సరిగ్గా అయిదేళ్ల క్రితం… వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా రామనాథ్ కోవింద్‌ను కలిశాడు… పుష్పగుచ్ఛం ఇచ్చాడు… భేటీ వేశాడు… సాయిరెడ్డి బీహార్ గవర్నర్‌గా ఉన్న రామనాథ్‌ను కలవడం ఏమిటబ్బా అనుకున్నారు అందరూ… ‘‘రాష్ట్రపతి అభ్యర్థిగా రామనాథ్ కోవింద్‌ను మోడీ ఎంపిక చేస్తాడని జగన్‌కు ముందే తెలుసా..? అందుకే సాయిరెడ్డి ముందే వెళ్లి తనతో భేటీ వేసి, సంప్రదింపులు జరిపాడా..? ఏంటీ కథ..? ఏంటీ..?’’ అని అప్పట్లో ఫేస్బుక్ పోస్టింగ్స్ కూడా పెట్టుకున్నాం…
అనుకున్నట్టే జరిగింది… రామనాథ్ కోవిందే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి అయ్యాడు… గెలిచాడు… అయిదేళ్లు హుందాగా తన పదవీబాధ్యతల్ని నిర్వర్తించాడు… మరి ఇప్పుడు బీజేపీ ఎవరిని ప్రపోజ్ చేయబోతోంది… ఆ ఆసక్తి దేశవ్యాప్తంగా క్రియేటైంది కదా… రకరకాల వ్యూహాలు, సమీకరణాలపై చర్చలు, ఊహాగానాలు సాగుతున్నాయి కదా… ఇప్పుడు మళ్లీ సాయిరెడ్డి ఇంకో గవర్నర్‌ను కలిశాడు… అభినందించాడు… అంటే ఏమిటి అర్థం..?
తను కలిసింది చత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయ ఉయికే… సో, మోడీ ఎంపిక అదేనా..? అందుకే సాయిరెడ్డి ముందస్తుగానే వెళ్లి గ్రీటింగ్స్ చెప్పేశాడా..? ఆమెకు కూడా ఎంపిక సంకేతాలు అందినట్టేనా..? ఇదీ డౌట్… ఏమో, నిజమేనేమో… సాయిరెడ్డి ఢిల్లీ రిలేషన్స్ అలా ఉంటాయి మరి…
Ads
ఇంతకీ ఎవరు ఈ అనసూయ ఉయికే… మధ్యప్రదేశ్ చింద్వారాలో ఓ గిరిజన కుటుంబంలో పుట్టిన ఆమె చాలా కష్టాలు పడుతూనే ఉన్నత విద్య కొనసాగించింది… ఎంఏ చేసింది, తరువాత ఎల్ఎల్బీ చేసింది… మొదట్లో, 1985లో కాంగ్రెస్ తరఫున దామువా నుంచి గెలిచింది… అర్జున్‌సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేసింది… తరువాత బీజేపీలో చేరింది…
2006లో రాజ్యసభ సభ్యురాలు… తరువాత 2019 నుంచి చత్తీస్‌గఢ్ గవర్నర్… గిరిజనులు, మహిళల సమస్యల మీద బాగా వర్క్ చేసింది… రాజకీయాల్లోకి రావడానికి ముందు ఎకనమిక్స్ లెక్చరర్‌గా కూడా చేసింది… అప్పట్లో 22 రాష్ట్రాల్లోని దాదాపు 80 జిల్లాల్లో తిరిగి, గిరిజన సమస్యల మీద ఓ సమగ్ర నివేదికను వాజపేయికి సమర్పించింది… సో, మంచిదే… బీజేపీ గనుక ఆమెను ఎంపిక చేస్తే మంచి నిర్ణయమే అవుతుంది… విద్యాధికురాలు, గిరిజనురాలు, మహిళ, సోషల్ ఇష్యూసై వర్క్ చేసింది, ఆల్రెడీ ఓ రాజ్యాంగ పదవిలో ఉంది… పార్లమెంటరీ వ్యవహారాల మీద కూడా అవగాహన ఉంది… మరి ఉపరాష్ట్రపతి ఎవరు..? ఆగండి… సాయిరెడ్డి కలిసి బొకే ఇస్తాడు, అప్పుడు ఓ నిర్ధారణకు వద్దాం..!!
Share this Article