.
ఒక వార్త… రాకాస అనే ఓ సినిమాను ప్రొడ్యూస్ చేసింది నాగబాబు బిడ్డ నీహారిక… అంతకుముందు కమిటీ కుర్రాళ్లు తీసింది, వెబ్ సీరీస్ తీస్తోంది, టీవీ రియాలిటీ షోస్ నిర్మిస్తోంది… మొత్తానికి తను ప్రొడ్యూసర్‌గా బిజీ… గుడ్, మహిళా దర్శకులు, నిర్మాతలు రావాలి… ఇండస్ట్రీలో వైవిధ్యం కూడా రావాలి…
ఈ సినిమాకు మానసశర్మ దర్శకురాలు… పర్లేదు, మెరిట్ ఉందామెకు… ఈమె దర్శకత్వంలో, నీహారిక నిర్మాతగా 25 కోట్ల బడ్జెట్‌తో సుడిగాలి సుధీర్ హీరోగా ఓ సినిమా రాబోతోందనేది ఆ వార్త సారాంశం… అదీ మంచిదే… నిజానికి సుధీర్ తెలుగు టీవీకి సంబంధించి సూపర్ స్టార్…
Ads
తను మంచి పర్‌ఫార్మర్… కామెడీ, డాన్స్, యాక్షన్ అన్నీ ఇరగ్గొట్టేస్తాడు… ఇప్పుడు యాంకర్‌గా కూడా పాపులర్ అయిపోయాడు… కానీ సినిమాల్లో క్లిక్ కాలేకపోతున్నాడు తను… అదేదో గోట్ అనే సినిమా ఎంతోకాలంగా వాయిదా పడుతూనే ఉన్నట్టుంది… ఏమో, ఇలా వచ్చి అలా వెళ్లిపోయిందేమో కూడా తెలియదు…
నిజంగానే నీహారిక గనుక ఓ సినిమా చాన్స్ ఇస్తే మంచిదే… ఐతే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి… నీహారిక జీతెలుగులో ఆట అనే ఓ డాన్స్ రియాలిటీ షో నిర్మిస్తోంది, తను జడ్జి కూడా… రాధిక, రఘు మాస్టర్ కూడా జడ్జిలు… సమీరా, కావ్య, చంటి, విష్ణుప్రియ టీమ్ లీడర్స్… పర్లేదు, డాన్సుల నడుమ కామెడీ స్కిట్స్ బాగా పేలుతున్నయ్, సరదాగా ఉన్నయ్…
ఐతే ఓసారి ఓ వీడియో చూస్తే సుధీర్‌ను చూసి జాలేసింది… మరీ నీహారిక రేయ్, థూ, రా అంటోంది తనను… అదేమిటి..? తనేమో నీహారిక గారు అంటుంటాడు… ఏనాటి నుంచో నాగబాబుతో అనుబంధం ఉంది సుధీర్‌కు… పిఠాపురం పవన్ కల్యాణ్ ప్రచారానికి కూడా హైపర్ ఆదితో కలిసి వెళ్లినట్టున్నాడు కూడా… తను మెగా ఫ్యాన్…
ఐనంతమాత్రాన మరీ రేయ్, రా అనేంత చనువు ఉందా ఆమెకు..? లేక ఓరకమైన ఆధిపత్యం, జమీందారీ పోకడా..? బాగనిపించలేదు… ఒకవేళ ఇద్దరి నడుమ మంచి చనువున్నా సరే, అది సేమ్, అంటే ఈక్వల్ స్టేటస్‌లో కనిపించాలి తప్ప, ఆమె స్వారీ చేస్తున్నట్టుగా కనిపించకూడదు కదా షోలో… నాగాబాబు వేరు, తను ఏజ్‌లో పెద్దవాడు… రేయ్ అని పిలిచినా ఎబ్బెట్టుగా, అవమానించినట్టుగా ఉండదు…
ఎస్, చాలా షోలలో సుధీర్ మీద పంచులు వేయిస్తుంటారు స్క్రిప్ట్ రైటర్స్… చివరకు చిన్న పిల్లలతో కూడా వేయించారు… అన్నీ తను స్వీకరిస్తాడు, పెద్ద ఇగోకు పోడు, నెగెటివ్‌గా తీసుకోడు, వినోదం పండితే చాలు అనుకునే డౌన్ టు ఎర్త్ కేరక్టర్ తను… రేర్ క్వాలిటీ… ఐనా మరీ థూ, రేయ్, రా … బాగనిపించలేదు సుధీర్…
Share this Article