నిజానికి చిన్న సినిమా… పాన్ ఇండియా సీన్ ఊహించలేం… హీరో నిఖిల్ రేంజ్ కూడా సెకండ్, థర్డ్ లేయర్… స్టారిజం ఇంకా తలకెక్కలేదు… కానీ హిందీలో కలకలం క్రియేట్ చేస్తోంది… ఎందుకంటే..? అమీర్‌ఖాన్ వంటి సూపర్‌స్టార్ చతికిలపడ్డాడు… అక్షయ్‌కుమార్ బోల్తాకొట్టాడు… వాళ్లను దాటేసి, ఒకవైపు వందలాదిగా వాళ్ల సినిమా షోలను ఎత్తిపారేస్తూ, కార్తికేయ సినిమా షోల సంఖ్య పెంచుతున్నారు… ఇంకా పెరుగుతోంది… ఎందుకిలా..?
ఈ సినిమాను తొక్కడానికి దిల్‌రాజు ప్రయత్నించాడు, తను తెలుగు ఇండస్ట్రీకి మంకీపాక్స్ వైరస్ అనే విమర్శల్ని… దానికి తన వివరణల్ని, వాటిల్లో విశ్వసనీయతను వదిలేద్దాం కాసేపు… కార్తికేయ సినిమా నిర్మాతలు, దర్శకుడు తెలివిగా కొన్ని పనులు చేశారు… ఇప్పుడు అవే వాళ్లకు అనూహ్యంగా లాభాలు తెచ్చిపెడుతున్నయ్…
‘‘మేమేంటి, మాకింతటి సీనేంటి’’ అని ఆత్మన్యూనత జోలికిపోకుండా… తెలుగుకే పరిమితం గాకుండా… ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్‌ను సరిగ్గా పట్టుకుని, హిందీలో కూడా డబ్ చేశారు… మరింత తెలివిగా అనుపమ్ ఖేర్‌ను ఓ కీలకపాత్రకు తీసుకున్నారు… కొన్ని స్పిరిట్యువల్ డైలాగ్స్ పలికించారు… కశ్మీర్ ఫైల్స్ హిట్టయిన జోష్‌లో ఉన్నాడు… బాగా చేశాడు… హీరోయిన్ అనుపమను సగటు తెలుగు హీరోయిన్‌లాగా వాడేసుకోకుండా, కథలో భాగం చేశారు… వెగటు డాన్సులు, ఆరబోతలు లేకుండా ప్లజెంటుగా ఉంది… అటు అనపమ్ ఖేర్, ఇటు అనుపమ… రెండు అనుపమ ఫ్యాక్టర్స్ భలే పనిచేశాయి…
Ads
అలాగని హీరో ఏదో తక్కువ చేశాడని కాదు… పాత్రకు అవసరమైనంత చేశాడు… అదే గొప్పవిషయం… ఎక్కడా బిల్డప్పుల జోలికి పోలేదు… నేల మీద నడిచాడు… గుడ్… హిందీ సినిమాల ట్రేడింగ్, ట్రెండింగ్ సరిగ్గా విశ్లేషించే తరణ్ ఆదర్శ్ ఏమంటాడంటే..? మొదటి రోజు ఈ సినిమా హిందీ కలెక్షన్లు కేవలం 7 లక్షలు… ఏదో నలభయ్యో, యాభయ్యో షోస్… రెండోరోజు 28 లక్షలు, మూడోరోజు 1.1 కోట్లు… 600 షోస్ నడుస్తున్నయ్… ఒక దశలో హిందీ షోస్ కోసం థియేటర్లను పెంచండి అని నిఖిల్ బతిమిలాడాడు… ఇప్పుడు థియేటర్లే కళ్లకద్దుకుంటున్నయ్…
#Karthikeya2 #Hindi witnesses remarkable growth on Day 3 [+292.86%]… Word of mouth has come into play… Phenomenal trending on extremely low screens/shows… Sat 7 lacs, Sun 28 lacs, Mon 1.10 cr [#IndependenceDay]. Total: ₹ 1.45 cr. HINDI version. pic.twitter.com/Il1DhqXihu
— taran adarsh (@taran_adarsh) August 16, 2022
