ప్రభాస్… ఇన్ని దశాబ్దాల్లో సౌత్ ఇండియన్ హీరోలు ఎవరికీ సాధ్యం కాని నేషనల్ పాపులారిటీని సాధించిన తెలుగు హీరో… ఎక్సలెంట్ కెరీర్… బాహుబలి తరువాత అంత బలంగా కనెక్టయిన సినిమాలు ఏవీ రాకపోయినా సరే… ప్రస్తుతం హిందీ స్టార్ హీరోలకు కూడా లేని ప్రిస్టేజియస్ ప్రాజెక్టులు తన చేతిలో ఉన్నయ్… దటీజ్ ప్రభాస్…
ఐతే ఈమధ్య కొన్ని వార్తలు… ప్రభాస్ లండన్‌లో ఇల్లు కొన్నాడు అని… అక్కడెందుకు ఇల్లు అనే డౌటొచ్చిందా..? ఎస్, తనకు వరుస సర్జరీలు… కాళ్లు, కీళ్లు చక్కబడటం లేదు… యూరప్‌లో పలు సర్జరీలు జరిగాయి, కానీ ఇంకా సమస్యలున్నయ్… ఆదిపురుష్ సందర్భంగా తను తిరుపతిలో వేదిక ఎక్కలేకపోతే లిఫ్ట్ పెట్టాల్సి వచ్చింది… సాలార్‌లో కూడా విధిలేక డబుల్స్‌తో పని కానిచ్చారనే వార్తలూ ఉన్నయ్… సర్జరీకి వెళ్లిన ప్రతిసారీ నెలకు 60 లక్షల దాకా అద్దె కట్టేవాడట తన నివాసానికి…
అందుకని ఓ ఇల్లే కొంటే సరి అనుకుని ఇండిపెండెంట్ హౌజ్ కొన్నాడని వార్తలు… నిజానికి వీటికన్నా ఓ ఇంగ్లిష్ సినిమా వెబ్సైటులో వచ్చిన వార్త ఒకటి ఇంట్రస్టింగు… చాలా తెలుగు సైట్లు కూడా క్యారీ చేశాయి… అదేమిటంటే… బాహుబలి తరువాత తనకు ఏకంగా 5 వేల పెళ్లి సంబంధాలు వచ్చాయనేది వార్త సారాంశం… అంటే సొంత ఇల్లు కొన్న వార్త కాదు, 44 ఏళ్లొచ్చాయి కదా, ఓ ఇంటివాడు ఎప్పుడవుతాడనేదే మీడియాకు ఇంపార్టెంట్ న్యూస్ అయిపోయింది…
Ads
నిజానికి ఈ 5 వేల సంబంధాలు అనేది కొత్త వార్తేమీ కాదు, హఠాత్తుగా దీన్ని మళ్లీ ఎందుకు రాస్తున్నారో తెలియదు… కానీ ఈ 5 వేలు అనేది కూడా చాలా తక్కువ సంఖ్య… అసలు తనను చూస్తే, షేక్ హ్యాండ్ ఇస్తే, ఓ సెల్ఫీ దిగితే మురిసిపోయే వాళ్లు లక్షలు… అలాంటిది తనను పెళ్లి చేసుకోవాలని ఆశపడే తల్లిదండ్రులకు, ఆడపిల్లలకు కొదువ ఏముంటుంది..? వాళ్ల సామాజికవర్గంలోనే కొన్ని వేల మంది క్యూ కడతారు… కారణం కేవలం తన పాపులారిటీ మాత్రమే కాదు…
తను గుడ్ హ్యూమన్ బీయింగ్… చిల్లర మాటలుండవ్, మనుషులను ప్రేమిస్తాడు… ఆస్తిపాస్తులున్నయ్, కృష్టంరాజు వారసత్వమే కాదు తను సొంతంగా నిర్మించుకున్న ట్రెమండస్ కెరీర్ ఉంది… పిచ్చిగా ఆరాధించే ఫ్యాన్జనం ఉన్నారు… తన కెరీర్ ఇక అయిపోయినట్టే అంటున్న సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణుస్వామి కూడా ఓ ఇంటివాడవుతాడు అంటే నిండుగా ఆశీర్వదిస్తాడు… అదీ ప్రభాస్ అంటే…
తను అనుష్క శెట్టి జంట అవుతారనే వార్తలు బాగా వినిపించేవి… తరువాత కృతిసనన్ పేరు ప్రచారంలోకి వచ్చింది… బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో కూడా ఈ మాట అనిపించాలని విశ్వప్రయత్నం చేశాడు… కొన్ని ఇతర అఫయిర్స్, సంబంధాల వార్తలు కూడా వచ్చాయి… కానీ ప్రభాస్ తన ప్రైవేటు లైఫ్ మీద ఒక్క మాట కూడా ఎక్కడా తూలడు… అంతెందుకు ప్రమోషన్ మీట్లలో కూడా చాలా చాలా సంక్షిప్తంగా, స్ట్రెయిట్‌గా ముగించేస్తాడు…
కాకపోతే తన కీళ్లే తన మాట వినడం లేదు… ఐనా సరే, ఇప్పుడు కల్కి వేగంగా తయారవుతోంది… అమితాబ్, దీపిక పడుకోన్ వంటి స్టార్లతో దేశమంతా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తోంది… రాజా సాబ్ లేటవుతోంది… సాలార్-2 రావల్సి ఉంది… మంచువారి కన్నప్పలోనూ కనిపించాల్సి ఉంది… వంగా సందీప్‌రెడ్డి తీయాల్సిన స్పిరిట్ ఉంది… రావణమ్, శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా ఉన్నాయి… కొన్ని వేల కోట్ల ప్రతిష్టాత్మక సినిమా ప్రాజెక్టులు ప్రభాస్ మోకాలి ఆరోగ్యం మీద ఆధారపడి ఉన్నయ్…!!
Share this Article