బరితెగించిన కోడి బజారులో గుడ్డు పెట్టిందట..! ఎలాగూ దీన్ని నడిపే సీన్ లేదు, ఎలాగూ అమ్ముకుంటున్నాం, ఇక తలుపు చాటు కన్ను కొట్టడాలు దేనికి, బజారులోకొచ్చి పైట జార్చి కవ్విస్తే పోలా అనుకున్నట్టుంది ఆహా ఓటీటీ యాజమాన్యం… ఎస్, ఇన్నాళ్లూ రకరకాల ఓటీటీల్లో పరమ బూతు, అశ్లీల, అసభ్య కంటెంటు ‘కుర్చీ మడతబెట్టి’ ధోరణిలో చెలరేగిపోతుంటే, కాస్త ఆహా ఓటీటీ కాస్త పద్ధతిని పాటించింది… ఇప్పుడిక తనూ ‘రాజమండ్రి రాగ మంజరి, మాయమ్మ పేరు తెల్వనోల్లు లేరు మేస్తిరీ’ అన్నట్టు గజ్జె కట్టింది…
పద్దతిగా ఉండేవాళ్లకు, కాస్త సంప్రదాయ పోకడల్లో శృంగార జీవితాలు గడిపే వాళ్లకు కొన్ని కొత్త పోకడలు చిరాకు పుట్టిస్తాయి… ఉదాహరణకు, కారు తాళపుచెవులు ఒకచోట పోసి, లాటరీ వేసి, ఎవరికి ఏ కారు కీ వస్తే సదరు కీ ఓనర్ భార్యతో ఆ రాత్రి గడపడం… అఫ్కోర్స్, ఆ ఓనర్‌కూ ఎవరో ఒకరు దొరుకుతారు కదా కొత్తదనం కోసం… ఎస్, గతంలోని రవికెల పండగలా అన్నమాట… అంతేకాదు, ఈమధ్య ‘భార్యల మార్పిడి’ (వైఫ్ స్వాపింగ్) కూడా పలుచోట్ల పాపులర్ అట…
విషయానికి వస్తే… ఆహా ఓటీటీలో నేరుగా ఓ సినిమా రిలీజ్ చేశారు… పేరు మిక్స్అప్… ఆహా కంటెంటుకు తగిన టైటిల్, బోల్డ్‌గా ఉంది… సింపుల్‌గా చెప్పాలంటే… అభి, నిక్కీ భార్యాభార్తలు… నిక్కీ రాగమంజరి టైపు… తనకు అరాచకంగా బెడ్ మీద చెలరేగిపోయే మగాడు కావాలి… కానీ అభి పూర్తి రివర్స్, సున్నితంగా డీల్ చేస్తుంటాడు… దీంతో అతడి మీద ఆమెకు వైరాగ్యం… తనకు సరిగ్గా అది చేతకాదనే భావన… (మీకు అర్థమవుతోంది కదా…) ఇద్దరి నడుమ ఇదే దూరం పెంచుతూ ఉంటుంది…
Ads
మరో జంట… సాహూ, మైథిలి… వీళ్ల ఆ జంటకు రివర్స్ మోడ్… అంటే సాహూ పూర్తిగా వంగా వారి యానిమల్ టైప్… అంటే నాటునాటు వీర నాటు, మోటు నాటు పిచ్చనాటు అనే చంద్రబోస్ పాట తరహా అన్నమాట… మీదపడి రెచ్చిపోవడమే… కానీ భార్య మైథిలి కన్వెన్షనల్ మోడ్… అలా సున్నిత శృంగారం సాహూకు నచ్చదు… సో, వీళ్లిద్దరి నడుమ దూరం పెరుగుతూ ఉంటుంది… విడాకులకు ఈ జంటలు దగ్గరవుతాయి… ఓ ఫ్యామిలీ కౌన్సిలర్ సూచన మేరకు కలిసి గోవా వెళ్తారు…
మోటుతనం ఇష్టపడే సాహూకు సేమ్ ట్రెండీ నిక్కీ… నాజూకు యవ్వారం కాంక్షించే అభికి మైథిలి… సేమ్, సేమ్… సాన్నిహిత్యం ఏర్పడుతుంది… ఇదే కథ… లస్ట్ స్టోరీస్, సాక్రెడ్ గేమ్స్, రాగిణి ఎంఎంఎస్, ట్రిపుల్ ఎక్స్ వంటివి యాదికొస్తున్నయా..? దాదాపు ఇదీ అదే… నిజానికి సినిమాల్లోనే ఇంటిమేట్ సీన్లు, న్యూడ్ సీన్లు రెచ్చిపోతుండగా, ఇక ఏ సెన్సారూ అడ్డంకులు లేని ఓటీటీల్లో ఇలాంటి కంటెంట్లకు, బూతులకు, అదే పనిగా పదే పదే అదే పనిని చూపించే సీన్లకు కొదవేముంది..? సో, ఈ మిక్స్ అప్ కూడా అదే కంటెంటుతో నాటు శృంగారం, నీటు సంభోగం యవ్వారాలను, తేడాలను చర్చిస్తుంది…
గతంలో యువకుల కోసం మలయాళ బూతు సినిమాలను పలు థియేటర్లలో మార్నింగ్ షోలు వేసేవాళ్లు… భాష రాకపోయినా, తెలియకపోయినా, అర్థం గాకపోయినా ఆ ఘాటు సీన్ల కోసం వెళ్లేవాళ్లు… చాలామంది ఇంగ్లిషు సినిమాలకు కూడా వెళ్లేవాళ్లు… కానీ ఎప్పుడైతే అరచేతిలోకి అన్నిరకాల శృంగార ప్రక్రియలు సెల్ ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చాయో… చిన్నాచితకా బూతు కంటెంట్ ఎవరినీ ఆనకుండా పోయింది… ఇలాంటి కొత్త కంటెంటును తెరతీస్తున్నారు నిర్మాతలు…
అబ్బే, మడికట్టుకుని కూర్చుంటే కాసులు రాలవు బాయ్యా… అన్నట్టుగా ఓటీటీలు కుమ్మేస్తున్నాయి కదా… చివరకు ఆహా కూడా ఆహా ఓహో అంటూ ఆ బాటలోకి వచ్చేసింది… ఇక కుమ్మేయండి, ఎలాగూ అభి నీటు బాట నుంచి సాహూ నాటు బాటలోకి వచ్చేశారు కదా…!! ఇప్పుడు అంతా వంగా సందీప్ రెడ్డి స్టయిల్… ఇంకెన్నాళ్లు జావేద్ అఖ్తర్ టైపు…!!
Share this Article