Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ పాట షూటయ్యాక జయలలిత ఇంటికెళ్లి వేడినీళ్ల కాపు పెట్టించుకుందట..!!

February 29, 2024 by M S R

Subramanyam Dogiparthi…. ఫుల్ NTR , జయలలితల సినిమా … NTR , విఠలాచార్య కాంబినేషన్లో హిట్ సినిమా 1969 లో వచ్చిన ఈ గండికోట రహస్యం సినిమా… NTR ద్విపాత్రాభినయం .‌.. ఒకరికి దేవిక , మరొకరికి జయలలిత … ఒక NTR మంగమ్మ శపధంలో పెద్ద NTR లాగా విలాస పురుషుడు . అందులో భాగంగానే కన్నెలోయ్ కన్నెలు కవ్వించే కనుసన్నలు కాముని పున్నమి వెన్నెలు పాట . ఓ కన్నె పిల్లల గుంపుతో NTR హుషారయిన పాట బాగుంటుంది .

విఠలాచార్య మార్కు ఫైటింగులు , భారీ సెట్టింగులు , మారు వేషాలు వగైరా బ్రహ్మాండంగా ఉన్నా , టి వి రాజు సంగీతాన్ని ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే . నీలాల నింగి మెరిసిపడే నిండు చందురుడా , నవ్వెను నాలో జాజి మల్లి పొంగెను నాలో పాలవెల్లి పాటలు సెలయేరులాగా సాగుతాయి … మరదలు పిల్లా ఎగిరిపడకు గడసరి పిల్లా ఉలికి పడకు , తెలిసింది తెలిసింది అబ్బాయి గారు పాటలు జలపాతాల్లాగా ప్రేక్షకుల మీదకు ఉరుకుతాయి . మరదలు పిల్లా పాట షూటింగ్ అయ్యాక ఇంటికెళ్ళి జయలలిత వేడి నీళ్ళ కాపు పెట్టించుకోవలసి వచ్చిందట .

పాడనా మనసు పాడని పాట , వయ్యారి వయ్యారి అందాల బొమ్మ వచ్చిందోయ్ పాటల్లో జయలలిత డాన్సులు బాగుంటాయి . మిగిలిన పాటలు యెంత చక్కని వాడు యెన్ని నేర్చిన వాడు , తగులుకుంటే వదలడేంది ముసలి మామ కూడా బాగుంటాయి .

Ads

మిక్కిలినేని , హేమలత , రాజనాల , ప్రభాకరరెడ్డి , జగ్గారావు ప్రభృతులు నటించారు . రాజబాబు , రమాప్రభల హాస్య జోడీ జైత్రయాత్ర ప్రారంభమయింది ఈ సినిమాతో … డి వి యస్ ప్రొడక్షన్స్ బేనర్ పై నిర్మించబడిన ఈ సినిమా తమిళంలో 1958 లో వచ్చిన నాడోడి మన్నన్ సినిమాకు రీమేక్ … MGR , భానుమతి , బి సరోజాదేవి నటించారు … అనగనగా ఒక రాజు అనే టైటిల్ తో తెలుగు లోకి డబ్ చేయబడింది … నేను ఈ డబ్బింగ్ సినిమాను కూడా చూసా … హిందీలోకి భాగవత్ టైటిల్ తో డబ్ చేయబడింది కూడా …

కాలక్షేపం సినిమా . చూడబులే . యూట్యూబులో ఉంది . మా నరసరావుపేటలో అప్పట్లోనే ఓ రెండు మూడు సార్లు వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . చూసి ఉండకపోతే వాచ్ లిస్టులో పెట్టేసేయండి … #తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #TeluguCinemaNews #telugucinema

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions