ట్విట్టర్ కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ వెరిఫైడ్ అఫిషియల్ ఖాతా అని బ్లూటిక్స్ పెట్టేందుకు ఛార్జీలు ఖరారు చేశాడు కదా… మరి ఫేస్‌బుక్ వాడు ఎందుకు ఊరుకుంటాడు..? తనదీ అదే బాట… దొంగ ఖాతాల నుంచి మిమ్మల్ని రక్షించేందుకు, మీ ఖాతా వెరిఫికేషన్ జరిగినట్టు చెప్పే బ్లూ బ్యాడ్జ్ ప్రదర్శిస్తామనీ, దానికి కొంత చెల్లించాల్సి ఉంటుందని మార్క్ జుకర్ బర్గ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రకటించాడు… అయితే ప్రస్తుతం ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో మాత్రమే ప్రారంభిస్తున్నారు…
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రెండు దేశాల్లో మాత్రమే ప్రారంభిస్తున్న ఈ సౌకర్యం, పెయిడ్ ఫీచర్‌ను తరువాత అన్ని దేశాలకూ విస్తరిస్తారు… కాకపోతే మెజారిటీ ఫేక్ ఖాతాలే కాబట్టి దీన్ని స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే లాభనష్టాలను పరిశీలిస్తారు… ఒకవేళ వెరిఫైడ్ ఖాతాలను మాత్రమే కొనసాగిస్తామని ప్రకటిస్తే 60, 70 శాతం ఖాతాలు మూతపడాల్సిందే… నిజంగా అదే జరిగితే మాత్రం ఫేస్‌బుక్ కాలుష్యం గణనీయంగా, ట్రోలర్స్ బెడద మరింత గణనీయంగా తగ్గే ప్రయోజనం సమకూరుతుంది…
Ads
కాకపోతే ఈ బ్లూబ్యాడ్జికి నిర్ణయించిన ధర మాత్రం చాలా ఎక్కువ… నెట్ అయితే నెలకు 12 డాలర్లు, ఐఫోన్లయితే 15 డాలర్లు… అందుకే దీన్ని ఎంతమంది యూజ్ చేస్తారనేది కొంత అనూహ్యంగానే ఉంది… ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాడ్ కాస్ట్ ఫీచర్ ప్రవేశపెట్టారు కదా… అడ్మిన్ ఒకేసారి తన బ్రాడ్ కాస్ట్ లిస్టులో ఉన్నవాళ్లందరికీ ఒకే క్లిక్‌తో మెసేజ్ ఫార్వర్డ్ చేయవచ్చు… ఆ ఫీచర్ ద్వారా ఈ ఫేస్ బుక్ చందాల గురించి మొదట ప్రకటించారు…
ఇప్పటికే ఎవరైనా రిపోర్ట్ చేస్తే, ఆయా ఖాతాదారుల ఒరిజినాలిటీ చెక్ చేయడానికి పాస్‌పోర్టు, ఆధార్ తదితర ప్రభుత్వ ధ్రువీకరణను అడుగుతోంది ఫేస్‌బుక్… సేమ్, ఇప్పుడు కూడా అవి పరిశీలించే ‘‘వెరిఫైడ్ అఫిషియల్ అకౌంట్’’ అనే బ్లూబ్యాడ్జి ఇస్తారన్నమాట… ఇలా డబ్బులు చెల్లించేవారికి అధిక రీచ్ ఇస్తారు… భవిష్యత్తులో మెటా (ఫేస్‌బుక్) ప్రవేశపెట్టే ప్రతి ఫీచర్‌లో ప్రాధాన్యం ఉంటుంది… మరి పెయిడ్ కస్టమర్లు కదా…
ట్విట్టర్‌లో డబ్బులు చెల్లించకపోతే, డబుల్ బ్లూటిక్స్ తొలగిస్తారు… తద్వారా రీడర్స్‌కు ఏది అఫిషియలో, ఏది ఫేక్ ఖాతానో అర్థం కాదు… ఫేస్‌బుక్ మాత్రం అదేమీ చేయనంటోంది… ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాలోగానీ ఆల్‌రెడీ వెరిఫైడ్ ఖాతాలు అలాగే కొనసాగతాయట… వెరిఫైడ్ బ్యాడ్జి పొందితే ఆ ఖాతాకు క్రెడిబులిటీ అధికం అన్నమాట… ఆ ఖాతాలకు ఫోటోలుండాలి, కనీసం 18 నెలలుగా ఫేస్‌బుక్ ఉండి ఉండాలి… రియల్ నేమ్ ఉండాలి… ఆ ఫోటోలు, ఆ పేర్లు ప్రభుత్వ ధ్రువీకరణల్లో ఉన్నట్టే ఉండాలి… సో, పేర్లు లేనివి, కలం పేర్లున్నవి, ఫేక్ పేర్లున్నవి ఇకపై వెరిఫైడ్ ఖాతాలుగా ఉండవన్నమాట… ఒకసారి వెరిఫై చేస్తే ఇక పేరు, ప్రొఫైల్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో మార్చడానికి వీలుండదట…
Share this Article