గుండెకాయ ఆగింది…
మెదడు చిట్లింది…
కిడ్నీ, లివర్ ఫెయిలైనయ్…
Ads
కాళ్ళు, చేతులు విరిగినయ్…
బ్లడ్ కాన్సర్…
మిగతా అంతా బాగుంది…!!
***************
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తాల్సిన మొత్తం 200 టిఎంసి నీటిలో 180 టిఎంసి లు ఎత్తాల్సింది మేడిగడ్డ నుండే…
మిగతా 20 టిఎంసి లు గత ప్రభుత్వాలు కట్టిన ఎల్లంపల్లి రిజర్వాయర్ నుండి…
డిపిఆర్ (DPR-Detailed Project Report) లో చెప్పిందిదే…
అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో రావాల్సిన మొత్తం నీటిలో 90 శాతం మేడిగడ్డ నుండే ఎత్తాలి…
మేడిగడ్డ పక్కనే కాళేశ్వరం గుడి ఉంటది…అందుకే మొత్తం ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు అని పేరు వచ్చింది…
*******************
ప్రభుత్వం మేడిగడ్డను కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అంటూ చెబుతూ వచ్చింది…
నిన్నటివరకూ చెప్పిందిదే…
ఇప్పుడు మేడిగడ్డ కుంగడంతో మాట మారుస్తున్నారు…
కాళేశ్వరం అంటే “అదో పెద్ద వ్యవస్థ” అంటూ జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నరు…
******************
కేవలం రెండు పిల్లర్లు కుంగినయని చెబుతున్నరు…
అంతకు ముందు 11 పిల్లర్లను తీస్తే సరిపోతదని చెప్పిన్రు…
రోజుకో మాట…
వాస్తవానికి ఈ రెండు పిల్లర్లతో పాటు మేడిగడ్డలో మొత్తం 85 పిల్లర్లు నిలబడిఉన్నది ఒకే శ్లాబు (Raft) పైన…
ఈ శ్లాబు మొత్తం ఒకేసారి ఒకే నిర్మాణంగా (Monolithic) వేశారు…శ్లాబు కుంగకుండా ఈ పిల్లర్లు కుంగవు…
శ్లాబు కుంగిందంటే మొత్తం పిల్లర్లకు ప్రమాదం ఉన్నట్టే…
*******************
అందుకే మొత్తం బ్యారేజీకే ప్రమాదం ఉందని కేంద్ర నిపుణుల బృందం తేల్చింది…
మేడిగడ్డ ప్రమాదం ఆషామాషీ కాదు…ఇది ప్లానింగు…డిజైను…నిర్మాణము…నాణ్యతా…నిర్వహణ లోపాలన్నీ కలిసి ఈ ప్రమాదం జరిగిందని కేంద్ర నిపుణుల బృందం తేల్చింది…
ప్రమాదం కేవలం మేడిగడ్డకే కాదు… మేడిగడ్డలాగే డిజైన్ చేసి నిర్మాణం చేసిన అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు కూడా ప్రమాదం ముంచి ఉన్నదని కేంద్ర బృందం తేల్చింది…
అంటే గోదావరిపై కాళేశ్వరంలో భాగంగా కొత్తగా కట్టిన అన్నిబ్యారేజీలకు ప్రమాదం తప్పదన్న మాట…
********************
ప్రమాదం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకేనా….?
లక్షకోట్లు గుమ్మరించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ నాలుగేళ్లలో జరిగిన ప్రమాదాలు చూడండి…
1. మేడిగడ్డ పంప్ హౌజ్ మునిగింది…ఇప్పటికీ 9 పంపులు తుక్కుగానే ఉన్నాయి…
2. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కాలువలు ఏటా కూలుతూనే ఉన్నాయ్…
3.అన్నారం పంప్ హౌజ్ మునిగింది…
4. సుందిళ్ళ బ్యారేజీ కట్టలు తెగినయ్…
5. మేడారం పంప్ హౌజులు క్రాకులిచ్చినయ్…
6. రామడుగు సొరంగాలు కూలినయ్…
7. మిడ్ మానేరు డ్యామ్ కుంగింది…
8. కొండపోచమ్మ రిజర్వాయర్ కు రంద్రాలు పడ్డయ్…
9. మల్లన్నసాగర్ కాలువకు బొక్కలు పడ్డయ్… పందికొక్కులు ఈ బొక్కలు పెట్టినయని సమర్దించుకున్నరు…
10. ఎక్కడికక్కడ పంపు హౌజులకు, సొరంగాలకు, కాలువలకు పెచ్చులూడు తున్నయ్…
11. ఇప్పుడు అసలైన మేడిగడ్డ బ్యారేజి కూడా కుంగింది…!
12. అన్నారం బ్యారేజీ కింద బుంగలొచ్చినయ్…!!
*****************
100 ఏళ్ళు ఉండాల్సిన ప్రాజెక్టుకు… 4 ఏళ్లకే వందేళ్లు నిండినయ్…ఖర్మ…!
ఇది కాళేశ్వరం కాదు…! నిజంగానే తెలంగాణ పాలిట శనీశ్వరం…!!……… తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజేఏసి)
Share this Article