ఆదివారం… రాత్రి 9 గంటల సమయం… టీవీలకు అతి కీలకమైన ప్రైమ్ టైమ్… యాడ్స్ ఎక్కువ, రీచ్ ఎక్కువ, వీక్షకులు ఎక్కువ… అందుకని ఆ గోల్డెన్ టైమ్ వేస్ట్ చేసుకోవు ఏ టీవీ అయినా… ఏదైనా మంచి ప్రోగ్రాంతో రేటింగ్స్ పొందే ప్రయత్నం చేస్తుంది… మాటీవీ వాడు ఓంకార్ నిర్వహించే డాన్స్ ప్లస్ షోకు విపరీతమైన ప్రాధాన్యమిచ్చి, ఆ టైమ్‌లో ప్రసారం చేస్తున్నాడు… ఆరుగురు జడ్జిల ఓవరాక్షన్ ప్లస్ ఓంకార్ అనే చీఫ్ జస్టిస్ ఆ షోను ఎలా భ్రష్టుపట్టించారో మొన్నామధ్య చెప్పుకున్నాం కదా… మొన్న రేటింగ్స్ చూస్తే మరీ 5.6 మాత్రమే… అంటే మాటీవీ వాడు ఆశించిన రిజల్ట్ గోవిందా… ఎందుకు చతికిలపడుతోంది..? జనాన్ని ఆకట్టుకోవడంలో ఎందుకు ఫెయిలవుతోంది… మచ్చుకు నిన్న ప్రసారం చేసిన షో గురించి చెప్పాలి… ఎందుకు చెప్పాలంటే ఓంకార్ వంటి యాంకర్లు, నిర్మాతలు ఏదేదో క్రియేటివ్ చెత్తను మన ప్రేక్షకుల మెదళ్లకు ఎక్కిస్తున్నారు కాబట్టి… ప్రేక్షకుల్ని పిచ్చోళ్లుగా భావిస్తున్నారు కాబట్టి…
మేఘన, ఇంద్రనీల్ టీవీ యాక్టర్లు… అతను ఆరున్నర అడుగుల భారీ విగ్రహం… ఆమె స్థూలకాయురాలు… పర్లేదు, వాళ్ల దేహాల మీద మనం ఏమీ ప్లస్, మైనస్ మార్కులేయడం లేదు… కానీ ఆమెతో మరీ మోహిని వేషం వేయించి, డాన్స్ చేయించడం మరీ ఆడ్‌గా ఉంది… అందుకేనేమో ఏ ప్రోమోలోనూ దీన్ని చూపించకుండా జాగ్రత్తపడ్డారు… భస్మాసురుడిగా ఇంద్రనీల్ ఆకారం సరిపోయింది.,. కానీ మరీ మేఘనతో మోహిని వేషం ఏమిటయ్యా ఓంకారూ..? నవ్వొచ్చే విషయం ఏమిటంటే..? దీనికి యశ్ అనే డాన్సర్ జడ్జి వెళ్లి ఇంద్రనీల్‌కు కౌగిలించుకుని, ఇలాంటి పర్ఫామెన్స్ నభూతో అన్నట్టుగా కలరివ్వడం… ఇదే, ఈ ఓవరాక్షన్లే మొత్తం షోను భ్రష్టుపట్టిస్తున్నయ్… డాన్స్ విత్ సెలెబ్ అనేది కొత్త కాన్సెప్టే కావచ్చు, కానీ అది అలరించాలి… కార్తీకదీపం పిల్లలు సౌర్య, హిమలతో చేయించిన డాన్సులు బాగున్నయ్… ముద్దొచ్చారు పిల్లలు… అలాగే మెహబూబ్‌తో కలిసి స్టెప్పులేసింది జియా అనే పిల్ల… అదరగొట్టేసింది…
Ads
ప్రేక్షకులకు బాగా నవ్వొచ్చింది ఏమిటంటే..? చంద్రముఖి డాన్స్… ఇద్దరు చంద్రముఖులను పెట్టారు, ఒక మగ డాన్సర్… ఇదేం క్రియేటివ్ ఐడియానో తెలియదు… పైగా వాళ్లు చేసిన డాన్సులు కూడా నాసిరకం… పోనీ, తెలుగు పాట పెట్టి ఏడవొచ్చుగా… అదీ చేతకాదు… మొత్తానికి ఓంకార్ టీంను చూసి బాగా జాలిపడిన డాన్స్ స్కిట్ ఇది… ఇక బిగ్‌బాస్ హారిక ఓ ప్రొఫెషనల్ డాన్సర్ స్థాయిలో పర్ఫామ్ చేసింది… తను మంచి డాన్సర్… విచిత్రం ఏమిటంటే..? దానికి ముమైత్ నెగెటివ్ జడ్జిమెంట్… హహహ… హారిక కూడా మనసులో ఇలాగే నవ్వుకుని, ఇలాంటివి ఎన్నో బాగోతాలు బిగ్‌బాస్ హౌజులో చూశాంలే అనుకుని, లైట్ తీసుకుంది… వచ్చామా, పర్ఫామ్ చేశామా, అంతే అనేసింది… ముమైత్ మొహం మాడిపోయింది… పెద్ద రిలీఫ్ ఏమిటంటే… ఈ ఎపిసోడ్లో యశ్, తన భార్య కామెడీ డ్రామాను పెట్టలేదు… సో, చెప్పొచ్చేదేమిటీ అంటే..? ఈ షోకు 5.6 రేటింగ్స్ రావడం కూడా ఎక్కువే… ఈటీవీలో అలవోకగా… ఏ పెద్ద హంగామా లేకుండా చేస్తున్న ఢీ షోకు 6.7 రేటింగ్స్ దక్కాయి… అంటే తేడా అర్థమవుతోందా ఓంకార్ భయ్యా..?!
Share this Article