వరలక్ష్మి శరత్‌కుమార్… వయస్సు 38 ఏళ్లు… నటుడు శరత్‌కుమార్‌కు మొదటి భార్య ఛాయ ద్వారా కలిగిన సంతానం… నటి రాధిక సవతి తల్లి… చాన్నాళ్లుగా, అంటే 2012 నుంచీ వరలక్ష్మి తెలుగు, తమిళ సినిమాల్లో ప్రధానంగా నటిస్తోంది… ఇదంతా చాలామందికి తెలుసు… పాత్ర మంచిదైతే చాలు, వోకే చెప్పేస్తుంది… నటిగా మెరిట్ ఉంది తనకు…
ఐతే ఇన్నేళ్లుగా ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి తనకు ఎవరితోనో బ్రేకప్ అయ్యిందనీ, అఫయిర్స్ ఉన్నాయనీ మన్నూమశానం రాసిపారేశాయి బోలెడు కథనాలు మన మీడియా… సరే, అవన్నీ సహజమే తారల జీవితాల్లో అనుకుంటే… ఎప్పుడూ పెద్దగా తన వ్యక్తిగత జీవితం గురించి, తన భావి ఆలోచనల గురించి మాట్లాడదు… తనేదో తన పనేదో… అంతే… ఆల్రెడీ జరిగిన బ్రేకప్పుతో ఆమె మనసు విరిగిపోయిందనీ, ఇక జీవితంలో పెళ్లే చేసుకోవద్దని నిర్ణయించుకుందని కూడా వార్తలొచ్చాయి…
Ads
ఇప్పుడు హఠాత్తుగా తన పెళ్లి వార్తలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి… ఒకటో తేదీన ముంబైలో క్లోజ్ సర్కిల్ నడుమ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది… ఆ ఫోటో కూడా బయటికొచ్చింది… కాదు, వాళ్లే బయటికి వదిలారు, ఇక మమ్మల్ని వదిలేయండ్రా బాబూ అన్నట్టుగా… వుడ్ బి పేరు నికోలయ్ సచ్దేవ్… వరలక్ష్మితో 14 ఏళ్ల ప్రేమ, పరిచయం ఉందట… (ఒకరినొకరు అర్థం చేసుకునేలోపు ఆమెకు 38 నిండిపోయాయి…) తను ఓ ఆర్ట్ గ్యాలరీ ఓనర్… (గ్యాలరిస్టు)…
అందరూ అనుకున్నట్టు, ఊహించినట్టు సినిమా ఫీల్డుతో సంబంధం ఉన్నవాడు కాదట… గుడ్ డెసిషన్… ఈ ఏడాదిలోనే కొంతకాలం తరువాత పెళ్లి జరుగుతుందని వరలక్ష్మి కుటుంబం అధికారికంగానే మీడియాకు చెబుతోంది… రాధిక సోషల్ మీడియా ఖాతాల్లోనే ఈ సమాచారం, ఫోటోలు పెట్టేశారు… సో, కంగ్రాట్స్ వరలక్ష్మీ…
అన్నట్టు నిలోలయ్ సచ్దేవ్… పేరు కాస్త ఇంట్రస్టింగుగా ఉంది… ఇంతకీ ఆయనెవరో..?! విశాల్‌తో కలిసి ఆమె వార్తల్ని వండటం కూడా ఇక ఆపేసి మీడియా మరో పర్సనాలిటీని వెతుక్కోవాలి అర్జెంటుగా… శింబు, ధనుష్‌లతో కూడా ఇక ఆమె పేరు జతచేయకండి… 14 ఏళ్ల వాళ్ల ప్రేమను మీడియా ఏమాత్రం పసిగట్టలేకుండా భలే సీక్రెసీ మెయింటెయిన్ చేసింది… చతురవే..! అందుకే విశాల్, ధనుష్, శింబులతో యవ్వారం అని మీడియా ఏం రాస్తున్నా నవ్వుకుంటూ లైట్ తీసుకుందేమో…
Share this Article