Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సో, మంగ్లీ తమ్ముడికీ మైక్రో ఫైనాన్స్‌ లావాదేవీలతో లింక్స్..!

May 1, 2026 by M S R

.

దాదాపు ప్రతి మీడియా ఇక అనివార్యంగా సింగర్ మంగ్లి మైక్రో ఫైనాన్స్ కేసు మీద రాయకతప్పడం లేదు… నేను ఏ పాపమూ ఎరుగను, నా తమ్ముడి మొహం చూడండి, ఎవరినైనా మోసం చేసే ఫేసేనా ఇది, నా గురించి మీకు తెలియదా, ఏవో నాలుగు పాటలు పాడటమే జీవితం అంటూ మంగ్లీ ఏం వివరణలు ఇచ్చుకుంటున్నా సరే… సదరు మైక్రో ఫైనాన్స్ విషయంలో రోజురోజుకూ ఇంకా బదనాం అవుతూనే ఉంది…

కాకపోతే ఆమె లీగల్లీ సేఫ్… ఎందుకంటే, ఎక్కడా ఆమె ప్రత్యక్ష జోక్యం ఉండదు కాబట్టి… దానికి ఆధారాలూ ఉండవు కాబట్టి… ఆ ఫైనాన్స్ బాదితులు కూడా కొన్ని తండాల గిరిజనమే కాబట్టి ఆమె ఎస్టీ విక్టిమ్ కార్డు తీసినా ప్రయోజనం ఉండదు కూడా… నా తమ్ముడు అమాయకుడు, ఏ మాయామర్మం తెలియనివాడు అని తమ్ముడిని వెనకేసుకొస్తోంది కదా… మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది కదా…

Ads

కానీ ఆ తమ్ముడి ఖాతాలోకి మైక్రో ఫైనాన్స్ కేసు, శుభక్షేత్ర రియల్ ఎస్టేట్ అసలు నిందితుడు రమావత్ మధు బ్యాంకు ఖాతాల నుంచి మంగ్లీ తమ్ముడు శివ ఖాతాలకు భారీగా డబ్బు జమయినట్టు, వెంటనే డబ్బులు కూడా డ్రా చేసుకున్నట్టు సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం (ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌-ఈవోడబ్ల్యూ) పోలీసుల దర్యాప్తు చెబుతోంది… అంటే శివను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నమాట…

పైగా మధు పదే పదే అడిగితే ఓసారి తన గ్రూపుతో తనింటికి భోజనానికి వెళ్లాననీ, అదే నేను చేసిన అపరాధం అంటోంది ఆమె… కాదు, ఆ మేరకు స్వల్ప పరిచయం కాదు, ఆ పరిచయానికి ఆమె తమ్ముడికి అంతగా డబ్బు ఇస్తాడా మధు… సో, పోలీసులు ఇంకా లోతుల్లోకి వెళ్తే ఇంకెన్ని నిజాలు బయటపడతాయో…

కాకపోతే ఇక్కడ పెద్ద ప్రశ్నార్థకం ఏమిటంటే..? బాధితులుగా చెప్పబడుతున్న కుటుంబాలన్నీ పేదవే… మరి 100 కోట్ల మేరకు ఎలా మోసం జరిగినట్టు..? ఎవరికి వారే కోట్లు తెచ్చి, అప్పు తెచ్చి ఇచ్చామంటున్నారు… అంత సీన్ ఉందా..? అంతా ఏదో మిస్టరీ… మధు ఖాతాల్ని ఫ్రీజ్ చేసిన పోలీసులు శివ, మధు, మరొకరిద్దరి బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరిస్తున్నారు… మంగ్లీ ఖాతాల లావాదేవీలనూ తవ్వుతారేమో బహుశా… ఏమైనా అనుమానాస్పద లావాదేవీలు గనుక బయటపడితే మంగ్లీ మరింత కూరుకుపోతుంది… లీగల్‌గా కూడా..!!

తాజాగా బయటపడుతున్న నిజాలన్నీ ఏం చెబుతున్నాయి..? మంగ్లీ బయటికి చెప్పేది వేరు- నిజాలు వేరు అని..! దీంతో ఆమె మీద నెగెటివిటీ ఇంకా ఇంకా పెరుగుతోంది… చివరకు టాలీవుడ్ ఆమెపై నిషేధం పెట్టాలనే డిమాండ్ల దాకా…!! లేదు, లేదు, నన్ను అకారణంగా వేధిస్తున్నారు, ఏదేదో రాసేస్తున్నారు అనుకునే పక్షంలో ఆమె ఓ పని చేయొచ్చు… తన మీద ఏ దురుద్దేశకథనాలు రాయవద్దని ఆషురెడ్డి కోర్టు నుంచి 33 మీడియా సంస్థల మీద ఆంక్షల ఆర్డర్ తెచ్చుకుంది..!! సో, మంగ్లీకి కూడా మార్గముంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సో, మంగ్లీ తమ్ముడికీ మైక్రో ఫైనాన్స్‌ లావాదేవీలతో లింక్స్..!
  • కత్తి మీ చేతుల్లోనే ఉంది కిషన్ సాబ్… యుద్ధమే మీకు ఇష్టం లేదు…
  • బెంగాల్ రిజల్ట్..! యాక్సిస్‌తోపాటు సట్టాబజార్ కూడా హేండ్సప్..!!
  • గ్రేట్ నికోబార్…! ఇక ‘ఆ మూక’ మొత్తం దీనిపై పడి ఏడుస్తోంది..!!
  • సుడిగాలి సుధీర్… తనను రేయ్, రా, థూ అనడం సమంజసమేనా…
  • ఓహ్… ఆషురెడ్డి కథ- వ్యథ ఇదా..? లండన్ సాఫ్ట్‌వేరుడే అసలు దోషి..!!
  • హన్మంతన్నా… అంతా నిమ్మళమేనా… మంచి గుర్తింపు ఇచ్చిండు సీఎం…
  • ఒకరు ఐపీఎస్… మరొకరు ఐఐటీ… కొత్త డీజీపీ కుటుంబ నేపథ్యం…
  • హహహ…! బిడ్డింటికి దారేది..? స్పూఫ్… నవ్వు ఆపుకుంటున్నవ్ కదరా..!!
  • గెలిచిన గుజరాత్ పైకి ఎక్కలేదు… ఓడిన బెంగుళూరు దిగిపోలేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions