పాలకుడికి తెలిసి ఉండాలి… తన పల్లకీ మోసీ బోయీల అవసరాలు ఏమిటో గుర్తెరగాలి… తీర్చాలి… అప్పుడే విధేయత, బానిసత్వం పరిఢవిల్లుతాయి… ఒకప్పుడు హైదరాబాద్ కమ్యూనిస్టు రాజ్యం కోసం రైతులను పోగేసి, సాయుధపోరాటం చేసిన సీపీఐకి ఇవన్నీ బాగా తెలుసు… కొడిగట్టిన దీపం అని మనం అనుకుంటాం… కానీ కొందరు పెద్దలు ప్రభువుల ఎదుట సాగిలపడుతూనే ఉంటారు… పోరాట స్పూర్తి, ప్రజాకోణం అనే పదాల్ని తమ డిక్షనరీల నుంచి తీసిపారేశారు…
విషయం ఏమిటంటే… సీసీఐకి విశాలాంధ్ర అనే ఓ పత్రిక ఉండేది… ఎవరూ చదవకపోయినా సరే, ఆ పార్టీ సానుభూతిపరులకు ఎలాగోలా చేరేది… తరువాత ఓ దిక్కుమాలిన ప్రయోగం చేసి మనతెలంగాణ అని పత్రిక తీసుకొచ్చారు… సదరు పత్రిక ఎడిటర్లు, కొత్త భాగస్వాముల పుణ్యమాని అది కాస్తా భ్రష్టుపట్టి, చివరకు సీపీఐ బంధనాల్ని తెంచుకుని, విముక్తి పొంది, ఏదో టీఆర్ఎస్ విసిరేసే ఆహారంతో నెట్టుకొస్తోంది… అది వేరే సంగతి,.,
ఆ ప్రయోగం సర్వభ్రష్టమని తేలిపోయాక సీపీఐ కొంచెం కళ్లు తెరిచి, అప్పటికే ఓ టీవీ చానెల్ అమ్ముకున్న చేదు అనుభవం ఉంది కదా… పార్టీ వాయిస్ కోసం ఓ చిన్న పత్రికనైనా సొంతంగా నడిపిద్దాం, నాన్-కమ్యూనిస్టుల ఇష్టారాజ్యాలు ఉండకూడదు అనుకున్నారు… ప్రజాపక్షం అని ఓ పేపర్ పెట్టారు.,. దాని కాపీలు ఎన్ని అడక్కండి ప్లీజ్… కానీ అకస్మాత్తుగా కేసీయార్‌కు అది పెద్ద పత్రికగా కనిపించింది… కనిపిస్తుంది.,.. కేసీయార్ అంటేనే అది కదా…
Ads
ఒకప్పుడ కేసీయార్‌కు ఇదే విశాలాంధ్ర ఎడిటర్ శ్రీనివాసరెడ్డి కావల్సినవాడు… ఐజేయూ అధ్యక్షుడు ఇప్పుడు… తరువాత కమ్యూనిస్టుల్ని ఆమడ దూరం ఉంచిన రోజుల్లో కేసీయార్ ఇదే శ్రీనివాసరెడ్డికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు… మనతెలంగాణను కానలేదు… ఇప్పుడు ప్రజాపక్షం పెద్ద పత్రికగా కనిపించింది తనకు… ఇదే శ్రీనివాసరెడ్డి అత్యంత ఆత్మీయుడు అయిపోతాడు… ఎందుకంటే… ఇప్పుడు సీపీఐ, సీపీఎం తన మిత్రపక్షాలు కాబట్టి… వాళ్ల అవసరం తనకు ఉంది కాబట్టి… వీళ్లందరూ కలిసి తెలంగాణనే కాదు, యావత్ భారతదేశాన్ని అర్జెంటుగా ఉద్దరిస్తారు కాబట్టి… వీలయితే ప్రపంచ రాజకీయాల్ని శాసిస్తారు కాబట్టి…
