తెలుగే కాదు… ఏ భాషలో వచ్చే టీవీ డాన్స్ షోలైనా అంతే… సినిమా పాటలకు సర్కస్ ఫీట్ల వంటి పిచ్చి గెంతులు… ఈ విషయంలో వేరే అభిప్రాయం లేదు… ఇక విషయంలోకి వెళ్దాం… టీవీల్లో రియాలిటీ షోలకు సంబంధించి పోటీ విపరీతంగా పెరిగిపోయింది… అంటే డాన్స్, మ్యూజిక్, కామెడీ ఎట్సెట్రా షోలు… (నాన్-ఫిక్షన్, అంటే సీరియళ్లు గట్రా కాదు)… వీటిల్లో ఈటీవీ ఇప్పటిదాకా బలంగా ఉండేది… వావ్, క్యాష్, స్వరాభిషేకం, పాడుతా తీయగా, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలన్నమాట…
కారణాలు బోలెడు… అవన్నీ దెబ్బతింటున్నయ్… నాసిరకం అయిపోయాయి… ఆ వివరాల లోతుల్లోకి ఇక్కడ పోవడం లేదు… అసలే నాసిరకం సరుకు, ఇక ఇతర టీవీలు పోటీలుపడి, ఈటీవీ రియాలిటీ షోలకు పోటీగా ప్రోగ్రామ్స్‌కు రూపకల్పన చేస్తున్నయ్… టీవీలే కాదు, ఆహా వంటి ఓటీటీ కూడా..! అల్లు అరవింద్ దాన్ని కూడా ఓ టీవీగా మార్చేశాడు…
నిజానికి ఈటీవీతో రియాలిటీ షోలకు సంబంధించి జీతెలుగు, స్టార్‌మాటీవీ ఎన్ని ప్రోగ్రాములు చేసినా క్లిక్ కావడం లేదు… దరిద్రపు క్రియేటివ్ టీమ్స్ వల్ల… జెమినివాడు ఖర్చుకు సిద్ధంగా ఉన్నా సరే, చూసేవాడు లేడు… సాక్షాత్తూ జూనియర్ ఎన్టీయార్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో చేస్తే అట్టర్ ఫ్లాప్… తమన్నాతో మాస్టర్ చెఫ్ చేయిస్తే అదీ బిట్టర్ టేస్ట్… మాటీవీ వాడు బిగ్‌బాస్ షోలో మాత్రమే క్లిక్కయ్యాడు… మొన్నటి 24 గంటల షోతో అదీ భ్రష్టుపట్టిపోయింది…
Ads
కామెడీ స్టార్స్ చేస్తే ఫ్లాప్… జీతెలుగులో అదిరింది ప్లాన్ చేస్తే, అదీ ఫ్లాప్… సో, కామెడీకి సంబంధించి ఎంత నాసిరకంగా ఉన్నాసరే జబర్దస్త్‌దే పైచేయి… మ్యూజిక్ సంబంధించి మాటీవీలో సూపర్ సింగర్ జూనియర్ చేశారు, ఫ్లాప్ కాదు, కాకపోతే అనుకున్నంత హిట్ కాదు… పాటలకన్నా సుధీర్, అనసూయ వేషాలే ఎక్కువ… చిత్ర, హేమచంద్ర, మనో వంటి సింగింగ్ స్టార్లను వాడుకోలేకపోవడం… జీతెలుగులో సరిగమప ప్రోగ్రామ్‌కు మస్తు ఖర్చుపెట్టారు, నలుగురైదుగురు జడ్జిలను కూర్చోబెట్టారు… అదీ ఫ్లాప్… కానీ ఆహాలో థమన్, కార్తీక్, నిత్య, శ్రీరామచంద్రలు హిట్ చేశారు…
దాని సక్సెస్‌తో ఆహాలో అల్లు అరవింద్‌కు డాన్స్ షో చేయించాలని అనిపించింది… బవరి గడ్డం, కీచు కంఠంతో విచిత్రంగా కనిపిస్తాడు కదా, ఆ ఓంకార్‌ను పిలిచి అప్పగించాడు… అంతకుముందే ఓంకార్ మాటీవీలో నలుగురు జడ్జిలను పెట్టి ఓ డాన్స్ షో చేశాడు… సూపర్ ఫ్లాప్… ఇప్పుడు ఆహాలో శేఖర్ మాస్టర్, శ్రీముఖి, మోనాల్ గజ్జర్‌లు జడ్జిలుగా ‘డాన్స్ ఐకన్’ అని స్టార్ట్ చేస్తున్నాడు… దాని లాంచ్‌కు ఏకంగా విజయ్ దేవరకొండ, అనన్యలను పట్టుకొచ్చాడు… డాన్స్ స్టెప్పులు వేయించాడు…
మరోవైపు జీవాడు డాన్స్ ఇండియా డాన్స్ అనే షో స్టార్ట్ చేశాడు కదా… బాబా భాష్కర్, సంగీత జడ్జిలుగా కనిపిస్తున్నారు… అకస్మాత్తుగా మహేశ్ బాబు తన బిడ్డ సితారతో కలిసి ఎంట్రీ ఇచ్చాడు ఆ షోలోకి… సితార కొన్ని స్టెప్పులేసింది… అంటే, ఈటీవీ ఢీకి పోటీగా ఇటు ఆహా ఓటీటీ గానీ, అటు జీతెలుగు గానీ తమ డాన్స్ షోలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి… మరోవైపు ఈటీవీ ఢీ మాత్రం రోజురోజుకూ తుస్సుమన్నట్టుగా సాగుతోంది… ఆ ప్రదీప్ కూడా వెళ్లిపోతే..? కాస్త ఆ ఓంకార్ రూపం అలా భీకరంగా కనిపించకపోతే… ఆహా డాన్స్ ఐకన్ షో కాస్త బెటర్‌గా ఉండనుందేమో…!!
Share this Article