బాలీవుడ్….. అదొక మెరుపుల కార్ఖానా… బోలెడు మంది వస్తుంటారు, పోతుంటారు… వెలిగిపోతుంటారు, మాడిపోతుంటారు… అదొక ప్రపంచం… స్థూలంగా చూస్తే అది అథోప్రపంచం… మాఫియా ప్రభావం, బంధుప్రీతి, అనేక వివక్షలు, శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీ ఎట్సెట్రా అన్నీ… లైంగిక దోపిడీ సరేసరి… ఇక్కడ నెగ్గుకురావడం అంత వీజీ కాదు… మహేష్ భట్ అనబడే ఒకానొక అవలక్షణమూర్తి బిడ్డ అలియా భట్…
ఇరవయ్యేళ్ల క్రితం బాలనటి… తరువాత 18, 19 ఏళ ప్రాయం నుంచే సినిమాలు… వేరే లోకం ఏమీలేదు… షూటింగ్ స్పాట్లు, స్టార్ట్, యాక్షన్, కట్ అరుపులు… మేకప్పులు… ఫోటోషూట్లు… అదే ఆమె జీవితం… నో, నో, ఆమె మీద జాలిపడాల్సింది ఏమీ లేదు… ఆ బాలీవుడ్ బురదలో పుట్టిన కమలం… ఎంట్రీ వరకూ డాడీ పేరు… తరువాత తనే నిలబడింది… ఈరోజు మహేష్ భట్ జస్ట్, అలియా భట్ తండ్రి… దటీజ్ అలియా…
Ads
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా..? బయటికి చూస్తే దీపిక పడుకోన్, ప్రియాంకచోప్రా ఎట్సెట్రాలు కాదు… బాలీవుడ్ ఏ ప్రిస్టేజియస్ ప్రాజెక్టు తీసుకున్నా సరే… ఫస్ట్ చాయిస్ అలియా… ఆమె కాదంటేనే, డేట్స్ లేవంటేనే మరొకరికి వెళ్తుంది ప్రాజెక్టు… అతిశయోక్తి కాదు… అంత పేరు సంపాదించుకుంది…
ఈమధ్య ఎవరో దారినబోయే దానయ్య ఏడ్చాడట… ఆమెకు రోజుకు లక్ష రూపాయలు ఖర్చవుతోంది అని… హీరోలు అయితే అంతకు పదిరెట్లు పెడతారు పడీ పడీ కాళ్లు మొక్కుతూ… కానీ అలియా అనేసరికి చీప్ అనుకున్నాడేమో ఫాఫం… ఆమె పేరుతో సినిమాకు వచ్చే కమర్షియల్ వాల్యూ ముందు ఈ ఖర్చులన్నీ బలాదూర్… ఆమె ప్రస్తుతం బాలీవుడ్ మహారాణి…
ఎస్, ఆమె బయటి షూటింగుల కోసం ఎటువెళ్లినా సరే, పర్సనల్ మేకప్ ఆర్టిస్టు, హెయిర్ స్టయిలిస్టు, ముగ్గురో నలుగురో బౌన్సర్లు, పీఏ, సెక్రెటరీ… దాదాపు పది మందిని నిర్మాత పోషించాల్సిందే… ఐనాసరే, నిర్మాత భరిస్తున్నాడు… భరించాలి… అదీ ఆమెకున్న డిమాండ్…
ఇవన్నీ తెలియదా ఆమెను బుక్ చేసుకుంటున్నప్పుడు..? ఇప్పుడు ఆమె ఆర్ఆర్ఆర్ సినిమాలో చేస్తోంది… ఆమె షూటింగుకు వస్తోంది అంటేనే ఓ వార్త… ఇరగబడి రాసేసుకున్నారు అందరూ… కమర్షియల్ యాడ్స్‌లో ఆమెదే అత్యధిక బ్రాండ్ వాల్యూ…
తాజా విషయం ఏమిటంటే…? ఆమె చేతిలో ఇప్పటికే ఆర్ఆర్ఆర్… బ్రహ్మాస్త్ర… గంగూబాయి… సినిమాలు ఉన్నాయి కదా… ఇప్పుడు మరో ప్రిస్టేజియస్ ప్రాజెక్టు చేజిక్కింది ఆమెకు… పేరు పిహార్వా… అప్పుడెప్పుడో 1967లో జరిగిన చైనా-ఇండియా యుద్ధం నేపథ్యంలో… బాబా హర్భజన్ సింగ్ అనే వీరజవాను గురించిన కథ… దానికి ప్రజెంట్ ఇండో-చైనా ఉద్రిక్తతనూ కలిపి, ఓ లవ్ స్టోరీ యాడ్ చేసి తీయబోతున్నారు… అందులో అలియా లీడ్ రోల్…
డాన్స్, హైట్, పర్సనాలిటీ గట్రా జాన్తానై… అలియా ఒక బ్రాండ్ ఇప్పుడు… ఆమె సినిమాలో ఉంటే కమర్షియల్స్ అన్నీ వర్కవుట్ అయిపోతాయి… సినిమా మంచి రేట్లకు అమ్ముడుబోతుంది… దటీజ్ అలియా… ఆమె ఆ భట్ కుమార్తె కావచ్చు, కంగనా వంటి దిష్టిచూపులకు ఆ భటుడు ఈమధ్య కలవరపడిపోతుండవచ్చు… అలియా తళుకును వీసమెత్తు ప్రభావితం చేయలేకపోయింది… ఎస్, ఈ మెరుపు కొన్నాళ్లే కావచ్చు… కానీ ఆ కొన్నాళ్లే ఎంత బాగా మెరిసిందీ అనేదే ప్రధానం… ప్రస్తుతానికి అలియా… మిరుమిట్లు గొలిపే మెరుపు…!
Share this Article