అంబులెన్స్ మాఫియా… ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం… రుయా హాస్పిటల్లో మరణించిన బాలుడిని స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్స్ మాఫియా అడిగినంత చెల్లించలేక, బైక్పై 90 కిలోమీటర్లు ప్రయాణించిన ఉదంతం సంచలనాన్ని రేకెత్తించింది… కుర్చీలో జగన్ ఉన్నా సరే, ఇంకెవరు ఉన్నా సరే… ప్రభుత్వ ఆసుపత్రులది ఒకరకం దోపిడీ… ప్రైవేటు ఆసుపత్రులది లెక్కాపత్రం లేని దోపిడీ… ఎవరూ ఆపలేరు…
అసలు కరోనా సంక్షోభంలో ఫార్మా, హాస్పిటల్స్ సాగించిన దోపిడీ అంతాఇంతా కాదు… సరే, ఇప్పుడు అంబులెన్స్ మాఫియాకు వద్దాం… ప్రభుత్వమే ఒకవైపు ఇది నిజమే, మేం సీరియస్గా ఉన్నాం అంటోంది… ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీవో, డీఎంహెచ్వో, డీఎస్పీతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది… రుయా ఆస్పత్రి వద్ద విచారణ జరిపిన ఈ బృందం… రుయా వద్ద అంబులెన్స్ మాఫియా అరాచకం నిజమేనని తేల్చింది. బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆస్పత్రి సీఎస్ఆర్ఎంవో సరస్వతీ దేవిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి.. సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసు ఇచ్చారు…
ఒకవైపు ప్రభుత్వం ధోరణి ఇలా ఉంటే… దీన్ని పూర్తిగా డైవర్ట్ చేయడానికా అన్నట్టుగా… అసలు ఈ దందా బయటపడటానికి కారకులదే తప్పు అన్నట్టుగా… ఈ దందాను మీడియాకు లీక్ చేశాడని నందకిషోర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారట పోలీసులు, అలిపిరి పీఎస్కు తరలించారట… (వీడియో తీసిన వ్యక్తి)… రుయా ఆసుపత్రి ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా మీడియాతో మాట్లాడుతుండగానే ఆయన్ని తిరుపతి ఈస్ట్ డీఎస్పీ, అలిపిరి సీఐ స్టేషన్కు తరలించారట… సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇలా… కానీ దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు జనానికి..? జరిగిన అమానవీయ సంఘటన వోకే గానీ మీడియాకు చెప్పడమే తప్పు, నేరం అన్నట్టా..?!
Ads
నిజానికి ఇలాంటి విషయాల్లో యంత్రాంగం ఎంత కఠినంగా వ్యవహరిస్తే అంత మంచిది… ప్రజలకు కూడా ఇలాంటి విషయాల్ని సహించేది లేదనే భరోసా ఇచ్చినట్టవుతుంది… నిజంగానే ఈ మాఫియాల్ని అరికట్టడానికి చర్యలు ఆలోచించాలి… కానీ పోలీసుల ధోరణి ఏమిటి ఇలా ఉంది..? అసలు జగన్ ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాల్సింది, సరిదిద్దాల్సింది, ఇదుగో ఇలాంటి పోకడలనే…!!
Share this Article