అబ్బురం… పైపైన పరిశీలిస్తే పెద్ద గొప్పేముంది అనిపించవచ్చుగాక కొందరికి… కానీ నిజంగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన విశేషమే… మనవాడే… గుంటూరుకు చెందిన గంగోలు రాజు… మిమిక్రీలో దిట్ట… వరుసగా ఆపకుండా ఓ వంద గొంతుల్ని అలవోకగా ఇమిటేట్ చేయగలవా అనడిగితే, ఓసోస్ అదెంత పని చేసేస్తాడు… తన మీద యూట్యూబ్‌లో చాలామంది వీడియోలు చేశారు… ప్రతిభ కలిగిన ఆర్టిస్టు… అందులో డౌట్ లేదు… అయితే తాజా విశేషం ఏమిటంటే..? ఒక్కడే ఓ సినిమాలో 25 పాత్రలకు డబ్బింగ్ చెప్పేశాడు… అందులో ఒకటి స్త్రీ పాత్ర… ఎలాగూ మిమిక్రీ ఆర్టిస్టు కదా, అందులో గొప్పేముంది అని తేలికగా తీసేయకండి… ముందుగా ఆ వీడియో చూడండి…
రకరకాల పాత్రలకు ఒక్కడే డబ్బింగ్ చెప్పడం అనేది గొప్పకాదు… ఆయా యాక్టర్లది ఒక్కొక్కరిది ఒక్కో బాడీ లాంగ్వేజీ, పైగా ఒక్కో సీన్లో ఆ సందర్భాన్ని బట్టి, ఉద్వేగాన్ని బట్టి వాళ్ల గొంతుల్లో ఫీల్ మారుతూ ఉంటుంది.., ఆ పాత్ర ధోరణిని ఆవాహన చేసుకుని, ఆ ఫీల్ ఏమాత్రం పోకుండా లైవ్లీగా డబ్బింగ్ చెప్పడం అనేది ప్రశంసనీయం… నిజంగా ఒక సినిమాను డబ్ చేయాలంటే ఇదుగో ఇలాంటి ఆర్టిస్ట్ ఒక్కరు చాలేమో ఇక… వేరే వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల అవసరం లేకుండా ఎంచక్కా ఒక్కడితో బండి నడిపించేయవచ్చు… ఖర్చు తక్కువ… (అఫ్ కోర్స్, వైవిధ్యం కావాలంటే భిన్నమైన గొంతులు కావాలి… కానీ ఇదొక ఫీట్… అందరికీ సాధ్యం కాదు…)
రాజు తన ఫేస్బుక్ వాల్‌పై షేర్ చేసుకున్నది ఏమిటంటే..?
Ads
నేను తమిళ్ to తెలుగు “ఒకే సినిమాలో” 25 పాత్రలకి డబ్బింగ్ చెప్పిన వీడియో క్లిపింగ్స్ ని చూసి ఆశీర్వదిస్తారని భావిస్తూ . ఇలాంటివి ఇంకో రెండు సినిమాలు ఉన్నయ్యి. అవి ఈ మూవీ కన్నా పెద్ద సినిమాలు . డైరెక్ట్ తెలుగు సినిమాలు. త్వరలో హాల్ లోనే చూడబోతున్నారు.ఒకటి rgv మూవీ . మరొకటి గాడ్ సే మూవీ త్వరలో. నన్ను నమ్మి నాకు అవకాశం కల్పించిన వారికీ , నేను ఇలా చేయడానికి నాకు ఎన్నో మెళకువలు నేర్పిన Mimicry Janardhan అన్నయ్యకి ధన్యవాదములు
ఇది కదా జాక్ పాట్ అంటే… ఒక పాత్రకి మరో పాత్రకి వాయిస్ మ్యాచ్ కాకుండా చెప్పడం కష్టమే… కానీ నా జీవితమే మిమిక్రీ అయినప్పుడు కష్టం కూడ ఇష్టంగా ఉంటుంది.
ముచ్చటతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే..?
‘‘మాది గుంటూరు జిల్లాలోచిన్న పల్లెటూరు… 2004 లో హైదారాబాద్ వచ్చాను… ఉస్మానియా యూనివర్సిటిలోని త్రివేణి హాస్టల్ ఔటర్ గా స్నేహితులతో కలిసి కొన్నాళ్ళు ఉన్నాను… చొక్కాపు వెంకట రమణ అనే మేజిషియన్ దగ్గర అసిస్టెంట్ మెజిషియన్‌గా ఉన్నాను… నా గురించి తెలిసి ఆయన తన అసిస్టెంట్‌గా కాకుండా కో-ఆర్టిస్ట్ గా ఉండాలని చెప్పారు… తనకు వచ్చే ఈవెంట్లకి తీసుకెళ్ళి, డబ్బులు ఇప్పించేవారు… అక్కడే పరిచయం అయిన కాసర్ల శ్యామ్ టీవీ5లో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా ఉద్యోగ అవకాశం ఇప్పించారు… అపరిచితుడు సుపరిచితుడు అనే కార్టూన్ కార్యక్రమానికి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా పని చేశాను… కామెడీ కితకితలు పేరుతో తెలుగులో విడుదలయిన డబ్బింగ్ సినిమాలో 28 పాత్రలు ఉండగా 25 పాత్రలకు ఒక్కడినే డబ్బింగ్ చెప్పాను… గాడ్సే జీవిత కథ ఆధారంగా వస్తున గాడ్సే సినిమాలో 20 పాత్రలకు డబ్బింగ్ చెప్పాను… అది థియేటర్లలో విడుదల కానుంది’’…. ఇలాంటి ఫీట్లు మరికొన్ని… ఇంకొన్ని… కుమ్మేసెయ్ రాజూ… ఆల్ ది బెస్ట్…
Share this Article