ఈ సంవత్సరం మొదట్లో… గెహరాయియా అని ఓ సినిమా… అందులో దీపిక పడుకోన్ కథానాయిక… ఆమె సెంట్రిక్‌గానే కథ… సహనటుడు సిద్ధాంత్‌తో ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయిన తీరు చూసి ఆమె అభిమానులే నిర్ఘాంతపోయారు… నిజానికి కథకు కూడా అంత ఎక్స్‌పోజింగ్, ఆ ఇనార్గానిక్ కెమిస్ట్రీ రోతగా అనిపించింది… దానికి అసలే బూతు దర్శకుడు కరణ్ జోహార్ … థియేటర్లలో వీలుగాక అమెజాన్‌లో రిలీజ్ చేశాడు…
ఓ పది శాతం బాడీని కవర్ చేసే రెండు పేలికలు… మిగతాదంతా బరిబాతలే… ప్రాంతీయ సినిమాలతో పోలిస్తే హిందీ సినిమాల్లో ఈ వెగటు, రోత ప్రదర్శనలు ఎక్కువే… నిజానికి ఈ గెహరాయియా సినిమాలో దీపిక చేసినట్టు సౌత్ సినిమాల్లో కాస్త పేరు తెచ్చుకున్న ఏ నటిని అడిగినా చేయదు… ప్రాజెక్టును వదిలేస్తుంది… అంత బేశరం సీన్లు అవి…
Ads
బేశరం అంటే గుర్తొచ్చింది… (తప్పనిసరై రెండు మూడు రోత ఫోటోల్ని పెట్టాల్సి వచ్చింది, క్షమించండి… దిగువన ఈ పాట వీడియో ఉంది… చూడండి… ఇంకెంత బేశరంగా ఉందో తెలుస్తుంది…) అదే దీపిక హీరోయిన్… షారూక్ ఖాన్ హీరో… చాన్నాళ్ల తరువాత ఈ సినిమాపై నమ్మకం పెట్టుకున్నాడు… అమీర్‌ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దాను చూడొద్దంటూ ట్విట్టర్‌లో క్యాంపెయిన్ నడిచింది కదా, తన సినిమాపై ఈ నెగెటివిటీ రాకుండా ముందు జాగ్రత్తగా వైష్ణోదేవి టెంపుల్ వెళ్లొచ్చాడు షారూక్… అంతకుముందు అమీర్‌ఖాన్ తన ఆఫీసులో కలశపూజ చేశాడు…
సిక్స్ ప్యాక్ కాదు… అదేదో సిక్స్‌టీన్ ప్యాక్‌లా బాడీ కనిపిస్తోంది… యంగ్ లుక్ కోసం శోభన్‌బాబులా నాలుగు పోచల్ని మొహంపై వేలాడేట్టు హెయిర్ డిజైనింగ్… ఇవన్నీ సరే, దీపికకు ఇంత చీప్ టేస్ట్ దేనికి..? మరీ ఘోరమైన డ్రెస్సింగ్… దాదాపు ఒంటి మీద ఏమీ లేనట్టుగానే… అప్పట్లో లెహరాయియా సినిమాలో దీపిక డ్రెస్సుల్ని, ఆ ఇంటిమేట్ సీన్లను మస్తు ఎంజాయ్ చేశాను అన్న ఆమె భర్త రణబీర్‌సింగ్ ఇక పఠాన్ సినిమాలో దీపిక డ్రెస్సులు, ఫోజులు, ప్రత్యేకించి బేశరం పాటలో ఆమె అగ్లీ మూమెంట్స్ చూసి ఇంకెంత ఆనందిస్తాడో…
సినిమా తారలు మొత్తం విప్పేసి నటించమన్నా నటిస్తారు… ఆ డర్టీ అండ్ అగ్లీ సీన్లకు షారూక్ ఖాన్ ఎలా అంగీకరించాడు అసలు… దీపిక బట్టలు విప్పేసినట్టుగా ఎలాగూ సిగ్గూశరం వదిలేసింది… కానీ ఈ సీన్లు చూస్తే ప్రేక్షకులు ఫీలయ్యే ఏవగింపు మాటేమిటి..? మన ఖర్మకొద్దీ ఇది పాన్ ఇండియా సినిమానట… హిందీలో ఈ బేశరం పాట నంబర్ టూ ట్రెండింగ్ అట…
తెలుగులో నా నిజం రంగు అంటూ అనువధించారు పాటను… కర్ణకఠోరమైన ట్యూన్, అందులో ఎవడికీ అర్థం కాని తెలుగు పదాలు… ఎందుకు తీస్తర్ర భయ్ ఇలాంటి బేశరం సినిమాలు… చివరకు మీ సినిమాలు చూసి, ఆర్యన్ ఖాన్ వంటి మీ కొడుకులే డ్రగ్స్‌కు అలవాటై, నార్కొటిక్స్ వాళ్లకు దొరికిపోతారు… అవునూ, బేశరం రంగ్ అంటే సిగ్గులేని వర్ణం అనేనా…? అంటే సిగ్గులేనితనం అనేనా..? అవును, దీపిక, షారూక్ పాట, సినిమా పోకడ పక్కాగా బేశరం రంగ్…!!
Share this Article