ఇంకా హిందీ షోస్ పెరుగుతాయా..? పెరుగుతాయనే అనిపిస్తోంది… పెరగకపోయినా పెద్ద ఫరక్ పడదు… ఆల్‌రెడీ నిర్మాత లాభాల్లోకి వచ్చేశాడు… నిజానికి 30 కోట్ల బడ్జెట్ అంటున్నారు గానీ, అంత కూడా పెట్టలేదు… దాని బిజినెసే 12, 13 కోట్ల రేంజ్… అదీ మూడు రోజుల్లో టార్గెట్ కొట్టేసింది… ఒక్కసారి విశ్లేషించుకుంటే… కొన్నాళ్ల రిజల్ట్స్ చూస్తే… పేరున్న మాస్ హీరోలు, పెద్ద హీరోలు, స్టార్ హీరోల మొహాల్ని ప్రేక్షకులు తిరస్కరించారు… మూడు సినిమాల్లో బింబిసార హీరో కల్యాణరామ్… తన కెరీర్ గొప్పగా ఏమీ లేదు… కొంతకాలంగా మరీ బాగాలేదు… కానీ హిట్ చేశారు ప్రేక్షకులు…
సీతారామం హీరో దుల్కర్ తెలుగు హీరోయే కాదు, ఐనా కళ్లకద్దుకున్నారు… ఆ సినిమా విజయం చాలామంది నిర్మాతలకు మరో లెసన్… వైజయంతి అశ్వినీదత్ బిడ్డ స్వప్న కష్టం, టేస్ట్‌కు మంచి ఫలితం దక్కింది… కార్తికేయ హీరో వర్ధమాన కథానాయకుడు మాత్రమే… ఐనా ఈ మూడే ఢంకా మోగిస్తున్నయ్… కార్తికేయ హిందీ షోస్ పెరగడానికి సింపుల్‌గా ఇతర రీజన్స్ కూడా చెప్పుకోవాలంటే…
1) నార్త్ లో దిల్ రాజు లేడు, అదీ పెద్ద ప్లస్ పాయింట్… బాలీవుడ్ మాఫియా కాస్త దెబ్బతిని ఉంది… అందుకే అమీర్‌ఖాన్ పప్పులు కూడా ఉడకలేదు…
2) మార్కెట్ లో ఇప్పుడు చూడబుల్ హిందీ మూవీ లేదు… లాల్‌సింగ్ చద్దా ఫ్లాప్… రక్షాబంధన్ మరీ ఫ్లాప్… ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 పాతబడిపోయాయ్… సో, కార్తికేయ దొరికింది ఉత్తరాది ప్రేక్షకుడికి…
3) కార్తికేయలో వెగటు పాటలు, పిచ్చి గెంతులు, హీరోయిక్ బిల్డప్స్ లేవు… అక్కడక్కడా లాజిక్ రాహిత్యాలు ఉన్నా సరే నార్త్ ఇండియన్ క్షమించేశాడు…
4) ఇప్పటి పాపులర్ ట్రెండ్ స్పిరిట్యుయల్ థ్రిల్లర్స్… దాన్ని పట్టుకున్నాడు దర్శకుడు… పాత పురాణ కథను, వర్తమానాన్ని జోడించి, సస్పెన్స్, థ్రిల్ జతచేసి కథనాన్ని డౌన్ చేయకుండా చూసుకున్నాడు… సబ్జెక్టు డీవియేషన్ లేదు, పక్కతోవలు పట్టలేదు…
5) లెసన్ ఏమిటంటే… చిన్న హీరోలైనా హిందీ డబ్ వెర్షన్ మస్ట్… తెలుగులో తొక్కినా మూవీ బాగుంటే హిందీ గట్టెక్కిస్తుంది… ఓటీటీ, టీవీ రైట్స్ ఉండనే ఉన్నాయి… ఓవర్సీస్ ఇంకొంత ఆదుకుంటుంది… తక్కువ బడ్జెట్ అయితే రిస్క్ తక్కువ…
6) మూవీకి ప్రాణం, బలం డైలాగ్స్. కొంత లోతుగా అర్థవంతంగా ఉన్నాయి… అందరికీ నచ్చాలనేమీ లేదు… కానీ కృష్ణతత్వాన్ని చాకచక్యంగా ఇరికించారు… కావాలని యాడ్ చేసినట్టు ఆడ్‌గా లేదు…
7) లాస్ట్, బట్ నాట్ లీస్ట్… నిఖిల్, అనుపమ కాస్త చూడబుల్ పెయిర్… అన్నింటికీ మించి హీరోకు బవిరి గడ్డం లేకపోవడం చాలా బాగుంది…
Share this Article