మీడియాను ఫేస్ చేయడం ఓ ఆర్ట్… చాలామంది సినిమా సెలబ్రిటీలకు అది పైసామందం కూడా తెలియదు… వీరాభిమానుల మూర్ఖాభిమానం, మీడియా భజనలు ఎక్కువైపోయి, వాళ్లకువాళ్లు దేవుళ్లకు ప్రతిరూపాలుగా భావిస్తుంటారు… సరైన ప్రశ్నను సరిగ్గా రిసీవ్ చేసుకోరు, ఇరిటేట్ అవుతారు… నోరు జారతారు… కవర్ పడేస్తే చాలు, నోరు మూసుకుని, తాము వాగిన ప్రతి చెత్తను కవర్ చేయాల్సిందే అన్నట్టుగా ఫీలవుతారు… ఇంటర్వ్యూలకు కూడా ప్రత్యేక టారిఫ్ అమలయ్యే కాలం కదా… వాళ్లు అలాగే ఫీలవుతారు…
రాంగోపాలవర్మ ఇంటర్వ్యూయర్ల పట్ల ఎలా బిహేవ్ చేస్తాడో చూశాం కదా… ప్రస్తుత జర్నలిజం (??) తీరూతెన్నూ ఎలా ఉందో చెప్పడానికి వర్మ ఇంటర్వ్యూలే పెద్ద ఉదాహరణ… సో, జర్నలిస్టులంటే ప్రతి వాడికీ అలుసు… వాళ్ల ప్రశ్నలంటే అలుసు… అలుసు ఇచ్చింది వీళ్లే… ఏదో అడగాలి కాబట్టి దిక్కుమాలిన నాలుగు నాసిరకం ప్రశ్నలు వేస్తారు, అవీ పీఆర్వోలు ముందే చెబుతారు… వాళ్లేదో వాగుతారు… వీళ్లు రికార్డ్ చేసుకుంటారు… ఖేల్ ఖతం… ఎటొచ్చీ ఎవరైనా ఏదైనా ఇబ్బందిగా అనిపించే ప్రశ్న వేసినప్పుడు వస్తోంది సమస్య… (వీళ్లు మెయిన్ స్ట్రీమ్.., ప్రత్యేకించి పొలిటికల్, క్రైమ్ బీట్లు కవర్ చేసే రిపోర్టర్లను ఫేస్ చేస్తే అప్పుడు అర్థమయ్యేది వీళ్లకు…)
వీళ్లకేమో సరైన జవాబు చెప్పడం రాదు… ఎందుకు జవాబు చెప్పాలి, అసలు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడగాలి, చెప్పింది రాసుకోవాలి అన్నట్టుగా వ్యవహరిస్తారు.., జవాబు ఇష్టం లేని ప్రశ్నను, జవాబు తెలియని ప్రశ్నను అవాయిడ్ చేయడానికి, దాటవేయటానికి కాస్త తెలివి అవసరం… అలాగే మీడియా సమక్షంలో తమ నడమంత్రపు చేష్టల్ని, అహాన్ని కంట్రోల్ చేసుకోవాలి… అదీ చేతకావడం లేదు… నిర్మాత, దర్శకులు గాకుండా ఈమధ్య ప్రతి ప్రమోషనల్ మీడియా మీట్లనూ హీరోలే అడ్రస్ చేస్తున్నారు… కథ, కథనం, నటీనటుల ఎంపిక, సంగీతం, ఎడిటింగ్, మన్నూమశానం అన్నీ వాళ్లే మాట్లాడేస్తున్నారు… సడెన్గా టెంపర్ కోల్పోయి ఏదో నోరు జారతారు, బుక్కవుతారు…
Ads
ఆంటీ అంటే ఒకావిడ కేసులు పెట్టి, అందరినీ జైలులో పారేస్తుందట, అక్కడికి పోలీసులు, ప్రభుత్వం, కోర్టులు అన్నీ తానే అయినట్టు…! అదేదో బూతు పదం అయినట్టు..! మరొక నటుడు మీమ్స్ చేసే సోషల్ మీడియా, యూట్యూబర్లందరినీ పిలిచి, మీటింగ్ పెట్టి మరీ క్లాస్ పీకుతాడు… ఇలాగే కేరళలో ఎక్కువగా కామెడీ, కేరక్టర్ రోల్స్ వేసే శ్రీనాథ్ భాసి అనే నటుడున్నాడు… మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చాడు, తనకు లీడ్ రోల్ చేసే చాన్స్ రావడంతో ఒక్కసారిగా లెవల్ బాగా పెరిగిపోయింది… చట్టంబి అనే ఆ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తూ, హఠాత్తుగా ఓ మహిళా జర్నలిస్టును ఉద్దేశించి అసభ్యంగా కామెంట్స్ చేశాడు, బుక్కయ్యాడు… అక్షరాలా…
అంతకు ముందు రెడ్ ఎఫ్ఎం రేడియో ఇంటర్వ్యూలో కూడా అలాగే మాట్లాడాడు… ఇప్పుడు ఆ రెండు వీడియోలు, ఆడియో బిట్లు వైరల్ అవుతున్నాయి… సదరు జర్నలిస్టు మన టీవీ9 న్యూస్ ప్రజెంటర్ దేవిలాగా ‘గెటౌట్ ఫ్రమ్ మై స్టూడియో’ అని గేటు చూపించి ఊరుకోలేదు… నేరుగా వెళ్లి పోలీస్ కేసు పెట్టింది… మరదు ఠాణా పోలీసులు కూడా వెంటనే లైంగిక వ్యాఖ్యలు, అసభ్య కూతలు, అశ్లీల ప్రవర్తన పేరిట మూడునాలుగు సెక్షన్లు పెట్టేసి అరెస్టు చేశారు… వైద్యపరీక్షలకు పంపించారు… అంతేకాదు, The Kerala Film Producers’ Association (KFPA) తనపై తాత్కాలిక నిషేధాన్ని కూడా విధించింది… ఈ నిషేధం అమలు ఎలా ఉంటుందో తెలియదు కానీ… తన ప్రవర్తన పట్ల మరో ఇంటర్వ్యూలో ఆమెకు క్షమాపణ చెప్పినా సరే, గొడవ చల్లారలేదు… అదీ సంగతి..!
Share this Article