కాసేపు సంక్రాంతి సినిమాల్ని మరిచిపోదాం… తెలుగు సినిమా మాఫియా మొహం మాడిపోయేలా… హనుమాన్ డిస్టింక్షన్, గుంటూరుకారం జస్ట్, సెకండ్ క్లాస్, నాసామిరంగ జస్ట్, పాస్, సైంధవ్ ఫెయిల్… గుంటూరుకారం వసూళ్ల లెక్కల్ని ఎవడూ నమ్మడం లేదు సరికదా ఇప్పుడు ఆ సినిమా వేసిన థియేటర్లన్నీ హనుమాన్ వైపు మళ్లుతున్నయ్… ఈ వారం హనుమాన్ అనేక రికార్డుల్ని క్రియేట్ చేయబోతోంది… హనుమంతుడి గద దెబ్బకు లంక పిశాచాలన్నీ సైలెంట్…
రాబోయే రోజుల్లో మళ్లీ ఈ రచ్చ కొంత తప్పదు, మాకు సోలో రిలీజ్ అని చెబితేనే మేం సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నాం, మరి ఇప్పుడు మాకు పోటీ సినిమాలు వస్తున్నాయేంటి అని ఈగల్ నిర్మాతలు లబోదిబో… ఇక రాబోయే వారాల్లో ఈ థియేటర్ల సర్దుబాటు సమస్యాత్మకంగా మారబోతోంది… ఈ గుత్తాధిపత్య ధోరణులకు ప్రభుత్వమే ఓ కొరడా పట్టుకుని పరిష్కారం చూపాలనే వాదనలకు క్రమేపీ బలం పెరుగుతోంది… ఇంకోవైపు రెండు రాజకీయ చిత్రాల మీద కూడా ఆల్‌రెడీ ఫిలిమ్ సర్కిళ్లలో చర్చ ప్రారంభమైంది…
ఆల్‌రెడీ ఒక రచ్చ సాగుతూనే ఉంది… అది రాంగోపాలవర్మ జగన్ కోసం తీసిన వ్యూహం సినిమా… సెన్సార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా సరే, కోర్టు బ్రేకులు వేసింది… రిలీజ్ కానివ్వబోమని తెలుగుదేశం పంతం చూపిస్తోంది… ఆర్జీవీ ఆఫీసు ఎదుట ఆందోళనలూ చేసింది… వాళ్ల లక్కు కొద్దీ వాళ్ల పట్ల సానుభూతితో ఉండే ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో… జగన్ అంటే పడని కాంగ్రెస్ ప్రభుత్వం… రేవంత్ ప్రభుత్వం…
Ads
సరే, కోర్టు ఏం చెబుతుందో చూడాలి… మొత్తానికి దీని మీద ఏర్పడిన కాసింత ఆసక్తి కూడా ఇప్పుడు అందరికీ సన్నగిల్లింది, పైగా ఆర్జీవీ తీసే రాజకీయ చిత్రాల మీద ఎవరికీ సదభిప్రాయాలు కూడా లేవు… ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు, అనవసరంగా జగన్ క్యాంపు ఈ సినిమాలు తీయించింది… తను ఇంతకుముందు లక్ష్మిపార్వతి పేరిట తీసిన సినిమా గానీ, కొండా మురళి బయోపిక్ గానీ డిజాస్టర్లు కదా… వ్యూహం సినిమాకు శపథం అనే రెండో పార్టు అనగా సీక్వెల్ ఉన్నట్టు కూడా ఆర్జీవీ చెప్పాడు కదా… దీనికే దిక్కూదివాణం లేదు, ఇక దాని గురించి ఇప్పుడు చర్చే లేదు…
ఫిబ్రవరిలోనే యాత్ర-2 రాబోతోంది… కాదు, రానున్నట్టు టీం ప్రకటించింది… ఇదీ జగన్ కోసం తీయబడిన సినిమాయే… యాత్ర ఫస్ట్ పార్ట్ వైఎస్ పాదయాత్ర మీద తీసింది… హిట్… మమ్ముట్టి సటిల్డ్ యాక్షన్, పాదయాత్ర చుట్టూ కథ పరిమితం కావడం ఎట్సెట్రా దానికి అనుకూలించాయి… ఇప్పుడు యాత్ర-2… ఇది 2004 నుంచి 2019 వరకు జగన్ ప్రస్థానం మీద సినిమా…
అంటే… ఆ కథలో జగన్ జైలు, సోనియా కొరడా, కేసులు, జేడీ లక్ష్మినారాయణ ఓవరాక్షన్, టీడీపీ ఇన్‌ప్లీడ్ ఎట్సెట్రా అంశాలు ఉండాల్సిందే… అవి లేకుండా ఆ సినిమా కథ కష్టం… అంటే… చంద్రబాబు ఒక విలన్, సోనియా మెయిన్ విలన్… కథ ప్రకారం అంతే కదా… మరి సోనియా పట్ల విధేయంగా ఉండే రేవంత్ రెడ్డి సర్కారు ఈ సినిమా రిలీజుకు వోకే అంటుందా..? అదీ రాబోయే లోకసభ ఎన్నికల నేపథ్యంలో, 14 సీట్లు ఆశిస్తున్న తెలంగాణలో సోనియాను విలన్‌గా చూపే ఆ సినిమా పట్ల రేవంత్ సర్కారు ఎలా వ్యవహరిస్తుందో చూడాలి…
ఏపీలో జగన్ సర్కారు ఉంది, యాత్ర-2 సినిమాకు గ్రీన్ కార్పెట్… కానీ వ్యూహానికి అడ్డుపడిన చంద్రబాబు యాత్ర-2 కు అడ్డుపడటం ఖాయం… ఎన్నికల ముందు రిలీజులు కదా, జగన్‌కు అరపైసా ఫాయిదా కూడా రానివ్వడం చంద్రబాబు క్యాంపుకి ఇష్టం ఉండదు… పైగా చంద్రబాబును విలన్‌గా చూపిస్తారు కదా… ఆ కథాకాలంలో సోనియా పట్ల ప్రబల శతృత్వం కనబరిచిన షర్మిల ఇప్పుడు అదే సోనియా ఆశీస్సులతో కాంగ్రెస్ మనిషి అయిపోయింది…
ఇప్పుడు తనకు ఇరకాటం… తండ్రి వైఎస్ మీద అభిమానంకన్నా, జగన్ పట్ల వ్యతిరేకత, సోనియా మీద అభిమానం ఎక్కువగా పనిచేస్తాయి… తనూ బరిలోకి దిగి ఈ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది… కొత్తగా పీసీసీ పగ్గాలు చేపట్టాక ఏదో ఒక యాక్టివిటీ తీసుకోవాలి కదా… సో, అదే మహి రాఘవ దర్శకత్వంలో రూపొందిన, మమ్ముట్టితోపాటు జీవా నటించిన ఈ సినిమా రిలీజు మీద భలే పొలిటికల్ డిబేట్ ఆరంభమైంది..!
Share this Article