కొన్ని వార్తలు మనదాకా రావు… రానివ్వరు… మెయిన్ స్ట్రీమ్ మీడియా జ్ఞానులు తమ సెక్యులర్ పాతివ్రత్యం ఎక్కడ మంటగలిసిపోతుందో అని భయపడి, కొంగులు తలపైకి కప్పుకుంటారు… అప్పుడెప్పుడో కాశ్మీర్లో హిందువులను ఊచకోత కోసి, బయటకు తరిమేసిన సంగతే చెప్పడానికి ఇబ్బందిపడతారు… ప్రపంచమంతా తెలుసు, ముష్కరులే గొప్పగా చెప్పుకుంటారు, కానీ ఒక్క మీడియా సంస్థకు కూడా దాన్ని ప్రస్తావించే దమ్ము ఉండదు… అక్కడిదాకా దేనికి..? ఉత్తరప్రదేశ్‌లో యాదవ-ముస్లిం మాఫియా గ్యాంగులు సాగించిన అరాచకం దేశప్రజలకు తెలిసింది ఎక్కడ..?
టీఆర్ఎస్ పార్టీ అట, ఎస్పీ ప్రభంజనం కనిపిస్తోందట, యూపీ వెళ్లి ప్రచారం చేస్తారట… అక్కడ యాదవులేదో వీళ్ల కోసమే ఎదురు చూస్తున్నట్టు..?! మళ్లీ యోగి గనుక గెలవకపోతే, ఇప్పుడు జైళ్లలో ఉన్న వేల మంది రౌడీ, మాఫియా రాక్షసగణం మళ్లీ జనావాసాల మీద పడి, ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి రెడీగా ఉన్నారు… ఓహో, అలాంటి రాజ్యం మళ్లీ రావాలని కోరుకుంటున్నారా..? అబ్బే, అదంతా అవాస్తవం అనే అంధులు కూడా ఉంటారు…
నిజానికి కేసీయార్ థర్డ్ ఫ్రంట్ అనే ప్రయత్నాలే ఓ తెర వెనుక యవ్వారం… బీజేపీ, టీఆర్ఎస్ చేసేది గాలిలో ఉత్తుత్తి కత్తుల కోలాటం… ఇక్కడే ఈ వీరగెంతులు… ఢిల్లీ వెళ్తే ఏమీ ఉండదు… అంతెందుకు అగ్గి, గత్తర భాష మొన్న కేసీయార్ ఢిల్లీకి పోయినప్పుడు ఏమైంది..? 700 మంది రైతుకుటుంబాలకు సాయం అన్నాడు… ఏమైంది..? ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా వాపస్ వచ్చేశాడు… అదే రైతునాయకుడు హైదరాబాద్ వచ్చి ఏమన్నాడు..? రెండు పార్టీల సెకండ్ కేడర్ లీడర్లు మాత్రం గొంతులు చింపుకుంటారు… సోషల్ పోస్టులతో చెలరేగుతుంటారు… తెర వెనుక రచించబడే పెద్ద పెద్ద రాజకీయ ప్రణాళికలు అర్థం చేసుకోరు… ఇదే ఎస్పీ, ఆర్ఎల్డీ, డీఎంకే వంటి కాంగ్రెస్ స్నేహ పార్టీలు టీఆర్ఎస్ను లైట్ తీసుకుంటాయి, కేసీయార్‌ను నమ్మబోరు అనే విశ్లేషణలు వాళ్లకు పట్టవు…
Ads
ఎస్పీ, ఎస్పీ అని ప్రేమించేవాళ్లు ఒక విషయాన్ని చదువుకోవాలి… కైరానా… మొన్న అమిత్ షా అక్కడ డోర్-టు-డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు… సో వాట్, చేసి ఉండవచ్చు అని తేలికగా తీసుకోకండి… అక్కడే ప్రచారం స్టార్ట్ చేయడం వెనుక ఓ కథ ఉంది… ఇదేమీ వాట్సప్ యూనివర్శిటీ సృష్టించిన చెత్త అవాస్తవ కథనం కాదు… నెట్లోనే దొరుకుతయ్ బోలెడు వార్తలు… అంతెందుకు, జాతీయ మానవ హక్కుల కమిషన్ దాకా వెళ్లింది… సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే… ఎస్పీ పార్టీ నమ్మిన సోషల్ ఫ్యాబ్రిక్, మాఫియా ఫ్యాబ్రిక్ సమాజం ఎలా ఉంటుందంటే…
