దావూద్ ఇబ్రహీం… భారత జాతి యావత్తూ ఛీత్కరించే పేరు… 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి… ఓసారి మన గుప్తదళం పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసింది, పలువురు ఇజ్రాయిలీ ఏజెంట్లతో ఒప్పందం… పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందిన దావూద్ ఏ టైమ్‌లో ఎటు పోతాడు, ఏ దారిన పోతాడు స్కెచ్ రెడీ… గురితప్పని షూటర్లు రహస్య స్థలాల్లో పొజిషన్ తీసుకున్నారు… దావూద్ గన్ పాయింట్‌లోకి వచ్చిన మరుక్షణం తూటాలు ఆ దేహాన్ని జల్లెడ చేయాలి… ముంబై మృతుల ఆత్మలు, ఆ కుటుంబాలు శాంతించాలి…
కొన్ని నిమిషాల్లో ఆపరేషన్ ఖతమయ్యే సమయానికి… ఇండియా నుంచి ఫోన్లు, అర్జెంటుగా ఆ ఆపరేషన్ ఆపేయాలని… అలా దావూద్ బచాయించాడు… వాడిని కాపాడింది ఎవరు..? పాఠకుల ఊహకే వదిలేస్తాను… మన దేశ గూఢచార విభాగాన్నే ధ్వంసం చేయజూసిన వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా నెత్తిన మోసిన జాతి మనది… సరే, వర్తమానానికి వద్దాం…
ఎక్కడెక్కడో ఉన్న భారత వ్యతిరేక శక్తులు నేలకొరుగుతున్నయ్… అందరినీ హడలెత్తించే ఉగ్రవాదులు భయంతో గడగడా వణికిపోతున్నారు… కెనడాలో ఓ ఖలిస్థానీ ఉగ్రవాది కావచ్చు, పాకిస్థాన్‌లో ఉన్న ఓ లష్కరే ఉగ్రవాదనేత కావచ్చు… ఈ రెండు నెలల్లో కనీసం 20 మంది… ఎవరో వస్తారు, కాల్పులు జరుపుతారు, పర్‌ఫెక్ట్ గురి… తప్పించుకునే చాన్సే లేదు… వాళ్ల మరణాల మీద ప్రపంచంలో ఎవడికీ సానుభూతి లేదు… ఒక్క కెనడా ప్రధానికి తప్ప… వాడి పదవికి ఖలిస్థానీ శక్తుల మద్దతు కావాలి కాబట్టి…
Ads
ఇన్నాళ్లూ ఓ విమర్శ ఉండేది… అంత తోపు, తురుము అని చెప్పుకునే ఇండియన్ జేమ్స్‌బాండ్ అజిత్ దోవల్ ఏం చేస్తున్నాడు..? పదేళ్లుగా మన రక్షణ, విదేశాంగం, అంతర్గత భద్రత, నిఘా, గూఢచార వ్యవస్థలన్నీ శాసిస్తున్నాడు కదా… మరి దావూద్ వంటి కేరక్టర్లు ఎందుకు ఇంకా భూమ్మీద బతికే ఉన్నారు అని…!! నిజంగానే అజిత్ దోవల్‌లో వర్గకసి లోపించిందా..? సామర్థ్యమే క్షీణించిందా..? ఇప్పుడు ఆ విమర్శలకు జవాబులు కనిపిస్తున్నాయా..?
రెండురోజుల క్రితం కరాచీలో దావూద్ ఆహారంలో విషం కలపబడింది… హాస్పిటల్‌లో చావుబతుకుల్లో ఉన్నాడు… ఏమో, వాడు అంత ఈజీగా మరణిస్తాడా..? ఖతమారిపోయాడని కొందరు ట్వీట్లు పెడుతున్నారు… రెండురోజుల క్రితమే ఈ వార్తను పలు ఇంటర్నేషనల్ న్యూస్ సైట్లు రాశాయి… ఈరోజు ఉదయం నుంచి మన మెయిన్ స్ట్రీమ్ సైట్లు కూడా రాస్తున్నాయి… (అఫ్‌కోర్స్, మన తెలుగు మీడియాకు ఇవేవీ పట్టవు… ఏవో నాలుగు పొలిటికల్ వాంతుల్ని పబ్లిష్ చేసుకుంటే సరి…) (ఎవరో యూట్యూబర్ ఈ రూమర్లను సృష్టించాడే తప్ప విషప్రయోగం వార్తల్లో నిజం లేదని కూడా ఇప్పుడు కథనాలు స్టార్టయ్యాయి…)
(తరువాత ఇది ఫేక్ అకవుంట్ అని తేలిందట)
భారత్‌లో అనేక ఉగ్రచర్యలకు పాల్పడి పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న చాలామంది హతమారిపోతున్న నేపథ్యంలో దావూద్ మీద హత్యాప్రయత్నం పెద్ద విశేషంగా కనిపించకపోవచ్చు… కానీ సగటు ఇండియన్ సంబరపడే వార్త… ఖతం చేస్తున్న ఆ అజ్ఙాత వ్యక్తులు ఎవరైనా కావచ్చుగాక… కానీ ఇండియాకు మేలు చేస్తున్నారు… ఓవైపు ఆర్టికల్ 370 రద్దు తరువాత కాశ్మీర్‌లో చాలామంది రాజకీయ నాయకులు, ఉగ్రవాద సానుభూతిపరుల వెన్నులు విరిగాయి… ఐఎస్ఐకి కూడా ఒకవైపు తాలిబన్లు, మరోవైపు బెలూచిస్తాన్ పోరాటవీరులు దంచి కొడుతున్నారు…
మరోవైపు ఈ అజ్ఞాత దాడులు సరేసరి… ఏమిటో గానీ… తెర వెనుక పెద్ద రహస్య ఆపరేషన్ ఒకటి పర్‌ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతున్నట్టే ఉంది..!! ప్రతి చిన్న విషయంలోనూ ఇండియా వ్యతిరేక శక్తులకు ఉపయోగపడేలా రచ్చ చేసే కమ్యూనిస్టులు గానీ, అపరిణత రాహుల్ గాంధీ గానీ… మమత, స్టాలిన్, ముఫ్తి, ఫరూఖ్ వంటి లీడర్లు గానీ ఎందుకో సంయమనం పాటిస్తున్నారు… శుభం… (దావూద్ అనుకూల గ్యాంగ్‌స్టర్లతో మహారాష్ట్రలో శివసేన లీడర్లు డాన్సులు, సంబరాల్లో పాలుపంచుకుంటున్నారనే వార్తలు ఓ వైచిత్రి… ఒకప్పటి శివసేనకూ ఇప్పటికీ ఎంత తేడా…)
Share this Article