మరి వామపక్షాలు కదా, అదును దొరికినప్పుడే చంకకెక్కుతాయి… వాళ్ల పెండింగ్ అవసరాలన్నీ తీర్చేసుకుంటయ్… పాత్రికేయం, ప్రమాణాలు, తొక్కాతోలూ జాన్తానై… లెఫ్ట్ పార్టీలు తమ అవసరాల్ని కేసీయార్ దగ్గర పెట్టి తీర్చేసుకుంటున్నాయి… జనం సొమ్మే కదా… పోతేపోనీ… లెఫ్ట్ అంటే గతంలో ప్రజల పార్టీలు… టీఆర్ఎస్ అంటే ఉద్యమపార్టీ… ఇప్పుడు ఉత్తుత్తి, ఫక్తు రాజకీయ పార్టీలు కదా… అహోబిలం మఠాలు కాదు కదా… ఇష్టారాజ్యం… తెలంగాణ ప్రజల సొమ్మును పంజాబ్ దాకా తీసుకు వెళ్లి రైతు పరిహారం చెక్కులు, బీహార్‌లో యుద్ధవీరుల పరిహారం చెక్కులు ఇచ్చినట్టే… లెఫ్ట్ కోరికలనూ తీర్చేస్తున్నాడు కేసీయార్… మరి అవసరం కదా… అసలే జాతియ పార్టీ పెడుతున్నాడట కదా…
సో, పత్రికల సర్క్యులేషన్ల లెక్కలు ఓ భ్రమ… ఎవడు ఏ రిపోర్ట్ ఇస్తే దానికి ఆమోదముద్ర వేయడమే… అడ్డగోలు రేట్లను ఖరారు చేయడమే… బట్, తమకు అనుకూలురై ఉండాలి… ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సీపీఐకన్నా బలమైన మద్దతుదారు ఎవరు..? అందుకే ఈ ‘‘పెద్ద పత్రికగా గుర్తింపు’’ నిర్ణయం జరిగిపోయింది… అవునూ, పెద్ద పత్రిక అంటే ఏమిటి..? ఎంత సర్క్యులేషన్ ఉండాలి..? ఎవరు నిర్ధారించాలి..? అధికార పార్టీకి జోకుడు పార్టీ అయి ఉంటే చాలా..? సబ్ చల్తా అనుకోవాలా..? ఆహా, ఏం పాత్రికేయ పాలసీ స్వామీ… అవసరానికి ఏది తోస్తే అది… పాలసీ మన్నూమశానం అని ఎవడైనా అంటే మర్యాద దక్కదు… అంతే…!!
కేసీయార్ సార్… వెంటనే నవతెలంగాణ అనే సీపీఎం పత్రికను కూడా ఉద్దరించాలి… పెద్ద పత్రికగా కాదు, వీలైతే ప్రముఖ పత్రిక అనే కేటగిరీ సృష్టించి, ఈ పత్రికను అందులో చేర్చి, ఒకేసారి యాడ్ టారిఫ్ డబుల్ చేసేసి, తమ్మినేని ఆశీస్సులు పొంది, వీలయితే సీతారాం ఏచూరి వంటి మఠప్రముఖుల అభిమానాన్ని పొందాలి… మిగతా డిమాండ్లు తరువాత చెబుతాం… ప్లీజ్, మమ్మల్నీ చంకనెక్కించుకొండి.,. ఎలాగూ తెలంగాణ ఎడ్డిజనానికి ఏమీ సమజ్ కాదులే,..!!
అలాగే tnews లో సిబ్బంది unrest… నమస్తే తెలంగాణాలో unrest… పేరుకు కెసిఆర్ మీడియా… కానీ నెత్తి మాసిన జీతాలు… అర్జెంటుగా జాతీయ పత్రిక అని కొత్త కేటగిరీ పెట్టేసి, యాడ్ రెవెన్యూ డబుల్ చేయాలి సార్… లేకపోతే జాతీయ డప్పు కష్టం… పొతే పోనీ, తెలంగాణ జనం సొమ్ము, ఎప్పుడూ గాలికి పోయే పేల పిండే కదా…!!
Share this Article