బెంగాల్… 90 ఏళ్ల సంధ్యా ముఖర్జీ అనే గాయని కేంద్రం ఇవ్వదలిచిన పద్మశ్రీని తిరస్కరించింది… అదేమంటే..? అసలు నా స్టేచర్ ఏంటి..? ఓ జూనియర్ ఆర్టిస్ట్‌కు ఇచ్చినట్టుగా పద్మశ్రీ ఇస్తారా, వద్దుపో అనేసింది… ఇచ్చింది తీసుకోవచ్చు కదా అనేవాళ్లుంటారు… ఆమె కడుపులో బాధ అది, వ్యక్తీకరించనివ్వండి, తప్పేముంది అనేవాళ్లు కూడా ఉంటారు… సేమ్, బెంగాలీయే… తబలా వాయిద్యకారుడు అనింద్యా చటర్జీ కూడా దాదాపు అవే కారణాలతో రెఫ్యూజ్ చేశాడు… అలాగే మాజీ సీఎం బుద్దదేవ భట్టాచార్య కూడా తిరస్కరించాడు… దానికి కారణం సీపీఎం ప్రభుత్వం (రాజ్యం) ఇచ్చే ఈ పౌరపురస్కారాలను పరిగణనలోకి తీసుకోదు… తమ వర్క్ ప్రజల కోసమే తప్ప, ఈ పురస్కారాల కోసం కాదు అంటారు… సరే, అదొక పాలసీ… తప్పొప్పుల విశ్లేషణ అక్కర్లేదు…
గతంలో నంబూద్రిపాద్ ఇలాగే రెఫ్యూజ్ చేశాడు… ఏపీ ప్రభుత్వం ఇవ్వజూపిన ఏదో అవార్డును తెలకపల్లి రవి కూడా తిరస్కరించాడు… ఇక్కడ రెండు అంశాలు… వాళ్లు సైద్ధాంతికంగా ఎంత విభేదించినా సరే… 1) వాళ్లు ఆరాధించే చైనాలో కూడా పౌరపురస్కారాలున్నయ్… 2) పద్మ అవార్డు మోడీ జేబు నుంచో, అమిత్ షా పార్టీ నుంచో ఇచ్చేది కాదు… అది ఈ సర్వసత్తాక గణతంత్ర దేశం తన పౌరుడికి అభినందనగా ఇచ్చే పురస్కారం… దాన్ని గౌరవించాలి… వినమ్రంగా… 3) అవార్డుల ప్రకటనల్లో రాజకీయ సమీకరణలు, రాగద్వేషాలు ఉండవచ్చుగాక, కానీ తిరస్కరించడం దేనికి..?
ఉదాహరణకు… బుద్ధదేవ్ భట్టాచార్య తన జీవితం మొత్తం కమ్యూనిస్టే… బీజేపీ వ్యతిరేకియే, ఇప్పుడు గులాం నబీ ఆజాద్ పట్ల బీజేపికి సానుకూలత ఉండి, కాంగ్రెస్ నాయకుడైనా అవార్డు ప్రకటించవచ్చుగాక… కానీ బుద్ధదేవ్‌కు ఆ కోణంలోనూ ఇవ్వాల్సిన పనిలేదు కదా… తను ఆజాద్ ఈక్వేషన్లో ఫిట్ కాడు కదా… నిజానికి సీపీఎం ముఖ్యనేతలు ఈ అవార్డులను తీసుకోరు అని తెలిసీ హోమ్ మినిస్ట్రీ బుద్ధదేవ్ పేరును ఆ జాబితాలో ఎలా చేర్చారు అనేదే విస్మయకరం… రాజకీయాలకు అతీతంగా ఆలోచించి, ఒకవేళ ఓ వెటరన్ సీపీఎం నాయకుడికి ఇవ్వాలీ అనుకుంటే కమ్యూనిస్టు పార్టీల్లో కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్ పేరు ఈ జాబితాలో చేరిస్తే బాగుండేది… తను కేరళ మాజీ ముఖ్యమంత్రి…
Ads
మాకు ముందుగా చెప్పలేదు అని బుద్ధదేవ్ చెప్పడం గురించీ చెప్పుకుందాం… ముందుగా చెప్పాలా..? అనుమతి తీసుకోవాలా..? రాజ్యం పురస్కారం ఇవ్వాలని అనుకుంటుంది, తీసుకోవాలా వద్దా అనేది ఆ వ్యక్తి ఇష్టం… నిర్బంధంగా మెడలు వంచి, మెడల్ మెడలో వేయరు కదా… కేంద్రం రాజ్యసభలో ఈ విషయంపై ఓసారి 2015లో క్లారిటీ ఇస్తూ ‘‘సాధ్యమైనంతవరకూ సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తోంది’’ అని చెప్పింది… హోం శాఖ అధికారి ఫోన్ చేసినప్పుడు భట్టాచార్య భార్య మాట్లాడింది, విషయం చెప్పాక తన భర్తకు చెబుతానంది…
తిరస్కరణ ఆయన ఇష్టం… కానీ ఇందులో ఏదో ఓ ప్రొసీజరల్ ల్యాప్స్ ఉందనే సంకేతాలు ఇవ్వడం ఏమాత్రం సమంజసంగా లేదు… మా పార్టీ, నా వ్యక్తిగత అయిష్టతను బట్టి నేను తిరస్కరిస్తున్నాను అని చెప్పి ఉంటే చాలా హుందాగా ఉండేది… లేదా ఈ కాషాయ ప్రభుత్వం నుంచి పురస్కారం తీసుకోవడం ఇష్టం లేదు అని చెప్పినా అదొక పద్ధతిలో, పొలిటికల్ యాంగిల్లో ఉండేది… అటూఇటూ గాకుండా ఏదో ప్రొసీజరల్ ల్యాప్స్ కాబట్టి తిరస్కరిస్తున్నాను అని చెప్పినట్టుగా జనంలోకి సంకేతాలు వెళ్లాయి… హేమిటో ఇదంతా… అవునూ, మన సీపీఐ నారాయణకు ఏదైనా పద్మాన్ని ఆఫర్ చేసి ఉంటే, తను ఏం చేసి ఉండేవాడు..?! ఇవన్నీ సరే… సీపీఎం సానుభూతిపరులు ఎవరూ ఇన్నేళ్లలో ఏ పద్మ పురస్కారాన్ని అంగీకరించలేదా..?
Share this Article