సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా సరే బీజేపీ అనుసరించే టెక్నికే అది… ప్రత్యర్థుల పోల్ మేనేజ్‌మెంట్‌కు ఏ అడ్డాలు ఉపయోగపడుతున్నాయో వాటి మీద ఐటీ దాడులు చేయడం… మీకు గుర్తుందా..? ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు హఠాత్తుగా పీయూష్ జైన్ అనే ఓ అత్తరు వ్యాపారి ఇంటి మీద, ఫ్యాక్టరీల మీద దాడులు చేశారు… 150 కోట్లు దొరికాయి… అలాగే శిఖర్ గుట్కా వ్యాపారి ప్రవీణ్ జైన్ ఆస్తులపైనా దాడులు జరిగాయి… ఇతర రాష్ట్రాల్లోనూ సేమ్…
ఈ కేసులు తరువాత ఏమవుతాయి అనేది నిజానికి ఎవరికీ పట్టదు..? మీడియా కూడా పట్టించుకోదు… కీలకమైన పోల్ మేనేజ్‌మెంట్ వేళ మనీ మూవ్‌మెంట్‌కు అడ్డాలుగా సందేహించే ప్రాంతాలపై, సంస్థలపై దాడులు చేసి, నెట్‌వర్క్‌ను డిస్టర్బ్ చేయడమే ఈ దాడుల ఉద్దేశం… కొద్దిరోజులపాటు వాళ్ల యాక్టివిటీని స్థంభింపజేస్తారు… మనం వోటర్లకు ఎంత పంచామనేది కాదు, ప్రత్యర్థుల్ని పంచకుండా ఎంతమేరకు కట్టడి చేశామనేది ముఖ్యం… ఇదే స్ట్రాటజీ…
గత ఎన్నికల్లో జగన్ కోసం… బీజేపీ, కేసీయార్ కలిసి చంద్రబాబుకు ఎలా ‘నట్లు’ బిగించారో కూడా తెలుసు కదా… డబ్బు నిల్వ కేంద్రాలు, ప్రత్యర్థుల ఆర్థిక స్థంభాలు, డబ్బు పంపిణీ నెట్‌వర్క్‌ను చెల్లాచెదురు చేయడం అనేదే వ్యూహం… మంత్రి జగదీష్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపైనే కాదు, కావేరీ సీడ్స్, ఆదిత్య ఆగ్రో సంస్థలపై ఐటీ అకస్మాత్తుగా చేసిన దాడుల్ని ఈ కోణంలోనే పరిశీలించాలి… ఆయన నివాసం నల్లగొండలో ఉంటుంది…
Ads
ఎంత డబ్బు దొరికిందో ఐటీ శాఖ అధికారికంగా వెల్లడించలేదు… నిజానికి టీఆర్ఎస్ పార్టీకి కావేరీ సీడ్స్, ఆదిత్య ఆగ్రో ఎంత దగ్గరో పొలిటికల్ సర్కిళ్లలో ఉన్నవాళ్లకు తెలుసు… (మరో సీడ్ కంపెనీ అంటున్నారు గానీ క్లారిటీ లేదు…) అందుకే వాటిపై ఐటీ కన్నేసినట్టుంది… నిజానికి ఈరోజుల్లో ఫిజికల్ క్యాష్ వ్యవహారాలు తక్కువ… అంతా డిజిటల్ యవ్వారాలే… అయితే కావేరీ, ఆదిత్య సంస్థల నుంచి వేరే అకౌంట్లలోకి డబ్బు ట్రాన్స్‌ఫర్ అవుతున్నట్టు ఐటీకి ఉప్పందిందా..? ఈసీకి ఫిర్యాదు అందిందా..? తెలియదు…
ఆర్థిక వ్యవహారాల్ని చూసే కీలక వ్యక్తుల్ని పోలింగ్‌కు ముందురోజు డిస్టర్బ్ చేయాలనేదే ప్లాన్ కావచ్చు… ఈరోజు సాయంత్రంతో ప్రచారం పూర్తి కాబోతున్నది… అసలు మేనేజ్‌మెంట్ మొదలు కానుంది… సరిగ్గా ఇదే టైమ్‌కు ఈ దాడులు… పోలింగ్ ముగిశాక మళ్లీ ఈ దాడుల గురించి మాట్లాడేవాళ్లు ఉండరు…
(బీజేపీ వాళ్లు చెప్పగానే ఐటీవాళ్లు దాడులు చేస్తారా అని అమాయకంగా అడక్కండి… సీబీఐ మాత్రమే రాకుండా జీవోలు తెస్తే పెద్ద ఫలితం ఉండదు… గత ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన పనే ఇది… సీబీఐ రాకపోతేనేం, ఈడీ, ఐటీ, ఎంఆర్ఐ వంటి చాలా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటయ్… ఈడీలకు, మోడీలకు, బోడీలకు భయపడేది లేదని పైకి ఉరుముతూనే, ఢిల్లీ మద్యం స్కామ్ బయటపడగానే గోప్యంగా సీబీఐని అడ్డుకునే జీవో జారీ చేసేసింది కేసీయార్ సర్కారు…)
మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో కొన్నాళ్లపాటు చర్చల్లో నిలిచిపోతుందేమో… ఆఫ్టరాల్ ఒక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ఇది… అటు ఎమ్మెల్యేల కొనుగోళ్ల యవ్వారాలు, స్కెచ్చులు,… ఇటు టీఆర్ఎస్ ఆర్థిక స్థంభాలపై దాడులు… బీజేపీ, టీఆర్ఎస్ క్యాంపులు రెండూ ఎదుటి పక్షాన్ని బాగా ఇరుకునపెట్టే సెగల ఎత్తుగడల్ని, పొగల వ్యూహాల్ని ప్రయోగిస్తున్నాయి… పోలింగ్ సమీపించేనాటికి క్లైమాక్స్ ఇంకా ఆసక్తికరంగా మారుతోంది…
Share this Article