ఉత్తరప్రదేశ్…, కైరానా పట్టణాన్ని మినీ పాకిస్థాన్ అని పిలుస్తారు. ఆయుధాల స్మగ్లింగ్, దొంగ నోట్ల ముద్రణ, డ్రగ్స్ రవాణా సర్వసాధారణం. ఈ పట్టణంలో మాఫియా ముఠాల టార్గెట్ హిందువులు. హిందువుల ఆస్తులను స్వాధీనం చేసుకుని, వారిని ఆ ప్రాంతం నుండి తరిమివేయడమే. ముఖ్యంగా పాకిస్థాన్ తో సంబంధం ఉన్న “ముఖిం కాలా గ్యాంగ్” ఇక్కడి హిందువులపై చేసిన నేరాలు, ఘొరాలు అన్నీ-ఇన్నీ కావు. ఏకే-47 ధరించిన ముఠాలు బజార్లలో స్వేచ్ఛగా తిరిగేవి…
2010 లో కైరానాలో 52% హిందువుల జనాభా, 48% ముస్లింల జనాభా ఉండగా… ముఖిం కాలా గ్యాంగ్ దూరాగతాలతో 2011 నాటికి హిందువుల జనాభా 32% కి పడిపోగా, ముస్లింల జనాభా 68% కి చేరుకుంది. (2016 నాటికి ముస్లింల జనాభా ఏకంగా 92% చేరుకోగా, హిందువుల జనాభా దారుణంగా 8% కి పడిపొయిందనే వార్తలు కొన్నిచోట్ల కనిపించాయి గానీ నిర్ధారణ లేదు…) కైరానా పట్టణంలో ప్రధానంగా హిందువులు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ బతికేవారు.
ముఖిం కాాలా గ్యాంగ్ హిందూ వ్యాపారస్తులను టార్గెట్ చేస్తూ బహిరంగంగా హత్యలు చేయడం మొదలు పెట్టారు. ఒక్కొక్క వ్యాపారిని 15,00,000 రూపాయలు డిమాండ్ చేసేవారు. అంత మొత్తం యిచ్చుకొలేని వ్యాపారస్తుల షాపులను ముఖిల్ గ్యాంగ్ స్వాధీనం చేసుకుని, ముస్లింలకు అప్పగించేవారు. ఇళ్లల్లోకి జొరబడి చేసే అరాచకాలు, అత్యాచారాలు సరేసరి… అఖిలేష్ ప్రభుత్వ హయాం ఆ గ్యాంగుకు స్వర్ణయుగం… దీంతో హిందువులు పెద్ద ఎత్తున అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వలసపోయారు… వందల కుటుంబాలు…
ఈ విషయాన్ని 2016 లో బిజెపి MP హుకుం సింఘ్ వెలుగులోకి తెచ్చాడు. అప్పుడే కాస్తో కూస్తో జాతీయ మీడియా దీనిపై దృష్టి పెట్టింది… కేంద్రం నుంచి ఒత్తిడి పెరిగినా అఖిలేష్ ప్రభుత్వం లైట్ తీసుకుంది… పైగా రాష్ట్రాల హక్కుల్లో జోక్యం అంటూ రాద్ధాంతం స్టార్ట్ చేసింది… అచ్చం, ఇప్పుడు మమత బెనర్జీ ప్రభుత్వం చేస్తున్నట్టే… (మొన్నటి ఎన్నికల అనంతరం టీఎంసీ గుండాల దాడులతో వందల మంది బీజేపీ మద్దతుదారులు అస్సాం పారిపోయారు… మళ్లీ రాలేదు… బీజేపీ దాకా దేనికి..? లెఫ్ట్ వాళ్లను అడిగినా చెబుతారు, మమత కథలేమిటో… మమత ప్రభుత్వం జోలికి గానీ, ఇప్పుడు పంజాబ్‌ను మళ్లీ ఖలిస్థానీ కేంద్రంగా చేస్తున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం జోలికి గానీ వెళ్లే సాహసం మోడీ ప్రభుత్వానికి లేదు… పోలేదు… అంత దమ్ములేదని బీజేపీ శ్రేణులే విమర్శిస్తూ ఉంటయ్… మోడీది ప్రచారార్భాటమే తప్ప తనకు ప్రజానుకూల పాలన, రాజధర్మం చేతకాదనే సీరియస్ విమర్శ కూడా ఉంది…)
