మంచు కుటుంబం మాట్లాడే తీరు పట్ల తెలుగుజనంలో బాగా వ్యతిరేకత ఉండవచ్చుగాక… కేవలం ఆ వ్యతిరేకత కారణంగానే మొన్నటి జిన్నా సినిమా కోటిరూపాయలు కూడా సంపాదించలేక స్క్రాప్‌లో కొట్టుకుపోయి ఉండవచ్చుగాక… కానీ ఇవ్వాల్టి దినానికి తెలుగులో తనొక్కడే హీరో… తనతోపాటు నిఖిల్… మిగతా హీరోలు పేరుకే… వెన్నెముకల్లేవు… బుర్రలు అసలే లేవు అనే విమర్శలు వస్తున్నాయి….
ఆమె ఎవరో రిచా చద్దా అట… భారతీయ సైన్యాన్ని వెక్కిరిస్తూ ఏదో పిచ్చి ట్వీట్ కొట్టింది… ఈజీ కదా… పాకిస్థాన్, అప్ఘనిస్థాన్, టర్కీ, ఉత్తర కొరియా వంటి దేశాల్లో అయితే బజారులో నిలబెట్టి శిక్షించేవారు… కానీ భారతదేశం కదా… ఎవరైనా సరే, ఏమైనా కూయవచ్చు… మన మీడియా కూడా మస్తు కవరేజీ ఇస్తుంది… ప్రకాష్ రాజ్ వంటి ‘అరబుర్రలు’ ఎలాగూ సపోర్టుగా వస్తారు… ఇక్కడ అరబుర్ర అని ఉద్దేశపూర్వకంగానే రాశాను… తను అదే…
నార్తరన్ కమాండ్ సాయుధ దళాల యుద్ధ సన్నద్ధతను పర్యవేక్షిస్తూ మన సైనికాధికారి ‘‘పాక్ ఆక్రమిత కశ్మీర్ ను తిరిగి తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం… మీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం… వేగంగా పని పూర్తి చేస్తాం.. ఒకవేళ పాకిస్థానే ముందుగా సీజ్ ఫైర్ ఉల్లంఘిస్తే… మన ప్రతి చర్య పాకిస్తాన్ ఊహించనంత భయంకరంగా ఉంటుంది అన్నాడు…
Ads
దానికి రిచా ‘‘ఓహో అలాగా… మీకోసం గాల్వన్ లోయ హాయ్ అంటోంది… ఆ పీఓకే గురించి మాట్లాడింది చాలు గానీ… చైనా బోర్డర్ గాల్వన్ హాయ్ అంటోంది… దమ్ముంటే ఇక్కడ పీకుదురు గానీ… అన్నట్టుగా సైన్యాన్ని హేళన చేస్తూ ట్వీటింది… అప్పుడు కనిపించింది ఓ దృశ్యం… పర్ సపోజ్, ఫర్ డిబేట్,.. జలాంతర్గాముల్లో లేదా యుద్ధనౌకల్లో హఠాత్తుగా వచ్చిపడిన పాకిస్థాన్ సైన్యం ముంబైని హస్తగతం చేసుకుందీ అనుకుందాం… తరువాత ఆ సైన్యం ఫస్ట్ వెతికేది ఎవరినో తెలుసా..? ఇదుగో ఈ రిచా చద్దా వంటి యాక్టర్లనే… ఇది రియాలిటీ… ఆర్మీ అంటే అలాగే ఉంటుంది… భద్రంగా బతుకుతున్నాం కదా, మనకు స్వేచ్ఛ విలువ తెలియదు… రక్షణ విలువ తెలియదు,..
సుస్థిరత అంటే ఏమిటో, దేశభద్రత ఎంత ప్రధానమో… మొన్న అప్ఘనిస్థాన్ నుంచి కట్టుబట్టలతో పారిపోయిన వేలాది మందిని అడగాలి… ఇప్పుడు ఉక్రెయిన్ మహిళల్ని అడగాలి… దివంగత మేజర్ జనరల్ బిపిన్ రావత్ అప్పుడే చెప్పాడు… మనం టూ పాయింట్ ఫైవ్‌తో యుద్ధం చెయ్యాలి అని… రెండు బయటి శక్తులు అయితే… ఈ పాయింట్ ఫైవ్ దేశంలోనే ఉన్నారు అని… అర్బన్ నక్సల్స్ .. జాతి విద్రోహులు.. ఎంత శక్తిమంతులో.. ప్రతిక్షణం మనకు గుర్తుకి వస్తూ వుంటుంది… టెల్గూస్…ఆమె ఏమన్నదో…అర్థం అయ్యిందా….
ప్రకాష్ రాజ్ అనే భారత వ్యతిరేకి ఆమెకు మద్దతుగా ట్వీట్ చేసినా తెలీదా… మొహమ్మద్ జుబైర్ అనే ఆల్ట్ న్యూస్ మేన్ కీ చందాలు పోగు చేసే బ్యాచ్ లోనే ఈ రిచా ఉన్నదనీ తెలీదా… మన ప్రముఖ డేరింగ్ డేషింగ్ పత్రికలు ఈ జుబైర్ జైల్లో ఉన్నప్పుడు వాడి కోసం ఏడుస్తూ సంపాదకీయాలు రాసింది తెలీదా…. ఈ రిచా ఒకసారి… వాఘా బోర్డర్ వెళ్ళండి, మంచి సర్కస్ చూడచ్చు అని కూసింది… దానర్థం కూడా తెలీదా…
ఆమెకు అవకాశం వచ్చినప్పుడల్లా… మన దేశాన్ని..సైన్యాన్ని కించపరుస్తూ ఉంటుందని…హేళన చేస్తూ ఉంటుందని… ఆమె హేళనను… ఎంజాయ్ చేస్తూ… ప్రకాష్ రాజ్ లు… రిట్వీట్ లు చేస్తూ ఉంటారనీ… అలాంటి రిచాలు కోకొల్లలుగా ఉంటారనీ… ఆమెకు మద్దతుగా.. పాకిస్తాన్ వెంటనే రంగంలోకి దిగి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటుందని… మన మీడియాకు అస్సలు తెలీదు… అంతేనా..?
అక్షయ్ కుమార్ వంటి హీరోలు వెంటనే రియాక్ట్ కాగా, తెలుగులో స్పందించింది ఒకరు నిఖిల్… మరొకరు మంచు విష్ణు… ఇద్దరే రిచా వ్యాఖ్యల్ని ఖండించారు… నెటిజనం పెద్ద ఎత్తున విరుచుకుపడేసరికి ఆ రిచా అనే స్వేచ్ఛాజీవి దిగివచ్చి… ‘సర్లేరా భయ్, ఒకరిద్దరు ఒకవేళ నొచ్చుకుని ఉంటే సారీ… ఐనా నేనన్న దాంట్లో తప్పేముంది..?’ అని ట్వీటింది… ‘ఒకవేళ నొచ్చుకుని ఉంటే’ అనే పదాలే మళ్లీ పెద్ద హేళన వ్యవహారం… నొచ్చుకోకపోతే ఇంత భారీగా ఆమెను ఎందుకు తిట్టిపోస్తారు… పైగా నేనన్నదాంట్లో తప్పేముంది అంటోంది… వామ్మో, ఇది మామూలు కేరక్టర్ కాదు…!! ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఆమె నటించిన ఫక్రీ3 సినిమాను బాయ్‌కాట్ చేయాలనే పిలుపు ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంది ఇప్పుడు… #BoycottFukrey3
Share this Article