అప్పట్లో వుడ్ వర్డ్స్ వారి యాడ్… పాప ఏడ్చింది… సేమ్ అలాగే అప్పుడప్పుడూ హఠాత్తుగా ‘అనసూయ ఏడ్చింది’ అనే వ్యాఖ్య, ఫోటోలు, వీడియోలు వైరల్ అయిపోతయ్… సోషల్ మీడియా మీద తన మీద కామెంట్స్ చేసేవాళ్లపై అప్పుడే ఉరుముతుంది, కేసులు పెడతానురోయ్ అని బెదిరిస్తుంది… తిట్టేస్తుంది… మరేదో కారణంతో అకస్మాత్తుగా బోరుమంటుంది… చిత్రమైన మెంటాలిటీ…
చివరకు తనను ఆంటీ అని పిలిచినా సహించదు… తనే రంగమ్మత్త పాత్రను బోలెడు ఇష్టపడుతుంది… ఆ పాత్ర మీద ప్రేమతో అనసూయ ఆంటీ అని ప్రేమగా పిలిస్తే తిట్టిపోస్తుంది… సరే, మొన్న బోరుమని ఏడుస్తూ తనే ఓ వీడియో పెట్టింది తన ఇన్‌స్టా ఖాతాలో… ఒకరిద్దరు వ్యంగ్యంగా జాలి వచనాలు కామెంట్స్‌లో పెట్టారు గానీ, చాలామంది నెగెటివ్‌గానే తీసుకున్నారు… దాంతో అనసూయ షాక్…
Ads
సోషల్ మీడియాలో తన పట్ల కనిపించే నెగెటివిటీ తలుచుకుని ఏడుస్తుందని చాలామంది అభిప్రాయపడ్డారు… మళ్లీ ఏమైంది బంగారం అని ఒకరిద్దరు జాలి కూడా చూపించారు… భార్యాభర్తల నడుమ ఏదైనా సీరియస్ గొడవా అని కొందరు అడిగారు… తను అనుకున్నది ఏమిటో, ఈ స్పందనలు ఏమిటో అనసూయకు అర్థం కాలేదు… క్లారిటీ కోసం తన భర్త భరధ్వాజతో దిగిన ఫోటోను పెట్టింది… మేం బాగానే ఉన్నాం, లేనిపోనివి ఊహించుకోకండి అని చెబుతున్నట్టుగా…
తరువాత మరో పోస్టు పెడుతూ… సోషల్ మీడియాలో నెగెటివిటీ పట్ల తనకు కోపం వస్తుంది గానీ ఏడుపు ఎందుకు వస్తుందని ప్రశ్నించింది… తన ఇంట్లో ఓ విషాదాన్ని తలుచుకుంటే ఏడుపొచ్చిందని నేరుగా చెప్పకుండా ఏవేవో శుష్క ప్రవచనాలకు దిగింది… పోస్ట్ పెట్టాక ఓసారి తనే తిరిగి చదువుకుంటే బాగుండేది, ఎవరికీ అర్థం కాని వివరణలు, వ్యాఖ్యలు, స్పష్టీకరణలు… జనం నవ్వుకుని ఇక వదిలేశారు… నిజానికి ఏం జరిగిందంటే..?
అనసూయ ఇంట్లో మూడు మాట్లాడే పిట్టలు ఉండేవి… మకావ్ పిట్టలు… అందులో ఒకటి చనిపోయింది… వాటితో అనసూయకు మంచి అనుబంధం ఉంది… అందుకే దుఖంతో ఇన్‌స్టా పోస్ట్ పెట్టింది… ఈమాత్రం దానికి అంత పెద్ద ఏడుపు పోస్ట్ అవసరమా అని తేలికగా తీసిపారేయకండి… పెంపుడు జీవాలతో బంధం కొందరికి గాఢంగానే ఉంటుంది… ఈ నష్టానికి తోడు మిగిలిన రెండు మకావ్స్ కూడా ఎగిరిపోయాయట… అదే అధిక దుఖానికి కారణమని తాజా సమాచారం… ఊకో ఊకో ఆంటీ అనాలని ఉందా..? నో, ఆమెకు నచ్చని ఏకైక ఇంగ్లిష్ పదం… ఆంటీ… తరువాత మీ ఇష్టం…!!
Share this Article