ఒక సెలెబ్రిటీకి సంబంధించిన ఏదేని ఇష్యూ వచ్చినప్పుడు సహజంగానే మీడియా దృష్టి, సొసైటీ దృష్టి పడుతుంది… ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్లిష్టం, బహిరంగ చర్చ అమర్యాదకరం అని బయటికి ఎన్ని నీతులు చెప్పుకున్నా సరే, జనం తమకు తోచింది తాము చెప్పుకుంటూనే ఉంటారు… చర్చ సాగుతూనే ఉంటుంది… అలాంటిది ఓ పాపులర్ హీరోయిన్, ఓ పాపులర్ హీరో, ఓ స్టూడియో అధినేత కమ్ పాపులర్ హీరో కొడుకు, మరో అప్ కమింగ్ హీరో బ్రదర్, మరో వెటరన్ హీరో బంధువు, మరో స్టూడియో అధినేత ప్లస్ మరో పాపులర్ హీరోల మేనల్లుడు, వాట్ నాట్… ఆ సెలబ్రిటీలకు సంబంధించిన పెళ్లి పెటాకులయితే చర్చ జరగకుండా ఎందుకుంటుంది..? వేల కోట్ల ఆస్తుల్ని, అంతటి పెద్ద ఫిలిమ్ సర్కిల్‌ను సమంత ఎడమకాలితో ఎందుకు తన్నుకుంది..? సగటు నటి కలలు గనే స్టేటస్ కదా, ఎందుకు వదిలేసుకుంది..? అది ఆసక్తికరమే కదా..! కొన్ని షాకింగ్ అనిపించేలా వినిపిస్తున్నయ్… నిజమో, కాదో ఆ కుటుంబానికే తెలియాలి… కానీ, అవి వింటుంటేనే ఓ సినిమా కథ విన్నట్టుగానే అనిపిస్తోంది…
ఆమె చుట్టూ ఓ పంచగ్రహ కూటమి చేరి, ఆమెను తప్పుదోవ పట్టిస్తోందని ఒక కారణం బలంగా వినిపిస్తోంది… వారిలో ఒక లేడీ డైరెక్టర్, ఓ బొటిక్ ఓనర్, ఓ గైనకాలజిస్ట్, ఓ హెయిర్ స్టయిలిస్ట్, ఓ ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారని ఫిలింనగర్ కోడై కొక్కొరొకో అంటోంది… అందులో డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ చాలారోజులుగా వార్తల్లో ఉన్నవాడే… తనతో ఉన్న కొన్ని పిక్స్ సమంత ఇన్‌స్టాలో కూడా షేర్ చేసుకుంది… మరో ఫోటో దొరికింది మనకు… ఇదుగో…
Ads
నటిగా ఉజ్వల భవిష్యత్తు ఉందనే భ్రమల్లోకి వెళ్లిపోయిన ఆమె చైతూతో బంధాన్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసింది… పిల్లలు పుడితే తన భావి అవకాశాలకు దెబ్బ అనే భావనతో రెండుసార్లు అబార్షన్ చేయించుకుందనే ప్రచారం సాగుతోంది… అది అక్కినేని కుటుంబానికి నచ్చలేదు… పైగా ఆమె విచ్చలవిడి పాత్రలు చేయడం కుటుంబ గౌరవానికి భంగకరం అనే భావన కూడా ఆ ఫ్యామిలీలో ఉంది… పైగా చైతూ ఇటు అక్కినేని, అటు దగ్గుబాటి కుటుంబాల వారధి… బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కుటుంబాలు కదా… ఆ అబార్షన్లు చేసిన గైనకలాజిస్ట్ కూడా ఆమె చుట్టూ చేరిన పంచగ్రహ కూటమిలో ఉందట…
పలుసార్లు నచ్చజెప్పినా, నాగార్జున స్వయంగా బుజ్జగించి ఎంత చెప్పడానికి ప్రయత్నించినా సమంత వినిపించుకోలేదు… ఇద్దరూ ముచువల్ కాన్సెంట్‌తో విడిపోవడం లేదనీ, 50 కోట్ల నగదు, 250 కోట్ల ప్రాపర్టీని సమంతకు ఇచ్చారనీ మరో ప్రచారం… కాదని సమంత వర్గాలు ఖండిస్తాయి సహజంగానే… రామానాయుడు చైతూకు అప్పట్లో జయభేరిలో కొని ఇచ్చిన అత్యంత విలువైన ఇంటిని సమంతకు ఇచ్చారనీ, ఆమె అందులోకి మారిపోయిందనీ, ముంబైలో 12 కోట్లు పెట్టి కొన్న తన సొంత ఫ్లాటులోకి దసరా తరువాత షిఫ్ట్ అయిపోతుందనీ అంటున్నారు… (ఈ భారీ పరిహారాలు, భరణాల భయంతో ధనిక అబ్బాయిలు రాను రాను కంట్రాక్టు తరహా పెళ్లిళ్ల వైపు ఏమైనా మొగ్గు చూపే అవకాశాలున్నాయా అనే విశ్లేషణలు ఇంకా స్టార్ట్ కాలేదు, నయం…)
లవ్ స్టోరీ సినిమా చేస్తున్నప్పుడు సాయిపల్లవితో సాన్నిహిత్యం పెరిగిందనీ, సమంత ధోరణితో విసిగిపోయిన చైతూ ఆమె పట్ల అనురాగాన్ని పెంచుకున్నాడనీ, చై-సామ్ నడుమ ఇది మరింత మంట రాజేసిందనీ మరో ప్రచారం… ఛట్, ఏ పెటాకులైనా సరే, బంధాలు తెగిపోవడానికి మగాడే కారణం, సకల అరిష్ఠాలకూ ఆమీర్ ఖానే బాధ్యుడు అంటుంది కంగనా రనౌత్… అసలు సమంతను ట్రోల్ చేస్తున్నారు గానీ చైతూ శుద్ధపూసా..? అని మండిపడతారు మరికొందరు… ఇలా ఎక్కడెక్కడికో వెళ్లిపోయాయి వార్తలు, రచ్చలు, చర్చలు… ఇవన్నీ వదిలేస్తే… ఈ పెటాకులకు అసలు కారణాలేమిటనేది బహుశా ఎప్పుడూ బయటికి రాకపోవచ్చు… చాలా సెలబ్రిటీ జంటలు విడిపోవడం లేదా..? మామూలు జంటల విడాకుల కేసులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి ఈమధ్య… వాళ్లు మళ్లీ పెళ్లిళ్లు చేసుకోవడం లేదా..? ఇదీ అంతే… ఎవరెవరో ఎందుకు..? ఆ అక్కినేని కుటుంబంలోనే బోలెడు ఉదాహరణలున్నయ్ కదా… ఈ లవ్వులు, ఈ బ్రేకప్పులు, ఈ పెళ్లిళ్లు, ఈ పెటాకులు సబ్ చల్తా..!! అవును గానీ… ఈ పెటాకుల కథలో ప్రీతమ్ జుకల్కర్ పాత్ర ఎంత..?! ఏమిటి..?!
Share this Article