శంకర్ జీ….. భీముడికేనా డ్యూయట్ దుర్యోధనుడికి ఉండొద్దా…
అలా సినిమా పూర్తిగా ముస్తాబయిన తరవాత ఫస్ట్ సెన్సారు బోర్డు వాళ్లకు చూపించాల్సి ఉంటుంది. వారిచేత ఓకే అనిపించి సర్టిఫికేట్ వచ్చిన తరవాత డిస్ట్రిబ్యూటర్లకు ప్రదర్శకులకు చూపించి, ఆ పైన రిలీజ్ చేశారు. ఆ సాంగ్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. అది వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఇదీ ఆ పాట…
https://www.youtube.com/watch?v=rfzzCqKjge8&ab_channel=ntr4u
Ads
ఆ తర్వాత పదేళ్లకు వచ్చిన దానవీరశూరకర్ణలో భీముడికి డ్యూయట్ ఉన్నప్పుడు దుర్యోధనుడికి డ్యూయట్ ఉంటే తప్పేంటి అని ఎన్టీఆర్ అతనికి కూడా ఒక డ్యూయట్ పెట్టేశాడు. సినిమా పేరు కర్ణుడిదైనా డ్యూయట్ కర్ణుడికి కాకుండా దుర్యోధనుడి కి సాంగ్ పెట్టేశాడు. భీమ, దుర్యోధనులు వేరైనా డ్యూయట్ మాత్రం ఎన్టీఆర్ కే అని ప్రేక్షకులు నిర్ధారణకు వచ్చేసి ఈ పాటను హిట్ చేసేశారు…
పాట తెలుసు కదా… ఎంతటి మహారాజైనా ఎపుడో ఏకాంతంలో, ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం… అయ్యారే విచిత్రం… బింబాధర మధురిమలు, బిగికౌగిలి ఘుమఘమలు …. కౌగిళ్ల ఘుమఘుమలట… బాగుంది… మధురంగా… కాకపోతే ఏకాంతంలో కూడా భార్యాభర్తలు ఫుల్లు నగలతో, నెత్తి మీద ఆ భారీ కిరీటంతో కనిపించడమే అసహజం… ఏమో, అదేనేమో చిత్రం అంటే… ఎన్టీయార్‌కు టైమ్‌కు తోచలేదు గానీ కీచకుడికీ ఓ సాంగ్ తగిలించేవాడు… అన్నట్టు అయ్యారే చిత్రం పాట లింక్ ఇదుగో…
Share this Article