అసలు సినిమా ఇండస్ట్రీలో రెండో వివాహం, మూడో వివాహం, నాలుగో వివాహం, అయిదో వివాహం అనే మాటే కామన్… ఇండస్ట్రీ అంటేనే దాని క్రెడిబులిటీ అది… పైగా నంబర్ అనేదే ఓ హాస్యాస్పదమైన మాట… అధికారికం, అనధికారికం… క్యారవాన్ వెడ్డింగులు, కాజువల్ వెడ్డింగులు, టైంపాస్ వెడ్డింగులు, వన్ నైట్ వెడ్డింగులు, టైమ్ బీయింగ్ వెడ్డింగులు, గెస్ట్ హౌస్ వెడ్డింగులు, వీకెండ్ వెడ్డింగులు, లాంగ్ డ్రైవ్ వెడ్డింగులు, చిల్ టూర్ వెడ్డింగులు, లివ్ ఇన్ వెడ్డింగులు, రిలేషన్ షిప్పులు అని చాలాచాలా రకాలు… ఇన్నిరకాల వెడ్డింగుల నడుమ ప్రభుదేవా ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది పెద్ద వార్తగా అనిపించలేదు… ఒక కమల్ హాసన్ నుంచి ఒక ప్రభుదేవా దాకా… ఛల్, అసలు ఈ పెళ్లిళ్ల నంబర్ల చర్చ బాగాలేదు, పెళ్లి చేసుకున్న మొహాలకు ఆ కొత్త బకరా, సారీ, కొత్త భార్య మొహం చూపించి, బహిరంగంగా ప్రకటించుకునే తెలివి, ధైర్యం మాత్రం లేవు… సరే, అసలు విషయంలోకి వెళ్దాం…
ప్రభుదేవా తాజాగా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు..? ఓ ఫిజియో థెరపిస్టును పెళ్లి చేసుకున్నాడు… పేరు మాత్రం బయటికొచ్చింది… ముంబైకి చెందిన హిమాని.., ఆమె ఎక్కడ పరిచయం..? ప్రభుదేవా తన కాళ్లకు, వెన్నెముకకు ఫిజియోథెరపీ చేయించుకున్నాడట… ఆ థెరపీ ప్రక్రియలో ఆమె లవ్‌లో పడిపోయిందట, రెండు నెలలపాటు కలిసి జీవించి, ఇక చివరకు పెళ్లి దాకాా ఆగకుండా వెళ్లిపోయారట… ఇవీ వినిపించే వార్తలు… అసలు ఇండస్ట్రీలో ముఖ్యులకు ఫిజియోథెరపీ చేయడం అనేదే ఓ పెద్ద రిస్క్ ఫ్యాక్టర్… ఇదుగో ఇలాగే పడిపోయే ప్రమాదం ఉంది… స్పర్శ బ్రదర్, అది చాలా డేంజర్…
Ads
అందరూ పెళ్లి, ఆమె ఎవరు అనేదే చూస్తున్నారు గానీ… ఈ వార్తల వెనుక ఓ ట్రాజెడీ ఉంది… అదేమిటీ అంటే ప్రభుదేవా చాలారోజులుగా వెన్నెముక, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు… అసలు డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ప్రభుదేవా ఎవరూ వంకపెట్టలేని తోపు… అందరూ ఇండియన్ మైఖేల్ జాక్సన్ అంటారు గానీ… చాలామంది తమిళులు మైఖేల్ జాక్సన్‌నే ఫారిన్ ప్రభుదేవా అంటారు… అంత అభిమానం… ప్రభుదేవా డాన్సుల్లోని రిథమ్, ఈజ్ మాత్రమే కాదు, తన దేహం ఓ రబ్బరు ఆబ్జెక్టులా ఎలాపడితే అలా తిరిగిపోతుంది… ఓ వ్యక్తిగా తను ఏమిటో తెలియదు గానీ… ఓ డాన్సర్‌గా మాత్రం ప్రభుదేవా తోపు… తోపున్నర… అంతే…
నాలుగైదేళ్ల క్రితం… ఏదో డాన్స్ మూమెంట్ చేస్తుంటే అకస్మాత్తుగా కిందపడిపోయాడు తను… స్పృహ కోల్పోయాడు, తను తరువాత మాట్లాడుతూ… ‘‘అకస్మాత్తుగా వెన్నెముకలో ఏదో నొప్పి, పడిపోయాను, పక్షపాతం కమ్మేసినట్టుగా… అయిదారు గంటలపాటు కండరాలు, కీళ్లల్లో విపరీతమైన నొప్పి… కాళ్లు కదల్చలేని స్థితి… మెల్లిగా తేరుకున్నాను… అందుకే చెబుతున్నా, యాక్షన్ సీన్లు గానీ, డాన్స్ సీన్లు గానీ మరీ అతిగా చేయకండి…’’ అని చెప్పుకొచ్చాడు… అంటే డాన్సుల్లో, ఫైట్లలో కాస్త ఓవర్ చేస్తే సంభవించే ప్రమాదం ఏమిటో చెప్పాడు… తను అనుభవమే అది…
ఓ డాన్సర్‌గా తన దేహం సహకరించాలి… అది ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి… ఆ డాన్సుల్లో పడతారు, లేస్తారు, వంగుతారు, పల్టీలు కొడతారు… ప్రభుదేవా తన డాన్సుల్లో అసాధారణంగా ప్రదర్శించే ఆక్రోబాటిక్సే తన కాళ్లు, కీళ్లు, వెన్నెముకకు నష్టం చేశాయా..? ఇప్పుడు దేశంలో కొందరు వందల మంది డాన్సార్లు రియాలిటీ షోల కోసం, ప్రోగ్రాముల కోసం ఎడాపెడా సర్కస్ ఫీట్లు చేస్తున్నారు… కష్టపడుతున్నారు… కొన్ని ఫీట్లు చూస్తుంటే మనకే ఒళ్లు జలదరిస్తుంది…
ఒక ప్రభుదేవా సక్సెసయ్యాడు కాబట్టి, డబ్బులున్నాయి కాబట్టి ఏవో చికిత్సలు చేయించుకుంటున్నాడు, చికిత్సకారిణికే లైనేసి పెళ్లి కూడా చేసుకుంటున్నాడు… జీవితాంతమూ ఫిజియో థెరపీకి ఢోకాలేదు… అందరికీ అలా కుదురదు కదా… సో, ఆక్రోబాటిక్ డాన్సర్లూ బహుపరాక్… కాళ్లూకీళ్లూ సాఫయితే తరువాత ఆదుకునేవాడెవడూ ఉండడు… బీకేర్ ఫుల్… టీవీ రియాలిటీ షోల నిర్మాతలు, ప్రోగ్రాం మేనేజర్లు అగ్రిమెంటుకు మించి రూపాయి కూడా ఇవ్వరు… అందరికీ హిమాని వంటి ఫిజియోథెరపిస్టులు కూడా దొరకరు… జాగ్రత్త…
Share this Article