జబర్దస్త్ షో ప్రోమో ఒకటి హల్‌చల్ చేస్తోంది… అందులో రోజా ఓ జడ్జెస్ ట్రెయినింగ్ సెంటర్ ఓపెన్ చేసి, ఆమనికి, లైలాకు కోచింగ్ ఇస్తుంది… చిట్కాలు చెబుతుంది… ఇంకేముంది..? ఒకటే చర్చ… ఇంకేముంది..? రోజా మంత్రి కాబోతోంది… సో, జడ్జిగా చేయడం కష్టం, అందుకని కొత్త జడ్జిలను తీసుకొస్తున్నారు… ఇదే ఇండికేషన్, అయితే ఆమని లేదా లైలా ఫిక్స్ అంటూ కథలు అర్జెంటుగా అల్లేశారు… నిజమేనా..?
నిజానికి అది ఆ షోలో చిన్న స్కిట్… లైలా ఓ గెస్ట్ జడ్జి… ఈమధ్య అప్పుడప్పుడూ ఆమని జడ్జిగా వస్తోంది… చిన్న చిన్న స్కిట్స్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తోంది… అసలు రోజాకు మంత్రి పదవి దక్కుతుందా..? అదీ అసలు ప్రశ్న… ఎన్నాళ్లుగానో ఆమె మంత్రి కావాలని కోరుకుంటోంది… ఆ ఆశ ఉండటం సహజమే… కానీ జగన్ కరుణించడం లేదు, పైగా తన నియోజకవర్గంలోనే తన అసమ్మతి నేతలకు మంచి పదవులు కూడా ఇస్తున్నాడు… ఈ స్థితిలో జగన్ రోజాకు మంత్రి పదవి ఇస్తాడా..? అదీ పే-ద్ద డౌట్…
పర్ సపోజ్, రోజా వెళ్లిపోతోంది అనుకుందాం… ఈమధ్య రెగ్యులర్ జడ్జిగా కనిపించిన మనో ఏవో కారణాలతో రావడం లేదు… తను ఆ కుర్చీలో బాగానే ఫిక్సయ్యాడు ఇన్నిరోజులూ… ఒకవేళ రోజాకు బదులుగా కొత్త జడ్జిలు కావాలంటే మల్లెమాల కంపెనీ ఏం చేస్తుంది..? రోజా చెప్పినవాళ్లను తెచ్చి కూర్చోబెట్టరు… ఆ షో రోజా సొంతమేమీ కాదు… పైగా మల్లెమాల లెక్కలు వేరే ఉంటయ్… వాటి ప్రకారమే నిర్ణయాలుంటయ్…
Ads
ఒకవైపు షో రేటింగ్స్ దారుణంగా పడిపోతున్నయ్, నాణ్యత లేదు, కొత్త కమెడియన్లు కుదురుకోవడం లేదు… స్పెషల్ టీం అని స్కిట్స్ చేస్తున్నా క్లిక్ కావడం లేదు… ఈ స్థితిలో ప్రయోగాలు చేయడం కష్టం… రష్మి, అనసూయ యాంకర్లుగా వోకే గానీ, జడ్జిలుగా కష్టం… పైగా రష్మితో మల్లెమాలకు ఇప్పుడు పెద్ద సత్సంబంధాలు కూడా ఏమీ లేవు… ఢీ నుంచి అందుకే తప్పించారు… ఆమధ్య సంగీత తదితరులు వచ్చారు, పోయారు, కుదురుకోలేదు…
ఆమని పర్లేదు గానీ, ఎందుకో రోజాకు అల్టర్నేట్‌గా అనిపించడం లేదు… అబ్బే, జడ్జిగా చేయడం ఏమంత పెద్ద కష్టం..? పకపకా నవ్వడమే కదా అనుకోలేం… అందరూ సెట్ కాలేరు… లైలాకు తెలుగు తెలియదు… ప్లజెంట్‌గా నవ్వగలదు, బాగుంటుంది… కానీ స్కిట్స్‌ను ఏమేరకు అర్థం చేసుకోగలదు అనేదే ప్రశ్న… ఇక అందుబాటులో ఉన్నది నందిత శ్వేత, ఇంద్రజ, ప్రియమణి… వీళ్లలో నందిత, ప్రియమణి ఢీ షోలో చేస్తున్నారు… ప్రియమణికి ఎన్నాళ్లుగానో మల్లెమాలతో టరమ్స్ బాగున్నయ్…
ప్రియమణి స్కిట్స్ సరిగ్గా ఫాలో కాగలదు, ఇన్వాల్వ్ కాగలదు, జడ్జిగా సూటవుతుంది… కానీ ఆల్‌రెడీ ఢీలో చేస్తోంది, జబర్దస్త్ రెండు షోలకు ఫుల్ టైమ్ కేటాయించగలదానేది క్వశ్చన్… సినిమాల్లో చాన్సులు కూడా వస్తున్నయ్ ఈమధ్య… నందిత నవ్వు కూడా బాగుంటుంది… తను కూడా సూట్ అవుతుంది… కానీ ఇంద్రజ రీజనబుల్లీ ఆ జడ్జి పాత్రకు ఆప్ట్… తను ఆల్‌రెడీ శ్రీదేవి డ్రామా కంపెనీకి చేస్తోంది… నవ్వు, అప్రోచ్ బాగుంటయ్… టైమ్లీ రెస్పాన్స్, రియాక్షన్ బాగుంటయ్…
మల్లెమాలతో కంట్రాక్టు అంత వీజీ ఏమీ కాదు, ఆ క్రియేటివ్ టీం డైరెక్టర్లు, సీనియర్ కమెడియన్ల రాజకీయాలు ఉండనే ఉంటయ్… మనో గనుక మళ్లీ రాకపోతే, ఇద్దరు జడ్జిలకు స్కోప్ ఉంది కాబట్టి ఇంద్రజ, నందిత సరిపోతారు… ఐనా మల్లెమాల కంపెనీ లెక్కలు వేరే ఉంటాయి కదా, వేచిచూడాలి… ఐనా రోజా వెళ్లిపోతే కదా…!!
Share this Article