్ చేసుకుంటున్నాడు… ఫిజికల్ టాస్కులు మరిచిపొండి, ఇదేమైనా బాక్సింగు పోటీయా దేహదారుఢ్యం ప్రదర్శించడానికి… ఆ భ్రమల్లో పడే సొహెయిల్, మెహబూబ్ గట్రా చెడగొట్టుకున్నారు…
అభిజిత్ ప్రొఫైల్ చెక్ చేస్తున్నట్టు గూగుల్ ట్రెండ్స్‌లో కనిపిస్తోంది… ప్రత్యేకించి తన కులం కోసం… నెట్లో అది కనిపించదు… కానీ అతని ఇంటిపేరు దుద్దల… అది ప్రధానంగా సగర క్షత్రియుల్లో కనిపించే ఇంటిపేరు… ఉప్పర… గతంలో ఉప్పు కార్మికవర్గం… తరువాత వ్యవసాయ, భవననిర్మాణం వైపు మళ్లిన కులం… మంచి ఆత్మాభిమానం కలిగినవారే… షట్చక్రవర్తులుగా పేరుగాంచిన వారిలో సగర చక్రవర్తి వాళ్ల మూలపురుషుడు… అభిజిత్ పూర్వీకులు కూడా చార్మినార్ నిర్మాణం కోసం ఇక్కడికి వచ్చినవాళ్లే… తన తండ్రి కూడా బిల్డర్… అభిజిత్ కూడా బాగా చదువుకున్నాడు… అమెరికా రిటర్న్డ్… గుడ్…
అఖిల్ సార్థక్… కులం చెప్పుకోవడం కష్టం… కాకపోతే తను బేసిక్‌గా హైదరాబాదీ… (వంజరి కులం కావచ్చు బహుశా…) ఫీల్డులో తనను తాను ప్రూవ్ చేసుకున్నవాడే… అవినాష్ పక్కా తెలంగాణ… కరీంనగర్ జిల్లా… బీసీలు… బాగా కష్టపడి బతికే కుటుంబం… ఇక సొహెయిల్ సరేసరి… ప్యూర్ సింగరేణి ముద్దుబిడ్డ… మెహబూబ్ కాస్త తెలివిగా వ్యవహరించి ఉంటే సొహెయిల్ ప్లేసులో ఇక్కడిదాకా నిలబడేవాడు.,.
అరియానా అసలు పేరు అర్చన… తనూ హైదరాబాదీ, బాయ్ ఫ్రెండ్ వినీత్… హారిక కూడా ప్యూర్ తెలంగాణ, హైదరాబాదీ… దేత్తడి… మోనాల్ ఒకవేళ ఈసారి హౌజు నుంచి బయటపడితే తన గురించి చెప్పుకోవడం అనవసరం… తను గుజరాతీ… అందరికీ తెలుసు… లాస్యది కడప జిల్లా, రాయచోటి ప్రాంతం… కానీ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్… హౌజు నుంచి వెళ్లిపోయిన గంగవ్వ, సుజాత తదితరులూ నిఖార్సయిన తెలంగాణవాసులు… సో, గతంలోకన్నా ప్రాంతీయ సమీకరణాలు, బ్యాలెన్స్ గట్రా ఏమీ చూడలేదు బిగ్‌బాస్ టీం…
యూట్యూబ్, టీవీలు, సోషల్ మీడియాలో పాపులరైనవాళ్లు, హైదరాబాదీలను వెతుక్కున్నాడు… లాస్య వంటి ఒకరిద్దరు తప్ప మిగతావాళ్లు పెద్దగా పాపులర్ కాకపోవడంతో… ఈసారి బిగ్‌బాస్ సీజన్ ఇంట్రస్టింగుగా అనిపించడం లేదనేది నిజం… కానీ గుడ్… ఎంపిక భిన్నంగా సాగింది… కాకపోతే ఎటొచ్చీ ఈసారి గేమ్స్, టాస్కులు బాగా లేకపోవడంతో షో డౌన్ అయిపోయింది… అది బిగ్‌బాస్ టీం ఫెయిల్యూర్…
Share this Article