2017 లో యోగి ప్రభుత్వం రావడంతో కైరానా కథ మారడం మొదలైంది… ముఖిం గ్యాంగ్‌తో సహా మొత్తం 109 మంది హంతకులను గుర్తించి, వేటాడటం మొదలు పెట్టారు. ముందుగా పొలీసులు ముఖిం గ్యాంగులో ప్రధాన సభ్యుడైన షబీర్ అహమ్మద్ ను వేటాడి కాల్చి చంపారు… (ఇది ఉత్తరప్రదేశ్ పొలీసుల చరిత్రలో అతి పెద్ద విజయం)… తరువాత ముఖిం సొదరుడు వాసింతో సహా ఈ ముఠాలోని కీలక సభ్యుల్లో దొరికినవాడిని దొరికినట్టు Encounter చేయడం మొదలు పెట్టారు. దీనితో బెదిరిపొయిన ముఖిం, ఎన్కౌంటర్ చేస్తారనే భయంతో బహిరంగంగా పొలీసులకు లొంగిపొయాడు. ఒక్క ముఖిం మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో మొత్తం 70 క్రిమినల్స్, హంతకులు పొలీసులకు లొంగిపోగా, మిగిలినవారు ఉత్తరప్రదేశ్ నుండి పారిపోయారు. ఈ గ్యాంగులకు మద్దతునిచ్చే కైరానా MLA నహిద్ హసన్ పై కూడా గూండా యాక్ట్ కింద కేసు పెట్టి విచారణ జరుపుతున్నారు…
అలాంటి నహీద్ హసన్‌కు ఎస్పీ మళ్లీ టికెట్టు ఇవ్వజూపింది… అఖిలేష్‌కు ఆత్మీయుడు కదా మరి… తనకు కావల్సింది అజంఖాన్, నహీద్ లాంటోళ్లే కదా… దీంతో యోగి ప్రభుత్వం మళ్లీ నట్లు బిగించడం మొదలుపెట్టింది… ఏదో కేసులో మళ్లీ లోపలకు పంపించేసింది… దీంతో నహీద్ సోదరి ఇక్రా హసన్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగింది… తనే నామినేషన్ వేసింది… అంతా వాళ్లిష్టమే… ఆమె లండన్‌లో చదువుకుంది… CAA వ్యతిరేక ఆందోళనలు చేసింది… ఇప్పుడు మళ్లీ నహీద్ రాజ్యాన్ని, ముఖిం స్వర్ణయుగాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది… మొన్నటిదాకా పరిస్థితులు కాస్త మెరుగుపడటంతో ఆస్తుల్ని, ఇళ్లను వదిలేసి, బతుకుజీవుడా అని గతంలో పారిపోయిన వ్యాపారులు మళ్లీ వచ్చారు… ఇలాంటి వాతావరణం ఆ చుట్టుపక్కల కూడా ఉండేది…
ఈ ఎన్నికల్లో గనుక అఖిలేష్ గెలిచి, గద్దెనెక్కితే అప్పుడు పరిస్థితి ఏమిటి..? రాష్ట్రవ్యాప్తంగా జైళ్లు బార్లా తెరుచుకుంటయ్… ఏళ్ల తరబడీ ఉత్తరప్రదేశ్‌ను ఓ మాఫియా రాజ్యంగా మార్చిన దుష్టశక్తులు కోరలు సవరించుకుంటూ ఇక జనంపై పడుతయ్… వేలమంది జైళ్లలో చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని ఉన్నారు… గత ఐదేళ్ల మాఫియా వ్యతిరేక పోరాటంలో చాలామంది పోలీసులు గాయపడ్డారు, ప్రాణాలు కోల్పోయారు… తెగించి రౌడీ మూకలతో ముఖాముఖి కూడా పోరాడారు… వాళ్ల నైతిక స్థైర్యం ఏమైపోవాలి..? నిష్ఠురంగా ఉన్నా సరే, కళ్ల ముందు భయపెట్టే పరిస్థితి అదే..!!
Share this Article